అప్పట్లో ఒకడుండేవాడు
అప్పట్లో ఒకడుండేవాడు | |
---|---|
దర్శకత్వం | సాగర్ కె చంద్ర |
రచన | సాగర్ కె. చంద్ర |
నిర్మాత | ప్రశాంతి, కృష్ణ విజయ్ |
తారాగణం | శ్రీవిష్ణు నారా రోహిత్ బ్రహ్మాజీ రాజీవ్ కనకాల |
ఛాయాగ్రహణం | నవీన్ యాదవ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 30 డిసెంబరు 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అప్పట్లో ఒకడుండేవాడు 2016 డిసెంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. నారా రోహిత్ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించాడు.[1] [2][3][4]
కథ
[మార్చు]అప్పట్లో (1990ల కాలంలో) ఒకడుండేవాడు... ఒక సగటు మధ్య తరగతి యువకుడు. తల్లి రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే, రైల్వే కాలనీలో పెరుగుతాడు. క్రికెట్ అంటే పిచ్చి. డిస్ట్రిక్ లెవల్లో ఆడుతుంటాడు. అందరూ అతడిని రైల్వే రాజు (శ్రీవిష్ణు) అని పిలుస్తుంటారు. రంజీల్లోకి సెలక్ట్ అయి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని, ప్రేమించిన నిత్యని (తాన్య) పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకుంటాడు. ఏం జరిగినా తలొంచుకుని వెళ్లిపోవడమే తప్ప తెగించి ఎదురెళ్లని మనస్తత్వమున్న ఈ మధ్య తరగతి యువకుడివి చిన్న కలలు. తనకి సంబంధం లేని విషయాల వల్ల అతని జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. కలలు కల్లలైపోతాయి. క్రికెటర్ అవుదామని అనుకున్నవాడల్లా కొన్ని సంఘటనల అనంతరం క్రిమినల్ అయిపోతాడు. వృత్తి నిర్వహణలో భాగంగా ముల్లుని ముల్లుగా చూడడమే తప్ప, ఇక మరి దేనిగురించి ఖాతరు చేయని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) కారణంగా రైల్వే రాజు జీవితం తలకిందులైపోతుంది. ఇక ఇంతియాజ్ పతనం చూసేందుకే రాజు కంకణం కట్టుకుంటాడు.[5]
తారాగణం
[మార్చు]- శ్రీవిష్ణు
- నారా రోహిత్
- బ్రహ్మాజీ
- రాజీవ్ కనకాల
- తాన్యా హోప్[6]
- ప్రభాస్ శ్రీను
- అజయ్
- సత్యప్రకాష్
- సత్యదేవ్ కంచరాన
- రవివర్మ
- అప్పాజీ అంబరీష దర్భా
పాటలు
[మార్చు]- టుమారో , రచన:వనమాలి, గానం.యాజిన్ నిజార్
- జరా ఇటు రావో , రచన: మహమద్ షకీల్, గానం.సాకేత్ కోమాండూరి
- పసి పువ్వును, రచన: కాశర్ల శ్యామ్, గానం. రోహిత్ పరిటాల
- ఈ క్షణం, రచన: బాలాజీ, గానం. దినకర్ కల్వల, సాయి చరణ్ భాస్కరుని
- నీవు నవ్వులేని, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. దివిజ కార్తీక్
- జాతర కెలదామా, రచన: సుద్దాల అశోక్ తేజ,గానం. దీప్తిపార్ధసారథి
- కన్నుతెరిస్తే, రచన: కాసర్ల శ్యామ్ , గానం.సాయిచరణ్ భాస్కరుని , సాకేత్ కోమాండురి , రఘురాం
- ఏ నీలి మబ్బులోన , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.సాయిచరణ్ భాస్కరుని
సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం: సాయి కార్తీక్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: నవీన్ యాదవ్
- నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
- కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సాగర్ కె చంద్ర
మూలాలు
[మార్చు]- ↑ "Nara Rohith to romance Miss India contestant". 123telugu.com. Retrieved 21 December 2015.
- ↑ "Nara Rohith Sri Vishnus action entertainer Appatlo Okadundevaadu". indiaglitz.com. 8 May 2015. Retrieved 9 May 2015.
- ↑ "Nara Rohit action entertainer kicks off". 123telugu.com. Retrieved 10 May 2015.
- ↑ "Nara Rohith Sri Vishnus action entertainer Appatlo Okadundevaadu". tupaki.com/. 9 May 2015. Archived from the original on 12 May 2015. Retrieved 10 May 2015.
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర. "సినిమా రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు". Retrieved 8 January 2017.
- ↑ "review – 123telugu". 123telugu.com. Archived from the original on 4 February 2017. Retrieved 25 January 2020.