ఇందుకూరి రఘురాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ
ఇందుకూరి రఘురాజు

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 18 జులై 1973
బొడ్డవర , ఎస్‌.కోట మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రామరాజు, రాణి
జీవిత భాగస్వామి సుధారాజు
సంతానం రామరాజు, పూజిత

ఇందుకూరి రఘురాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి శాశనమండలి సభ్యులు గా ఎన్నికయ్యారు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఇందుకూరి రఘురాజు 18 జులై 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, ఎస్‌.కోట మండలం, బొడ్డవర గ్రామంలో రామరాజు, రాణి దంపతులకు జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ఇందుకూరి రఘురాజు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా, శృంగవరపుకోట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 32 వేల ఓట్లు పొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 31 వేల ఓట్లు పొందారు. మొత్తం రాష్ట్రంలో అధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో రఘురాజు మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయన అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి విజయనగరం జిల్లా ప్లానింగ్‌ కమిటీ సభ్యుడిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పని చేశారు. రఘురాజు 5 సెప్టెంబర్ 2018న భారతీయ జనతా పార్టీని నుంచి బయటకు వచ్చేసారు.


అనంతరం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరి[2] రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై పార్టీ బలోపేతానికి పని చేశారు. శృంగవరపు కోట నియోజకవర్గంతో పాటు విజనయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషమైన సేవలు అందించారు.

ఇందుకూరి రఘురాజు సేవలను గుర్తించి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 12 నవంబర్ 2021న వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రకటించింది.[3][4] ఆయన 20 నవంబర్ 2021నన నామినేషన్ దాఖలు చేశారు.[5]రఘురాజు 26 నవంబర్ 2021న ఏకగ్రీవంగా ఎన్నికై,[6] 8 డిసెంబర్ 2021న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు.[7]

ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Sakshi (5 September 2018). "వైఎస్సార్ సీపీలో చేరిన రఘురాజు". Archived from the original on 5 September 2018. Retrieved 1 January 2022.
  3. Andhrajyothy (12 November 2021). "వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడికి ఎట్టకేలకు అదృష్టం!". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  4. Eenadu (13 November 2021). "వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  5. Prajasakti (20 November 2021). "ఎంఎల్‌సి స్థానానికి రఘురాజు నామినేషన్‌ | Prajasakti". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  6. Prajasakti (26 November 2021). "ఎంఎల్‌సిగా రఘురాజు ఏకగ్రీవం". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  7. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.