ఇన్నర్ రింగు రోడ్డు, హైదరాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్నర్ రింగు రోడ్డు, హైదరాబాద్
పటం
Hyderabad IRR in red
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాదు మహానగరపాలక సంస్థ, హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
పొడవు50 km (31 mi)
Location
CountryIndia
రహదారి వ్యవస్థ
State Highways in

ఇన్నర్ రింగు రోడ్డు, తెలంగాణ రాజధాని హైదరాబాదులో 50 కిలోమీటర్ల సిటీ ఆర్టరీ రోడ్డు.[1] హైదరాబాదు రహదారుల రద్దీని తగ్గించడానికి, ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలు సులువుగా వెళ్ళడానికి ఈ రోడ్డు నిర్మించబడింది.

ఇన్నర్ రింగ్ రోడ్

చరిత్ర[మార్చు]

జపాన్‌కు చెందిన నిప్పాన్ కోయి కంపెనీ ఆధ్వర్యంతో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అని పిలువబడే ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్ తో కలిపి, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సంస్థ సహాయంతో 2008లో నిర్మించబడింది.[2]

రోడ్డు[మార్చు]

ఈ ఇన్నర్ రింగు రోడ్డు మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, 65వ జాతీయ రహదారి ద్వారా పంజాగుట్ట, 44వ జాతీయ రహదారి ద్వారా బేగంపేట, మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, 163వ జాతాయ రహదారి మీదుగా భువనగిరి రోడ్, నాగోల్, ఎల్.బి. నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట, సంతోష్‌నగర్ జంక్షన్, 765వ జాతీయ రహదారి ద్వారా చాంద్రాయణగుట్ట, కర్నూలు హైవే, రాజేంద్రనగర్ బైపాస్ రోడ్డు, అత్తాపూర్, రెతిబౌలి మొదలైన ప్రాంతాల మీదుగా ఉంది.[3] ఇది ఆరామ్‌ఘర్ ప్రాంతంలో పివి నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను కలుస్తుంది.[4]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Violence on OU campus". The Hindu. 2010-02-15. Archived from the original on 18 February 2010. Retrieved 16 August 2021.
  2. "A master plan for Intelligent Transport System". IBN Live. Archived from the original on 10 July 2012. Retrieved 16 August 2021.
  3. "Axed structures get property tax notice". The Times of India. Archived from the original on 24 December 2013. Retrieved 16 August 2021.
  4. "Inner ring road getting ready". The Times of India. Archived from the original on 24 December 2013. Retrieved 16 August 2021.