కత్తిమండ ప్రతాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా కత్తిమండ ప్రతాప్
కత్తిమండ ప్రతాప్
జననంప్రతాప్
(1978-01-21) 1978 జనవరి 21 (వయసు 46)
సఖినేటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిజర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్, రచయిత
మతంహిందూ
భార్య / భర్తఉషాజ్యోతి
పిల్లలుమహీత్, ప్రణయ్
తండ్రిప్రభాకరరావ్
తల్లికన్నమ్మ

కత్తిమండ ప్రతాప్ కవి, సాహితీవేత్త. కవి సంగమం రచయితలలో ఒకరు. 2019లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా ఎంపికయ్యాడు.[1][2] 2016లో వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ప్రస్తుతం ఐ ఎస్ .ఓ గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గా ఉన్నారు .[3]

జననం[మార్చు]

కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు 1979, జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించాడు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం లో నివసిస్తున్నాడు. జర్నలిస్ట్ గాను అండ్ ఒకేషనల్ అండ్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

వివాహం[మార్చు]

వీరికి ఉషాజ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

మొదటి కవిత అంకురం, ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితం అయింది.

రచనల జాబితా[మార్చు]

  • ఎనిమిది కవితా సంకలనాలు ప్రచురితం.
  • రెండు నవలలు రాసారు.
  • దృశ్యం సీరియల్ గోదావరి దినపత్రికలో ,
  • చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కథల సంపుటి ,
  • గల్ప్ కథలు పబ్లిష అయ్యాయి.
  • ఇంతవరకు 2000 పైనే కవితలు రాశాడు.
  • 600పైగా కవితలు , మయూరి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్, గోదావరి , తెలుగు వెలుగు , ఇతర తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
  • కథలు 19-వివిధ పత్రికల్లో ప్రచురితం.విపుల , చతుర , ఆంధ్రభూమి , మయూరి, ఆంద్రజ్యోతి , స్వాతి ,గోదావరి తదితర పత్రికల్లో
  • 14 నాటకాలు రాసారు . అవి వివిధ చోట్ల అనేక ప్రదర్శనలకు నోచుకున్నాయి ,
  • 3 టెలిఫిల్మ్స్ రాశాడు.టెలిప్లే అందించారు
  • 1000 పైగా వ్యాసాలూ రాసారు వివిధ పత్రికల్లో ప్రచురితం
  • మయూరి వీక్లీలో కాలమిస్ట్ గా పనిచేసారు . వారం వారం ఆర్టికల్స్ రాసేవారు
  • ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేసాడు
  • రెండు చిత్రాలకు పాటలు అందించారు
దస్త్రం:Matti Rathalu Artiicle.jpg
మట్టిరాతలు పుస్తక సమీక్ష

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

  1. పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
  2. మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
  3. దెయ్యం బాబోయ్ (నవల 1998)
  4. రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015)[4]
  5. దృశ్యం (2016)
  6. కాకి ఎంగిలి
  7. కరోనా కవిత్వం
  8. గల్ఫ్ వల(స)లో జీవితాలు (2016
  9. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం 2021
  10. కథలు

బహుమానాలు[మార్చు]

  1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే మహాకవి గుర్రం జాషువా పురస్కారం 2017 అందుకున్నాడు
  2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నాడు
  3. పరిశోధన విభాగంలో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకోడం
  4. మాప్స్ ద్వారా "సాహిత్య భూషణ్" అవార్డ్ అందుకోడం
  5. రోటరీ క్లబ్ నుండి "సాహితీ రత్న అవార్డ్"
  6. కాసుల పురుషోత్తమ కవి పురస్కారం
  7. అక్షర తపస్వీ బిరుదు
  8. కోనసీమ కవిరత్న
  9. సాహిత్య తపస్వీ అవార్డు
  10. యు నేస్కో క్లబ్ నేషనల్ అవార్డ్
  11. దుబాయి ఎక్స్లెన్స్ అవార్డు
  12. వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
  13. వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేకసార్లు ప్రథమ బహుమతి
  14. గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించడం
  15. తొలి ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా వ్యవహరించడం
  16. యునేస్కో నుండి లిటరసి అవార్డ్
  17. దుబాయి దేశం లో నేషనల్ అవార్డ్
  18. కువైట్ దేశంలో తెలుగు ఖ్యాతి అవార్డ్
  19. వివిధ దేశాలు పర్యటన
  20. అనేక సాహిత్య సంస్తలనుండి వేలాది బిరుదులూ ,వేలాది సత్కారాలు
  21. శ్రీ శ్రీ కళావేదిక చైర్మెన్ గా కవులకు ప్రోత్సాహం
  22. ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా జాతీయ శత కవి సమ్మేళనాలు నిర్వహించిన ఘనత ప్రతాప్ కే దక్కుతుంది
  23. పలు జాతీయ స్థాయి అవార్డులు సొంతం

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి, తూర్పు గోదావరి (14 February 2019). "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్‌ మెంబర్‌గా ప్రతాప్‌". Dailyhunt. Retrieved 3 December 2020.
  2. ఈనాడు, తూర్పు గోదావరి (19 March 2019). "ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయిత సంఘం ఏర్పాటు". Sakshi. Archived from the original on 5 December 2016. Retrieved 3 December 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 3 డిసెంబరు 2020 suggested (help)
  3. సాక్షి, జిల్లాలు (3 December 2016). "రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ". Sakshi. Archived from the original on 5 December 2016. Retrieved 3 December 2020.
  4. ప్రజాశక్తి (17 October 2015). "ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం". Retrieved 27 July 2016.