Jump to content

ఇదే మా కథ

వికీపీడియా నుండి
ఇదే మా కథ
దర్శకత్వంగురు పవన్‌
నిర్మాతజి.మహేష్‌
తారాగణంసుమంత్ అశ్విన్
శ్రీకాంత్‌
భూమిక చావ్లా
తాన్యా హోప్
ఛాయాగ్రహణంసి. రామ్ ప్ర‌సాద్‌
కూర్పుజునైద్ సిద్దికి
సంగీతంసునీల్ కశ్యప్
విడుదల తేదీ
10 అక్టోబర్ 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

'ఇదే మా కథ రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు సినిమా. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్‌, భూమిక చావ్లా, తాన్యా హోప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురు పవన్‌ దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రానికి సంబంధించిన 'నీ మాటే వింటుంటే... నీతోనే నేనుంటే..అంటూ సాగే పాటను 2021 మార్చి 2 న విడుదల చేశారు.[2] ఈ చిత్రాన్ని 2021 మార్చి 19న విడుదల చేయాలనుకున్నారు, కోవిడ్ నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు.[3]

ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తో సాధారణ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్న వివిధ వయసులకు సంబంధించిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా అసమానతలను దాటి వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారనేది? ఈ సినిమా కథ.[4][5]

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: జి.మహేష్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గురు పవన్
  • సంగీతం: సునీల్‌ కశ్యప్
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌. చిరంజీవి
  • బ్యానర్ : గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌
  • సినిమాటోగ్రాఫ‌ర్ సి. రామ్ ప్ర‌సాద్‌
  • ఆర్ట్ డైరెక్ట‌ర్: జెకె మూర్తి
  • ఎడిట‌ర్: జునైద్ సిద్దికి
  • కొరియోగ్రాఫ‌ర్: ఆనీ మాస్ట‌ర్‌
  • ఫైట్స్ : పృథ్విరాజ్
  • పిఆర్ఓ : వంశీ శేఖర్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 November 2020). "అందరి కథ". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  2. Eenadu (2 March 2021). "'మనసంతా చేరి మార్చావే దారి' అంటోన్న సుమంత్‌ - idhe maa katha lyrical song priya priya". www.eenadu.net. Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  3. Andhrajyothy (4 February 2021). "'ఇదే మా క‌థ' విడుదల తేదీ ఫిక్స్‌". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  4. HMTV (19 November 2020). "సుమంత్ అశ్విన్ 'ఇదే మా కథ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  5. Eenadu (2 October 2021). "రివ్యూ: ఇదే మా కథ". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఇదే_మా_కథ&oldid=4212811" నుండి వెలికితీశారు