ఎస్ఆర్ కల్యాణమండపం
ఎస్ఆర్ కల్యాణమండపం | |
---|---|
దర్శకత్వం | శ్రీధర్ గదె |
రచన | కిరణ్ అబ్బవరం |
కథ | కిరణ్ అబ్బవరం |
నిర్మాత | ప్రమోద్ రాజు |
తారాగణం | కిరణ్ అబ్బవరం ప్రియాంక జవాల్కర్ |
ఛాయాగ్రహణం | విశ్వాస్ డేనియల్ |
సంగీతం | చైతన్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ |
సినిమా నిడివి | 160 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎస్ఆర్ కల్యాణమండపం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ చిత్రం. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ గదె దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు.[1] ఎస్‌ఆర్ కల్యాణమండపం’ టీజర్‌ను 2021, ఫిబ్రవరి 4న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]కడప జిల్లాకు చెందిన ధర్మ(సాయి కుమార్) తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఎస్. ఆర్. కళ్యాణ మండపాన్ని నిర్వహించడానికి నానా తంటాలు పడుతూ తాగుడుకు బానిస అవుతాడు. అతని కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) సిటీ లో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. తన ఊరికే చెందిన క్లాస్ మేట్ సింధు (ప్రియాంక జవాల్కర్) తో ప్రేమలో పడతాడు. కొన్ని అనివార్య సంఘటనల వలన కళ్యాణ్ కళ్యాణ మండపం నిర్వహణలోకి దిగాల్సి వస్తుంది. తండ్రితో కల్యాణ్ మాట్లాడకపోవడానికి కారణమేంటి?సింధు (ప్రియాంక జవాల్కర్) తో తన ప్రేమ కథ కి ఏమైంది? కళ్యాణ్ కు తన తండ్రి పై ఉన్న కోపం తగ్గిందా? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- కిరణ్ అబ్బవరం
- ప్రియాంక జవాల్కర్
- సాయి కుమార్
- తులసి
- శ్రీకాంత్ అయ్యంగర్
- తనికెళ్ళ భరణి
- అరుణ్
- అనిల్ జీల
- భరత్
- కిట్టయ్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం: శ్రీధర్ గాదె
- కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిరణ్ అబ్బవరం
- ఛాయాగ్రహణం: విశ్వాస్ డేనియల్
- సంగీతం: చేతన్ భరద్వాజ్
- పాటలు: భాస్కరభట్ల, కృష్ణా కాంత్
- నిర్మాతలు: ప్రమోద్, రాజు
- సహా నిర్మాత: భరత్ రొంగళి
- ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
- పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యాం
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందించాడు.
క్రమసంఖ్య | పేరు | పాడినవారు | నిడివి |
---|---|---|---|
1. | "చూశాలే కళ్లారా" | సిద్ శ్రీరామ్ | 3:40 |
2. | "చుక్కల చున్నీ" | అనురాగ్ కులకర్ణి | 3:35 |
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (7 April 2020). "'ఎస్‌ఆర్ కళ్యాణమండపం'లో హీరో రోల్ ఇదే". www.andhrajyothy.com. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
- ↑ Eenadu (6 February 2021). "నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. రైతు బిడ్డని! - kiran abbavaram emotional speech at sr kalyana mandapam teser release event". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
- ↑ Sakshi (6 August 2021). "'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' మూవీ రివ్యూ". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.