Jump to content

ఆపరేషన్ బ్లూస్టార్

వికీపీడియా నుండి
ఆపరేషన్ బ్లూ స్టార్
పంజాబ్ తిరుగుబాటులో భాగము
దస్త్రం:Operation Bluestar Aftermath on Akal Takht.jpg
దాడి జరిగిన తర్వాత అకాల్ తక్త్ ను పునర్నిర్మించడానికి భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే దాన్ని సిక్కు సమాజం పూర్తిగా కూలదోసి పునర్నిర్మించింది.[9][10]
తేదీ1–10 జూన్ 1984 (1 వారం , 2 రోజులు)
ప్రదేశంహర్‌మందిర్ సాహిబ్, అమృత్‌సర్, పంజాబ్, భారతదేశం
ఫలితం* జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే మరణం
  • సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చేత ఇందిరాగాంధీ హత్య, తదనంతరం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు
Parties to the civil conflict
 India
పాల్గొన్న యూనిట్లు:
  • భారతీయ సైన్యం
  • సీఆర్పీఎఫ్ పోలీసులు
  • border= బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
  • పంజాబ్ పోలీసులు
సహకరించింది:
 Soviet Union (సోవియట్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మీద ఎక్కుపెట్టిన ప్రచారం)[1]
 United Kingdom (ఆయుధాలు, సమాచారం, గూఢచర్య సేవలు)[2]
 Israel (శిక్షణ)[3][4]
సిక్కు మిలిటెంట్లు
  • దాందామీ తక్సల్ ఇంకా ఇతర గ్రూపులు
  • మాజీ సిక్కు సైన్యాధికారులు
    [5][6][7]
రహస్య సహకారం:
 Pakistan (ఆరోపణ)[8]
సేనాపతులు, నాయకులు
India జెనరల్ అరుణ్ శ్రీధర్ వైద్య
India మేజర్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్
India లెఫ్టినెంట్ జనరల్ రంజిత్ సింగ్ దయాల్[11]
India లెఫ్టినెంట్ జనరల్ కృష్ణస్వామి సుందర్జీ
జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే  
ఆమ్రిక్ సింగ్ 
షాబేగ్ సింగ్ 
బలం
  • 9వ డివిజన్ నుంచి 10,000 మంది సైనిక దళాలు
  • పారాచూట్ రెజిమెంట్ నుంచి 175 మంది, ఇంకా ఫిరంగులు
  • సీఆర్పీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 700 దళాలు
  • 150 పంజాబ్ పోలీస్ ఆఫీసర్లు
  • 16వ కావల్రీ నుంచి 7 వైజయంత MBT లు
  • 8 BMP-1, 3 OT-64 SKOT APC
  • 200+ మిలిటెంట్లు[12]: 35 
WW2 తుపాకులు, స్టెన్ గన్లతో కూడిన 100-150 విప్లవకారులు.[13][14]
ప్రాణ నష్టం, నష్టాలు
భారతీయ సైన్యం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 83 మంది మరణించారు[15][16][17][18]
249 injured[19]

1984 సెప్టెంబరులో రాజీవ్ గాంధీ విడుదల చేసిన సమాచారం ప్రకారం 700 మరణించారు.[18][20]

1 OT-64 SKOT disabled
492 పై చిలుకు మరణించారు (వీరిలో సిక్కు యాత్రికులు కూడా ఉన్నారు)[21]
ఈ ఆపరేషన్ లో సుమారు 5,000 మంది పైగా పౌరులు మరణించారు,[22][23] స్వతంత్ర పరిశీలనల ప్రకారం రెండు నెలల వ్యవధిలో 18 నుంచి 20 వేల మంది సిక్కు పౌరులు గాయపడ్డారు;[24] భారత ప్రభుత్వం మాత్రం 554 పౌరులు మాత్రమే గాయపడ్డారని తెలియజేసింది.[15][25]

ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి 10 లోపల జరిగిన భారతీయ సైనిక చర్య. ఇది పంజాబ్ లోని అమృత్‌సర్ లోగల హర్‌మందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) కాంప్లెక్స్ నుంచి సిఖ్ దాందానీ తక్సల్ నాయకుడైన జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే, అతని అనుచరులను బయటకు రప్పించడానికి చేసిన చర్య. అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరా గాంధీ ఈ చర్యకు ఆదేశించింది.[26] మాజీ జనరల్ ఎస్. కె. సిన్హా ప్రకారం ఇందిరా గాంధీ ఈ సంఘటనకు సుమారు 18 నెలల ముందు, అంటే తిరుగుబాటు దారులు ఆలయంలోని ప్రవేశించక ముందునుంచే సైన్యాన్ని ఆపరేషన్ కు సిద్ధం కమ్మని ఆదేశించింది.[27] 1982 జూలైలో పంజాబ్ కు చెందిన అకాళీదళ్ పార్టీ అధినేత హరిచంద్ సింగ్ లోంగోవాల్, జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గాను ఆలయం లోపల ఉండవల్సిందిగా ఆహ్వానించాడు.[28][29]

భారత నిఘా సంస్థలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ముగ్గురు ప్రముఖులు, భారతదేశం కోసం ప్రధాన యుద్ధాలలో పోరాడిన కోర్ట్-మార్షల్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ షబేగ్ సింగ్, బల్బీర్ సింగ్, అమ్రిక్ సింగ్ లను "ఖలిస్తాన్ ఉద్యమం యొక్క ప్రముఖ నాయకులు"గా నివేదికలలో ప్రస్తావించాయి. వీరు 1981, 1983 మధ్య పాకిస్తాన్కి కనీసం ఆరు పర్యటనలు చేశారు. షబేగ్ సింగ్ అకల్ తఖ్త్ సాహిబ్లో ఆయుధ శిక్షణను అందించాడు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని గురుద్వారాలలో వీరి బలగాలకు శిక్షణ అందిస్తున్నట్లు ఆరోపించింది. ఈ ఆరోపణలపై అమ్రిక్ సింగ్ స్పందిస్తూ, ఈ ప్రాంతాలలో గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులకు సాంప్రదాయ ఆయుధాల శిక్షణా శిబిరాలు జరుగుతూ ఉన్నాయని పేర్కొన్నాడు.[30] అమెరికన్ గూఢచర్య సంస్థ CIA, పాకిస్థాన్ కు చెందిన ISI కలిసి పంజాబ్ కోసం ఒక ప్రణాళికపై పనిచేస్తున్నట్లు సోవియట్ గూఢచార సంస్థ కెజిబి భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కి సమాచారం అందించింది. రా అధికారులు ఒక పాకిస్తానీ ఆర్మీ అధికారిని విచారించినప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వెయ్యి మందికి పైగా శిక్షణ పొందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను భింద్రన్‌వాలే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహాయం చేయడానికి పాకిస్తాన్ పంజాబ్‌లోకి పంపినట్లు సమాచారం అందింది. కానీ సరిహద్దులో ఉండే ఉన్నత స్థాయి భద్రత కారణంగా కేవలం సాధారణ సిక్కులు మాత్రమే భింద్రన్‌వాలే పక్షంలో చేరగలిగారు. అనేక మంది పాకిస్తానీ ఏజెంట్లు విధ్వంసానికి పాల్పడే ప్రణాళికలతో కాశ్మీర్, కచ్ ప్రాంతంలోని గుజరాత్ స్మగ్లింగ్ మార్గాల గుండా వచ్చారు.

1981లో సోవియట్‌ యూనియన్, ఒక స్వతంత్ర దేశాన్ని సృష్టించాలనుకునే సిక్కు తీవ్రవాదులకు ISI అందించిన ఆయుధాలు, డబ్బు వివరాలను కలిగి ఉన్న నకిలీ పత్రం ఆధారంగా ఆపరేషన్ కాంటాక్ట్‌ను ప్రారంభించింది.[1] 1982 నవంబరు లో, కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, సోవియట్ యూనియన్ నాయకుడు యూరి ఆండ్రోపోవ్, పంజాబ్‌లో మతపరమైన అలజడులను ప్రేరేపించడానికి, ఖలిస్తాన్‌ను స్వతంత్ర సిక్కు రాజ్యంగా రూపొందించడానికి ISI ప్రణాళికలను వివరించే నకిలీ పాకిస్తానీ గూఢచార పత్రాలను రూపొందించే ప్రతిపాదనను ఆమోదించారు.[31] సోవియట్‌లు అందించిన సమాచారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇందిరా గాంధీ సిక్కులకు CIA రహస్యంగా మద్దతు ఇస్తున్నారని భావించి పంజాబ్‌లోకి సైన్యాన్ని తరలించాలనే నిర్ణయం తీసుకుంది.[32]

1984 జూన్ 1న, తీవ్రవాదులతో చర్చలు విఫలమైన తర్వాత, ఇందిరా గాంధీ ఆనంద్‌పూర్ తీర్మానాన్ని తిరస్కరించి ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ప్రారంభించాలని సైన్యాన్ని ఆదేశించింది. పంజాబ్ అంతటా ఉన్న అనేక సిక్కు దేవాలయాలపై ఏకకాలంలో దాడులు మొదలయ్యాయి.[33] మిలిటెంట్ల సామర్థ్యం గురించి తెలుసుకోవడానికి జరిపిన తొలి కాల్పులలో 8 మంది సాధారణ ప్రజలు మరణించారు.[13][34] 1984 జూన్ 3 తేదికి వివిధ సైన్యాల విభాగాలు, పారామిలిటరీ దళాలు స్వర్ణదేవాలయాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ జరపడం కోసం సాధారణ యాత్రీకులను బయటకు రమ్మని సైన్యాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు, జూన్ 5 వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఎవరూ బయటికి రానట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. కానీ 2017లో అమృత్‌సర్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గుల్బీర్ సింగ్ ఇచ్చిన తీర్పులో ఆర్మీ అధికారులు అలాంటి హెచ్చరికను జారీ చేయలేదని పేర్కొన్నాడు.[35] జూన్ 8 కల్లా ఆలయంపై సైనిక చర్య పూర్తయింది. తర్వాత పంజాబ్ మొత్తం విప్లవకారుల ఏరివేతకు ఆపరేషన్ వుడ్‌రోజ్ అమలు చేశారు.[8]

సైన్యం మిలిటెంట్ల దగ్గరున్న ఆయుధాలను తక్కువ అంచనా వేసింది. వారి దగ్గర చైనాలో తయారైన, సైనికుల కవచాలను కూడా ఛేదించగల రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ లాంచర్లు కూడా ఉన్నాయి. సైన్యం యుద్ధ ట్యాంకులు, భారీ ఫిరంగిలు తీవ్రవాదులపై దాడి చేయడానికి ఉపయోగించారు. దానికి ప్రతిగా వారు బలీయమైన కట్టడమైన అకల్ తఖ్త్ నుండి ట్యాంక్ వ్యతిరేక మెషిన్-గన్ కాల్పులతో ప్రతిస్పందించారు. 24 గంటల పోరాటం తర్వాత సైన్యం ఆలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 83 మంది సైనికులు మరణించగా, 249 మంది గాయపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 1592 మంది మిలిటెంట్లు పట్టుబడ్డారు. మిలిటెంట్లు, సాధారణ పౌరులు కలిపి 554 మంది మరణించారు.[15] ఈ సంఖ్య స్వతంత్ర పరిశీలకులు[25] పేర్కొన్న 18,000 నుంచి 20,000 సంఖ్య కన్నా చాలా తక్కువ.[24] ప్రభుత్వ నివేదిక ప్రకారం ఎక్కువమంది సాధారణ పౌరులు మరణించడానికి కారణం మిలిటెంట్లు ఆలయంలో చిక్కుకుపోయిన వారిని తమకు రక్షణగా ఉపయోగించుకోవడం.[36]

బ్రిటీష్ వారి జోక్యం

[మార్చు]

యునైటెడ్ కింగ్‌డమ్ లోని మార్గరెట్ థాచర్ ప్రభుత్వం ఈ దాడికి భారత ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నదని తెలుసుకుని ప్రత్యేక ఎయిర్ సర్వీసు అధికారిని సహాయం కోసం పంపింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Christopher Andrew (10 October 2006). The World Was Going Our Way: The KGB and the Battle for the Third World: Newly Revealed Secrets from the Mitrokhin Archive. Basic Books. p. 152. ISBN 978-0-465-00313-6.
  2. 2.0 2.1 Doward, Jamie (28 October 2017). "British government 'covered up' its role in Amritsar massacre in India". Theguardian.com. Archived from the original on 28 October 2017. Retrieved 29 October 2017.
  3. "Mossad Trained Indian Commandos For Operation Blue Star in 1984?". Latest Asian, Middle-East, EurAsian, Indian News (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-06-11. Retrieved 2021-06-10.
  4. DelhiJune 6, Prabhash K. Dutta New; June 6, 2018UPDATED; Ist, 2018 15:32. "Israel's invisible hand behind Operation Blue Star of 1984". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-10. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Brar, K.S. (July 1993). Operation Blue Star: the true story. UBS Publishers' Distributors. pp. 56–57. ISBN 978-81-85944-29-6.
  6. Dogra, Cander Suta. "Operation Blue Star – the Untold Story". The Hindu, 10 June 2013. Web.
  7. Cynthia Keppley Mahmood (2011). Fighting for Faith and Nation: Dialogues with Sikh Defenders. University of Pennsylvania Press. pp. Title, 91, 21, 200, 77, 19. ISBN 978-0-8122-0017-1. Retrieved 9 August 2013
  8. 8.0 8.1 Kiessling, Hein (2016). Faith, Unity, Discipline: The Inter-Service-Intelligence (ISI) of Pakistan. Oxford University Press. ISBN 978-1849048637.
  9. Tatla, Darshan Singh (1993). The politics of homeland : a study of the ethnic linkages and political mobilisation amongst Sikhs in Britain and North America (Thesis). University of Warwick. p. 133.
  10. "Architecture & History". akaltakhtsahib.com. Archived from the original on 13 October 2017. Retrieved 10 October 2017.
  11. "Temple Raid: Army's Order was Restraint". The New York Times. 15 జూన్ 1984. Archived from the original on 13 నవంబరు 2012. Retrieved 6 ఫిబ్రవరి 2012.
  12. Karim, Afsir (1991). Counter Terrorism, the Pakistan Factor. Lancer Publishers. pp. 33–36. ISBN 978-8170621270.
  13. 13.0 13.1 Ram Narayan Kumar; Amrik Singh; Ashok Agrwaal (2003). Reduced to Ashes: The Insurgency and Human Rights in Punjab : Final Report. South Asia Forum for Human RIghts. p. 36. ISBN 978-99933-53-57-7.
  14. Tarkunde et al. 1985, p. 65.
  15. 15.0 15.1 15.2 White Paper on the Punjab Agitation. Shiromani Akali Dal and Government of India. 1984. p. 169.
  16. "The Official Home Page of the Indian Army". Archived from the original on 27 May 2013. Retrieved 10 October 2017.
  17. "What happened during 1984 Operation Blue Star?". India Today. Retrieved 12 September 2019. Official reports put the number of deaths among the Indian army near about 20,000 and they put the number of civilian deaths at 492, though independent estimates ran much higher.
  18. 18.0 18.1 I.S. Jaijee. Politics of Genocide: 1984–1998. Ajanta Publishers, New Delhi, India. P.96
  19. "Army reveals startling facts on Bluestar". Tribune India. 30 May 1984. Retrieved 9 August 2009.
  20. Jugdep S Chima (1 August 2008). The Sikh Separatist Insurgency in India: Political Leadership and Ethnonationalist Movements. SAGE Publishing India. pp. 114–. ISBN 978-93-5150-953-0.
  21. November 30, india today digital; February 10, 1999 ISSUE DATE; June 6, 2014UPDATED; Ist, 2019 08:47. "The untold story before Operation Bluestar". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-10. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  22. Grewal, J. S. (1998). The Sikhs of the Punjab (The New Cambridge History of India II.3) (Revised ed.). Cambridge, United Kingdom: Cambridge University Press. pp. 205–241. ISBN 9781316025338. Retrieved 16 April 2020.
  23. Karim 1991, p. 35.
  24. 24.0 24.1 Jaijee, Inderjit Singh (1999). Politics of Genocide: Punjab, 1984-1998 (in ఇంగ్లీష్). Ajanta Publications. p. 108. ISBN 978-81-202-0415-7. Adding 8,000 "missing in Woodrose" plus deserting soldiers killed on their way back to Amritsar and villagers killed as they tried to reach the Darbar Sahib at the time of Operation Bluestar, the civilian death toll in the months of June and July 1984, may be somewhere between 18,000 to 20,000.
  25. 25.0 25.1 June 6, India Today Web Desk. "What happened during 1984 Operation Blue Star?". India Today (in ఇంగ్లీష్). Retrieved 9 February 2021. Official reports put the number of deaths among the Indian army at 83 and the number of civilian deaths at 492, though independent estimates ran much higher.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  26. Swami, Praveen (16 January 2014). "RAW chief consulted MI6 in build-up to Operation Bluestar". The Hindu. Chennai, India. Archived from the original on 18 January 2014. Retrieved 31 January 2014.
  27. Dhawan, Prannv; Singh, Simranjit. "Punjab's Politicians Are Using the Bogey of Militancy Again". The Wire. Retrieved 27 April 2020.
  28. Khushwant Singh, A History of the Sikhs, Volume II: 1839–2004, New Delhi, Oxford University Press, 2004, p. 332.
  29. "Operation Blue Star: India's first tryst with militant extremism – Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 5 November 2016. Archived from the original on 3 November 2017. Retrieved 29 October 2017.
  30. Gupta, Shekhar (December 31, 1983). "Golden Temple complex begins to resemble a military base on full alert". Retrieved 25 August 2020.
  31. Christopher Andrew (2 January 2014). The Mitrokhin Archive II: The KGB in the World. Penguin Books Limited. pp. 278–. ISBN 978-0-14-197798-0.
  32. Christopher Andrew (2 January 2014). The Mitrokhin Archive II: The KGB in the World. Penguin Books Limited. pp. 279–. ISBN 978-0-14-197798-0.
  33. Wolpert, Stanley A., ed. (2009). "India". Encyclopædia Britannica.
  34. Tarkunde et al. 1985, p. 56.
  35. "In wrong place at wrong time: Forgotten story of Operation Blue Star's 'Jodhpur detainees'". Https. 21 December 2019. Retrieved August 12, 2020.
  36. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Kiss_Khalistan అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు