తాన్యా హోప్
తాన్యా హోప్ | |
---|---|
జననం | సెప్టెంబరు 11, 1996 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
కుటుంబం | రవి పురవంకర (తండ్రి) |
తాన్యా హోప్ దక్షిణ భారత చలనచిత్ర నటి.[1] 2016లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]తాన్యా హోప్ 1996, సెప్టెంబరు 11న కర్నాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి రవి పురవంకర వ్యాపారవేత్త. బెంగళూరులోని సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూలులో పాఠశాల విద్యను పూర్తిచేసిన తాన్యా, ఇంగ్లాండులోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల కోర్సులో గ్రాడ్యుయేషన్ చదివింది.[2]
మోడలింగ్ రంగం
[మార్చు]పూణేలో టియారా ట్రైనింగ్ స్టూడియోలో మోడలింగ్‌లో శిక్షణకు తీసుకున్న తాన్యా, 2015లో ఫెమినా మిస్ ఇండియా కోల్‌కతాను గెలుచుకుంది.[3][4] అదే సంవత్సరం ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచింది.
సినిమారంగం
[మార్చు]2016 సంవత్సరంలో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో నిత్య పాత్రతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.[5][6] ఆ తర్వాత 2017లో జగపతి బాబు నటించిన పటేల్ సర్ సినిమాలో ఏసిపి కాథరీన్ పాత్రలో నటించింది. మాడిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన తడమ్ చిత్రంతో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టి విద్యా ప్రదీప్, స్మృతి వెంకట్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లలో ఒకరుగా నటించింది.[7] సుజయ్ కె శ్రీహరి దర్శకత్వంలో ఉపేంద్ర నటించిన తెలుగు, కన్నడ ద్విభాష చిత్రం హోమ్ మినిస్టర్ సినిమాలో జెస్సీ పాత్రలో నటించింది.[8] పేపర్ బాయ్ సినిమాలో సంతోష్ శోభన్‌తో కలిసి నటించింది.
దర్శన్ నటించిన 51వ చిత్రం యజమానలో ప్రధానపాత్రలో నటించింది. పాట బసన్నీలో పాత్రలో కనిపించింది.[9]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | అప్పట్లో ఒకడుండేవాడు | నిత్య | తెలుగు | తెలుగు తొలి చిత్రం | [10] |
నేను శైలజ | తాన్యా హోప్ | అతిథి పాత్ర | [11] | ||
2017 | పటేల్ సర్ | ఏసిపి కాథరీన్ | [12] | ||
2018 | పేపర్ బాయ్ | మేఘ | ప్రధాన పాత్రలో తొలిచిత్రం | [13] | |
2019 | తడమ్ | దీపిక | తమిళం | తమిళ తొలిచిత్రం | [14] |
యజమాన | గంగ | కన్నడ | కన్నడ తొలిచిత్రం | [15] | |
ఉద్గర్శ | కరిష్మా | ||||
అమర్ | బాబీ | ||||
2020 | ఖాకీ | లాస్య | కన్నడ | ||
డిస్కో రాజా[16][17] | పరిణితి | తెలుగు | [18] | ||
హోమ్ మినిస్టర్ | జెస్సీ | కన్నడ | నిర్మాణంలో ఉంది | [19] | |
దారాల ప్రభు | తమిళం | చిత్రీకరణలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ "Tanya Hope Biography". filmibeat.com. Archived from the original on 20 మార్చి 2018. Retrieved 25 జనవరి 2020.
- ↑ "India Times - Miss India Kolkata". indiatimes.com. Archived from the original on 15 మార్చి 2018. Retrieved 25 జనవరి 2020.
- ↑ "Interview – Indiatimes". beautypageants.indiatimes.com. Archived from the original on 20 మార్చి 2018. Retrieved 25 జనవరి 2020.
- ↑ "India Times - Miss India Kolkata". indiatimes.com. Archived from the original on 15 మార్చి 2018. Retrieved 25 జనవరి 2020.
- ↑ "Appatlo Okadundevadu was challenging: Tanya Hope". thehansindia.com. Archived from the original on 2018-03-15. Retrieved 2020-01-25.
- ↑ "Tanya Hope to make Telugu debut with 'Appatlo Okadundevadu'". timesofindia.indiatimes.com. Archived from the original on 20 మార్చి 2018. Retrieved 25 జనవరి 2020.
- ↑ "India Glitz Three Heroines in Thadam". indiaglitz.com. Archived from the original on 17 October 2017. Retrieved 25 January 2020.
- ↑ "Tanya Hope's going Places". deccanchronicle.com. Archived from the original on 12 February 2018. Retrieved 25 January 2020.
- ↑ "Tanya Hope as Basanni in Darshan's Yajamana". The New Indian Express. Archived from the original on 15 August 2019. Retrieved 25 January 2020.
- ↑ "review – 123telugu". 123telugu.com. Archived from the original on 4 February 2017. Retrieved 25 January 2020.
- ↑ "Tanya Hope In Ravi Teja's Next - 123telugu.com". www.123telugu.com. Archived from the original on 2 April 2018. Retrieved 25 January 2020.
- ↑ "review – Deccanchronicle". deccanchronicle.com. Archived from the original on 20 March 2018. Retrieved 25 January 2020.
- ↑ "review –Thehindu". thehindu.com. Archived from the original on 2 April 2018. Retrieved 25 January 2020.
- ↑ "review – Timesofindia". timesofindia.com. Archived from the original on 2 April 2018. Retrieved 25 January 2020.
- ↑ "review – Newindianexpress". newindianexpress.com. Archived from the original on 15 March 2018. Retrieved 25 January 2020.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
- ↑ "Tanya Hope to play scientist in Ravi Teja's Disco Raja". The New Indian Express. Archived from the original on 15 July 2019. Retrieved 25 January 2020.
- ↑ "review – newindianexpress". newindianexpress.com. Archived from the original on 20 March 2018. Retrieved 25 January 2020.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తాన్యా హోప్ పేజీ
- ట్విట్టర్ లో తాన్యా హోప్