అక్షాంశ రేఖాంశాలు: 17°11′36″N 78°38′45″E / 17.193207°N 78.645828°E / 17.193207; 78.645828

ఇబ్రహీంపట్నం (ఖల్స)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇబ్రహింపట్నం (ఖల్స)
—  రెవిన్యూ గ్రామం  —
[[Image:
ఇబ్రహీంపట్నంలోని తహసిల్ దార్ కార్యాలయము
|220px|none|]]
ఇబ్రహింపట్నం (ఖల్స) is located in తెలంగాణ
ఇబ్రహింపట్నం (ఖల్స)
ఇబ్రహింపట్నం (ఖల్స)
అక్షాంశరేఖాంశాలు: 17°11′36″N 78°38′45″E / 17.193207°N 78.645828°E / 17.193207; 78.645828
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 17,345
 - పురుషుల సంఖ్య 9,129
 - స్త్రీల సంఖ్య 8,215
 - గృహాల సంఖ్య 3,685
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇబ్రహీంపట్నం (ఖల్సా), తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామం.[1] ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2013, మార్చి 26న ఇబ్రహీంపట్నం పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3685 ఇళ్లతో, 17345 జనాభాతో 2520 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9129, ఆడవారి సంఖ్య 8216. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3817 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 848.గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574832[4].పిన్ కోడ్: 501506.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 11, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 9 , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 6 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, 4 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 4 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గ్రామంలో 7 ప్రైవేటు మేనేజిమెంటు కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్ శేరిగూడలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదు లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]
ఇబ్రహీంపట్నంలోని ఆరోగ్య కేంద్రం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]
సామాజిక ఆరోగ్య కేంద్రం, ఇబ్రహీంపట్నం.

ఇబ్రహీంపట్నం ఖల్సాలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]
అంధవిద్యార్థుల వసతి గృహం

గ్రామంలో12 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 8 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఐదుగురుఒక నాటు వైద్యుడు ఉన్నారు. 11 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]
ఇబ్రహీంపట్నం గ్రామములో శాఖ గ్రంథాలయము
ఇబ్రహీంపట్నం గ్రామంలోని తపాలా కార్యాలయం

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) (ఖల్సా)లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]
వృద్దాశ్రమంలోపలి భాగం

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]
వృద్ధాశ్రమం ప్రధాన ద్వారం, ఇబ్రహీంపట్నం

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]
వృద్దాశ్రమం, ఇబ్రహీం పట్నం
వృద్ధాశ్రమంలోపలి ప్రాంగణం, ఇబ్రహీం పట్నం.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 6 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) (ఖల్సా)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 283 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 335 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 608 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 327 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 160 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 163 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 160 హెక్టార్లు
  • బంజరు భూమి: 103 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 377 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 422 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 219 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) (ఖల్సా)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 219 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) (ఖల్సా)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న, కూరగాయలు

ఇబ్రహీంపట్నం చెరువు

[మార్చు]
ఇబ్రహీం పట్నం చెరువు గట్టుమీదున్న ఒక మసీదు

కబ్జా కోరల్లో ఫిరంగి నాలా

[మార్చు]

నిజాం నవాబు శతాబ్దం క్రితం తెలంగాణ ప్రజల స్వేదంతో నిర్మించిన ఫిరంగి కాలువ నేడు కనుమరుగవుతోంది. వేలాది కోట్ల రూపాయాలు ఖర్చు చేసి ప్రాణహిత నుంచి చేవెళ్లకు నీటిని తరలిస్తామని చెబుతున్న పాలకులు గత ఆరు సంవత్సరాలుగా ఫిరంగి కాలువ విషయంలో ఇచ్చిన హామీలన్నీ నీటిపాలయ్యాయి. ఫిరంగి కాల్వకు మరమ్మతు చేసి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని నమ్మబలికిన నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ల పనితీరుపై ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానికి పశ్చిమ దిశలో ఉన్న ఈసీ నది నుంచి నగరానికి దక్షిణ దిశలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు వరకు సుమారు 85 కిలో మీటర్ల పొడవున నిర్మించిన ఫిరంగి కాలువ నేడు అక్రమార్కుల చెరలో బందీ అయింది. తెలంగాణ అంచులో ఉన్న ప్రాణహిత నుంచి చేవెళ్లకు గోదావరి జలాలను తెచ్చే బదులు చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ నడిబొడ్డు నుంచి పారుతున్న ఈసీ నది జలాలను మళ్లించేందుకు నిర్మించిన ఫిరంగి కాలువను పునరుద్ధరించేందుకు పాలకులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అక్కడి రైతాంగానికి అంతుపట్టడంలేదు.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్య మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పల్లెబాట పేరుతో చేవెళ్ల వచ్చి ఫిరంగి కాలువను తక్షణం బాగు చేయిస్తానని హామీ ఇచ్చి ఆ తరువాత మరిచిపోయారు. ఆయన అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఫిరంగి కాలువ ఊసే ఎత్తలేదు. కాలువను బాగుచేస్తే వేలాది ఎకరాల విస్తీరణంలో పంటలు సాగవుతాయని రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఫిరంగి కాలువ ప్రస్తుతం కబ్జాకోరల్లో చిక్కి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది.ఫిరంగి కాలువ పునరుద్ధరణకు తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ పాదయాత్ర ఫిరంగి కాలువ పునరుద్ధరణ చేయాలంటూ తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో మార్చి 30న చందన్‌వెళ్లి నుంచి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు టఫ్‌ కో-కన్వీనర్‌ విమలక్క ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫిరంగి కాలువ పునరుద్ధరించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఈ పాదయాత్రకు స్థానిక రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది.

కాలువ చరిత్ర

[మార్చు]

1872లో నిజాం ప్రభువు ఫ్రెంచ్‌, ఇంగ్లాండ్‌ ఇంజనీర్ల సహాయంతో కాలువ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాలువ నిర్మాణంలో రాళ్ళు అడ్డుగా వస్తే మందుగుండుతో పేల్చి నిర్మాణాన్ని కొసాగించినందుకు ఈ కాలువకు ఫిరంగి కాలుగా పేరు స్థిరపడినట్లు పెద్దలు చెబుతున్నారు. షాబాద్‌ మండలం చందన్‌వెళ్లి గ్రామానికి తూర్పు- ఈశాన్య దిశలో ఈసీ నది ప్రవహిస్తోంది. చేవెళ్ల, షాబాద్‌ మండలాల సరిహాద్దుల్లో ఈ నదిపై సుమారు రెండు పర్లాంగుల పొడవున ఫిరంగి కాలువ ఆనకట్టను నిర్మించారు. ఈసీ నది నుంచి నీటిని ఫిరంగికాలువకు మళ్లించేందుకు పెద్ద పెద్ద రాళ్లు, సున్నం డంగు, ఇసుకను కలిపి 48 మీటర్ల వెడల్పుతో అత్యంత పటిష్ఠంగా సుమారు మీటరు ఎత్తున కరకట్టను నిర్మించారు. కరకట్ట ద్వారా ఫిరంగి కాలువకు నీటిని మళ్లించగా మిగిలిన నీరు హైదరాబాదు‌ నగరానికి తాగు నీరందించే హిమాయత్‌సాగర్‌కు చేరుతుంది. చందనవల్లి శివారు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వరకు 85 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మాణాన్ని పూర్తిచేశారు. షాబాద్‌ మండలంలో ప్రాంరంభమైన కాలువ శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ మున్సిపాల్టీ, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, మండలాల ద్వారా ఇబ్రహీంపట్నం చెరువులో కలిసి ముగుస్తుంది. కాలవకు అందుబాటులో ఉన్న అన్ని చెరువులను కలుపుతూ నిర్మించారు. ప్రతి

చెరువూ నీటితో నిండి అలుగు ద్వారా వృథాగా పారే నీటిని ఫిరింగి కాలువకు అనుసంధానం చేశారు. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 50 చెరువుల్లో నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సంమృద్ధిగా పండించేందుకు పథకం రూపొందించారు. దీని వల్ల వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేసే అవకాశం ఏర్పడడంతో రైతులకు ఉపాధి ఏర్పడింది. దీంతో పాటే కాలువ పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు సమస్యను శాశ్వతంగా తీర్చేవీలు ఏర్పడింది. ఫిరంగి కాలువతో షాబాద్‌ మండలంలోని చందనవల్లి చెరువు, సోలిపేట్‌ పెద్ద చెరువు, శంషాబాద్‌ మండల పరిధలోని రామాంజపూర్‌ సమీపంలోని మద్దూరుకుంట, పాలమాకుల చెరువు, శంషాబాద్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువు, ఇంజాపూర్‌ చెరువు, తుర్కెంజాల్‌ సమీపంలోని కొత్త చెరువు, తుక్కుగూడ చెరువులతో పాటు ఇబ్రహీంపట్నం చెరువులను నీటితో నింపారు. నీటిని ఇబ్రహీంపట్నం చెరువుకు కాలువ ద్వారా చేరవేసేలోపే చందనవల్లి వద్ద నిర్మించిన కరకట్ట తెగిపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని పెద్దలు చెబుతున్నారు. వేలాది ఎకరాలక సాగు నీరు, గ్రామాలకు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కాలువ నేడు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 1967 వరకు ఫిరంగి కాలువ ద్వారా కొన్ని చెరువులకు నీరందినట్లు తెలుస్తోంది. కాలువ పూడుకుపోకముందు వేలాది ఎకరాలకు సాగునీరు అందించినా ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్‌ ఎస్టేట్‌ దెబ్బ తగిలింది. భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు నాటి పాలకులు ముందుచూపుతో నిర్మించిన చెరువులు, కుంటలు కూడా నేడు కనుమరుగవుతున్నాయి.

కబ్జా కోరల్లో కాలువ

[మార్చు]

పాలకుల పనితీరు కారణంగా ఫిరంగి కాలువ యథేచ్ఛగా కబ్జాకు గురైంది. హిమాయత్‌నగర్‌ నుంచి మొదలు పెడితే ఎర్రకుంట, పహడిషరీఫ్‌, కొత్తపేట, వెంకటాపూర్‌, నాదర్‌గుల్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం కాలువ ఆనవాళ్ళను వెతుక్కొవాల్సిన స్థితి ఉంది. తుర్కయంజాల్‌ కొత్తచెరువు, ఇబ్రహీంపట్నం చెరువు, నాదర్‌గుల్‌ మన్సూర్‌ఖాన్‌ చెరువు, ఇంజాపూర్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువుల ఆయకట్టల్లో సైతం ఆక్రమ లేఔట్‌లతో బహుళ అంతస్తులు భవనాలు వెలిశాయి. ఈ మధ్యనే నర్కూడ శంషాబాద్‌ సమీపంలోని ఫిరంగికాలువలో వెంచర్‌ ఏర్పాటు చేసి రోడ్లు వేస్తున్నారు. సాగు చేసేందుకు నీరులేక సాగు భూముల్లో భవంతులు వెలిసి వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రజలను తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా పాలకులు చీమకుట్టినట్టు కూడా లేదు. కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవడానికి ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీటిని చేర్చే ఫిరంగినాలా అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్‌ ఎ.వాణీప్రసాద్‌ తెలిపారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
  2. "Basic Information of Municipality, Ibrahimpatnam Municipality". ibrahimpatnammunicipality.telangana.gov.in. Retrieved 30 March 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]