కథాకళి
కథాకళి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సంపన్నమైన, విలసిల్లుతున్న నృత్య నాటక కళా రీతి. కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇందులో కళాకారులు రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి, పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలను వివిధ సంకేతాలతో కూడిన మేకప్ వేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను, మేకప్ సామాగ్రిని వాడతారు. ఈ కళ కున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావ భావ ప్రకటనల తోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటింప చేస్తారు. ముఖంలో కనిపించే చిన్న, పెద్ద కదలికలు, కనుబొమ్మలు, కను గుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు. ఏయే భావాలకు ఏయే విధంగా వేటిని కదిలించాలన్నది కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. పురుషులు స్త్రీ వేషధారణ కూడా ధరిస్తారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఈ కళలో ప్రవేశించారు. [1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-09-24. Retrieved 2008-09-13.