ఓం ప్రకాష్ కోహ్లీ
ఓం ప్రకాష్ కోహ్లీ | |||
| |||
పదవీ కాలం 16 జులై 2014 – 15 జులై 2019 | |||
ముందు | మార్గరెట్ అల్వా | ||
---|---|---|---|
తరువాత | ఆచార్య దేవ్ వ్రత్ | ||
మధ్య ప్రదేశ్ గవర్నర్
| |||
పదవీ కాలం 8 సెప్టెంబర్ 2016 – 19 జనవరి 2018 | |||
ముందు | రామ్ నరేష్ యాదవ్ | ||
తరువాత | ఆనందిబెన్ పటేల్ | ||
పదవీ కాలం 6 ఆగష్టు 2014 – 25 ఆగష్టు 2014 | |||
ముందు | మార్గరెట్ అల్వా | ||
తరువాత | మృదుల సిన్హా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఢిల్లీ , బ్రిటిష్ ఇండియా | 1935 ఆగస్టు 9||
మరణం | 2023 ఫిబ్రవరి 20 | (వయసు 87)||
వృత్తి | రాజకీయ నాయకుడు, విద్యావేత్త |
ఓం ప్రకాష్ కోహ్లీ (9 ఆగష్టు 1935 - 20 ఫిబ్రవరి 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014 నుండి 2019 వరకు గుజరాత్ రాష్ట్ర 19వ గవర్నర్‌గా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఓం ప్రకాష్ కోహ్లీ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994 నుండి 2000 వరకు రాజ్యసభ సభ్యునిగా[1], 1999 నుండి 2000 వరకు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. అతను 2014లో గుజరాత్ గవర్నర్‌గా నియమితుడై, 2019 వరకు విధులు నిర్వహించాడు. అతను గుజరాత్ గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు 2016 సెప్టెంబరు 8 నుండి 2018 జనవరి 19 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా, [2] 2014 ఆగస్టు 6 నుండి 2014 ఆగస్టు 25 వరకు గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కోహ్లీ 37 సంవత్సరాలు ఢిల్లీలోని హన్స్‌రాజ్ కళాశాల & దేశబంధు కళాశాలలో లెక్చరర్‌గా పని చేసి 1994లో పదవీ విరమణ చేశాడు. ఆయన విధ్యర్హి దశలో అఖిల భారతీయ విద్యా పరిషత్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1973-79 వరకు ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (DUTA) అధ్యక్షుడిగా, విశ్వవిద్యాలయం అకడమిక్ & ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ సభ్యుడిగా, యూనివర్సిటీ అధ్యాపకుల సంస్థ నేషనల్ డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (ఎన్‌డిటిఎఫ్)కి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
మరణం
[మార్చు]ఓం ప్రకాష్ కోహ్లీ 2023 ఫిబ్రవరి 20న మరణించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Member's profile" (PDF). rajyasabha.nic.in. Retrieved 27 December 2019.
- ↑ India Today (8 September 2016). "OP Kohli takes charge as Governor of Madhya Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ "Governor Since Liberation | RAJ BHAVAN". rajbhavan.goa.gov.in.
- ↑ The Times of India (21 February 2023). "Former Gujarat governor Om Prakash Kohli passes away". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ Quint, The (2023-02-20). "Former Gujarat Governor & Delhi BJP President Om Prakash Kohli Passes Away At 87". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2024-09-09.