Jump to content

ఔటర్ రింగు రోడ్డు, వరంగల్

వికీపీడియా నుండి
ఔటర్ రింగు రోడ్డు, వరంగల్
Warangal Outer Ring Road.jpg
వరంగల్ ఔటర్ రింగు రోడ్డు పటం
మార్గ సమాచారం
పొడవు69 కి.మీ. (43 మై.)
Existed2017 నుండి ప్రస్తుతం–present
ప్రదేశము
Statesతెలంగాణ

వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణం చుట్టూ ఉన్న రింగు రోడ్డు. 69-కిలోమీటరు (43 మై.)ల పొడవులో ఈ రింగురోడ్డు ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతీ 20 కి.మీలకు ఒక విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఔటర్ రింగు రోడ్డు రెండు జాతీయ, 4 రాష్ట్ర రహదారులతోపాటు అనేక దారులను కలుపుతోంది. ఈ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చేయనున్నారు.[1]

చరిత్ర

[మార్చు]

హైదరాబాద్‌–వరంగల్‌ దారిలో రాంపూర్‌ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, కోమటిపల్లి, భీమారం, చింతగట్టు, పలివేల్పుల, ముచ్చర్ల, పెగడపల్లి, వంగపహాడ్, ఆరేపల్లి దాకా ఈ రింగురోడ్డు ఉంటుంది. 2017 అక్టోబరు నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశాడు. 69-కిలోమీటరు (43 మై.) పొడవున్న ఈ రోడ్డును భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ, తెలంగాణ ప్రభుత్వ రోడ్డు భవనాల శాఖలు సంయుక్తంగా నిర్మించాయి. 163వ జాతీయ రహదారి వరకు 29-కిలోమీటరు (18 మై.) నిర్మాణాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ. చేపట్టగా, మిగిలిన 40-కిలోమీటరు (25 మై.) తెలంగాణ ప్రభుత్వ శాఖచే నిర్మించబడుతుంది. ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 7 బిలియన్లు.[2][3][4]

పురోగతి

[మార్చు]

2020 మార్చి నెల నాటికి ఎక్స్‌ప్రెస్‌వే జాతీమ రహదారి బైపాస్ స్ట్రెచ్ నిర్మాణం పూర్తయింది. [5]

ఇతర వివరాలు

[మార్చు]

వరంగల్ పట్టణ మాస్టర్ ప్లాన్ 1971లో రూపొందించబడింది కావున నగరం అభివృద్ధి ప్రకారం రేడియల్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, స్ప్లిట్ రోడ్లు, పారిశ్రామిక కాలనీలు, ఉద్యానవనాల కోసం సరికొత్తగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.[6]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, తెలంగాణ, వరంగల్ (23 October 2017). "వరంగల్‌కు మణిహారం". Sakshi. Archived from the original on 23 October 2017. Retrieved 25 August 2021.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  2. "Outer Ring Road, Warangal: Telangana State". The Hindu. Retrieved 25 August 2021.
  3. "ORR Warangal Foundation: Telangana State". Deccan Chronicle. Retrieved 25 August 2021.
  4. CM KCR to break ground for Warangal ORR, Khazipet RoB on Sunday Telangana Today. Retrieved 25 August 2021.
  5. AuthorTelanganaToday. "Telangana govt approves KUDA Master Plan". Telangana Today. Retrieved 25 August 2021.
  6. "Construction of outer ring road around Warangal to complete by 2018". Deccan Chronicle. 2017-02-02. Retrieved 25 August 2021.