ఎలుగుబంటి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎలుగుబంటి Temporal range: Early Miocene - Recent
| |
---|---|
Kodiak Brown Bear | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Superfamily: | |
Family: | అర్సిడే G. Fischer de Waldheim, 1817
|
ప్రజాతులు | |
Ailuropoda |
ఎలుగు, ఎలుగుబంటి లేదా భల్లూకము (ఆంగ్లం: Bear) ఒక క్రూరమృగము. ఇవి అర్సిడే (Ursidae) కుటుంబానికి చెందిన క్షీరదాలు. వీటిని కానిఫార్మిస్ (Caniformis) ఉపక్రమంలో కుక్క వంటి మాంసాహారులుతో చేర్చారు. ఎలుగుబంట్లలో ఎనిమిది జాతులు జీవించి, ప్రపంచమంతటా విస్తరించాయి.
ఆధునిక ఎలుగుబంట్లకు సామాన్యంగా భారీ శరీరం, బలమైన కాళ్ళు, పొడవైన మూతి, గరుకైన వెండ్రుకలు, పొట్టి తోకను కలిగివుంటాయి. వీటి పంజాకు ఐదు పదునైన గోర్లుంటాయి. ధృవపు ఎలుగుబంటి మాంసాహారి కాగా పాండా శాకాహారిగా వెదురు చిగుళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. మిగతా జాతులు సర్వభక్షకాలుగా మొక్కల్ని, ఇతర జీవుల్ని తింటాయి.
ఎలుగుబంట్లు ఒంటరిగా జీవించి రాత్రి సమయంలో చురుకుగా తిరుగుతాయి. ఇవి మంచి ఘ్రాణశక్తిని కలిగియుండి భారీగా ఉన్నా కూడా చలాకీగా పరుగెత్తగలవు. ఇవి చెట్లు ఎక్కగలవు, ఈదగలవు. కొన్ని జాతులు చలికాలం కోసం పండ్లను దాచుకుంటాయి.[1] ఇవి గుహలు, పెద్ద గోతులలో నివసిస్తాయి.
ఎలుగుబంట్లు చరిత్రపూర్వం నుండి వీటి మాంసం, చర్మం కోసం వేటాడబడ్డాయి. ఇవి ప్రాచీనకాలం నుండి సంస్కృతి, కళలు మొదలైన వాటిలో ముఖ్య పాత్రను పోషించాయి. ఆధునిక కాలంలో వివిధ కారణాల మూలంగా వీటి ఉనికికి ఆటంకం కలుగుతుంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి ఆరు జాతుల ఎలుగుబంట్లను అంతరించిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించింది.
భాషా విశేషాలు
[మార్చు]తెలుగు భాషలో ఎలుగు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[2] ఎలుగును ఎలుగుబంటి, ఎలుగుమంటి, ఎలుగుగొడ్డు అని కూడా పిలుస్తారు. దీనికి బహువచనం ఎలుగులు. ఈ పదాన్ని బిగ్గరగా కూత వేయడానికి కూడా వాడతారు. ఉదా: ఎలుగెత్తి యేడ్చెను.
వర్గీకరణ
[మార్చు]- కుటుంబం అర్సిడే
- ఉపకుటుంబం Ailuropodinae
- Giant పాండా, Ailuropoda melanoleuca
- Dwarf పాండా, Ailuropoda minor†
- ఉపకుటుంబం Tremarctinae
- Spectacled Bear, Tremarctos ornatus
- Florida Cave Bear, Tremarctos floridanus†
- Giant Short-faced Bear, Arctodus simus†
- Unnamed short-faced bear species, Arctodus pristinus†
- Brazilian Short-faced Bear, Arctotherium brasilense†
- Argentine Short-faced Bear, Arctotherium latidens†
- ఉపకుటుంబం Ursinae
- బ్రౌన్ ఎలుగుబంటి, Ursus (Ursus) arctos
- Subspecies Syrian (Brown) Bear Ursus arctos syriacus
- Subspecies Grizzly Bear, Ursus arctos horribilis
- Subspecies Kodiak Bear, Ursus arctos middendorffi
- Subspecies Himalayan Brown Bear or Himalayan Red Bear, Ursus arctos isabellinus
- Subspecies Himalayan Blue Bear, Ursus arctos pruinosus
- Subspecies Bergman's Bear, Ursus arctos piscator†?
- Subspecies Eurasian Brown Bear Ursus arctos arctos
- Gobi bear, Ursus arctos gobiensis (very rare)
- Atlas Bear, Ursus arctos crowtheri†
- అమెరికన్ నల్ల ఎలుగుబంటి, Ursus (Ursus) americanus
- Subspecies Cinnamon Bear, Ursus americanus cinnamomum
- Subspecies Kermode Bear, Ursus americanus kermodei
- పోలార్ ఎలుగుబంటి, Ursus maritimus
- ఆసియా నల్ల ఎలుగుబంటి, Ursus thibetanus
- ఫార్మొసాన్ నల్ల ఎలుగుబంటి, Ursus thibetanus formosanus
- Ursus thibetanus gedrosianus
- Ursus thibetanus japonicus
- Ursus thibetanus laniger
- Ursus thibetanus mupinensis
- Ursus thibetanus thibetanus
- Ursus thibetanus ussuricus
- స్లాత్ ఎలుగుబంటి, Melursus ursinus
- Subspecies శ్రీలంక స్లాత్ ఎలుగుబంటి Melursus ursinus inornatus
- Subspecies భారతీయ స్లాత్ ఎలుగుబంటి Melursus ursinus ursinus
- Sun Bear, Helarctos malayanus
- Subspecies Borneo Sun Bear Helarctos malayanus euryspilus
- Auvergne Bear, Ursus minimus†
- Etruscan Bear, Ursus etruscus†
- European Cave Bear, Ursus spelaeus†
- MacFarlane's Bear, Ursus (Vetularctos) inopinatus (cryptid; if an authentic species, extinct)
- Deninger's bear, Ursus deningeri†
- బ్రౌన్ ఎలుగుబంటి, Ursus (Ursus) arctos
- ఉపకుటుంబం Ailuropodinae
The genera Melursus and Helarctos are sometimes also included in Ursus. The Asiatic black bear and the polar bear used to be placed in their own genera, Selenarctos and Thalarctos which are now placed at subgenus rank.
పురాణాలలో
[మార్చు]- జాంబవంతుడు బలవంతుడైన భల్లూకరాజు.
మూలాలు
[మార్చు]- ↑ "Slovakia warns of tipsy bears". Archived from the original on 2012-07-06. Retrieved 2008-11-11.
- ↑ బ్రౌన్ నిఘంటువులో ఎలుగు ప్రయోగాలు.[permanent dead link]