ఒకే కుటుంబం
Appearance
ఒకే కుటుంబం (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, లక్ష్మి, కాంతారావు, రాజశ్రీ, అంజలీదేవి, నాగయ్య |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | రవి ఆర్ట్ ధియేటర్స్ |
భాష | తెలుగు |
ప్రముఖ సినిమానటుడు నాగభూషణం ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాకు తమిళచిత్రం ‘పాపమణిప్పు’ ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో తెలుగులో డబ్బింగు చేశారు. అందులో ఎం.ఆర్.రాధాకి నాగభూషణమే డబ్బింగ్ చెప్పాడు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్.టి.ఆర్, కాంతారావులతో తిరిగి నిర్మించాడు.
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు
- కాంతారావు
- నాగభూషణం
- చిత్తూరు నాగయ్య
- అల్లు రామలింగయ్య
- ధూళిపాళ
- నారాయణరావు
- రాజశ్రీ
- లక్ష్మి
- రుక్మిణి
- నిర్మల
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాతలు: సి.హెచ్.రాఘవరావు, కె.బసవయ్య
- సమర్పణ: నాగభూషణం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.భీంసింగ్
- పాటలు: దాశరథి, దేవులపల్లి, శ్రీశ్రీ, కొసరాజు
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
పాటలు
[మార్చు]- . అందరికి ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి - ఘంటసాల బృందం . రచన: దాశరథి.
- ఔనే తానే నన్నేనే నిజమేనే అంతా కథలే - సుశీల, రచన:దేవులపల్లి
- కావాలి తోడు కావాలి ఒంటరిదైన రామచిలకుక జంట కావాలి -సుశీల, ఎస్.పి. బాలు, రచన: దాశరథి కృష్ణమాచార్య.
- నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను నవ్వు ఏడుపు రెండిటి నడుమ - ఘంటసాల రచన:శ్రీశ్రీ
- మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు -ఘంటసాల , రచన: దాశరథి
- శిల్పాలు శిథిలమైనా .. మంచిని మరచి వంచన నేర్చి నరుడే -ఘంటసాల , రచన: దాసరి నారాయణరావు.
- కావాలి తోడు , ఘంటసాల, పి సుశీల , రచన: దాశరథి
- ఓటున్న బాబులారా , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎల్ ఆర్ ఈశ్వరి, రచన:కొసరాజు
- శిల్పాలు శిధిలమైనా,(పద్యం) ఘంటసాల, రచన: దాశరథి.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు