ఎర్రచీర - ది బిగినింగ్
స్వరూపం
ఎర్రచీర - ది బిగినింగ్ | |
---|---|
దర్శకత్వం | సుమన్ బాబు |
రచన | సుమన్ బాబు |
నిర్మాత | ఎన్.వి.వి.సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | చందు |
కూర్పు | వెంకట ప్రభు |
సంగీతం | ప్రమోద్ పులిగార్ల |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 27 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎర్రచీర - ది బిగినింగ్ 2024లో విడుదలకానున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్.వి.వి.సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించిన ఈ సినిమాకు సుమన్ బాబు దర్శకత్వం వహించాడు. సుమన్ బాబు, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 1న, ట్రైలర్‌ను డిసెంబర్ 7న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసి,[1] సినిమాను డిసెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదల సందర్బంగా సినిమా యూనిట్ ఒక కాంటెస్ట్ పెడుతున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 45 నిమిషాల్లో తిన్న ప్రేక్షకుడికి పది వేల రూపాయలు బహుమతి ఇవ్వనున్నారు.[2]
నటీనటులు
[మార్చు]- శ్రీరామ్
- సుమన్ బాబు
- కమల్ కామరాజు
- కారుణ్య చౌదరి
- ఆలీ
- అన్నపూర్ణమ్మ
- గీతా సింగ్
- సత్య కృష్ణన్
- మహేష్
- భద్రం
- జీవా
- రఘుబాబు
- బేబి సాయి తేజస్విని[3]
- అయ్యప్ప పి శర్మ
- సురేష్ కొండేటి
- చింగు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- లైన్ ప్రొడ్యూసర్: అబ్దుల్ రెహమాన్,
- ఆర్ట్: నాని, సుభాష్,
- పిఆర్ఓ: సురేష్ కొండేటి,
- స్టంట్స్: నందు,
- మాటలు: గోపి విమల పుత్ర
- చీఫ్ కో డైరెక్టర్: నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్
మూలాలు
[మార్చు]- ↑ హెచ్ఎం డిజిటల్ (7 December 2024). ""ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా ట్రైలర్ లాంఛ్.. ఈ నెల 27న థియేటర్లో రిలీజ్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Eenadu (8 December 2024). "ఎర్రచీర బిర్యాని పోటీ". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Prime9 (12 October 2024). "రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని నటించిన "ఎర్రచీర - The Beginning" మూవీ.. డిసెంబర్ 20 న విడుదల". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)