కర్ర
చేతితో పట్టుకునేందుకు అనువుగా, చక్కగా, పొడవుగా, స్థూపకారంలో ఉన్న కొట్టి వేయబడిన వృక్ష సంబంధిత మొదలను, కొమ్మలను కర్రలంటారు. కర్రను ఆంగ్లంలో స్టిక్ అంటారు.
నివాసం కొరకు
[మార్చు]పూరిల్లు, పందిర్లు నిర్మించేటపుడు అనేక కర్రలు అవసరమవుతాయి. వీటి నిర్మాణానికి ఎక్కువగా చక్కగా, పొడవుగా పెరిగే అవిసె కర్రలను ఉపయోగిస్తారు, అవిసె కర్రలు తక్కువ బరువు ఉండటం వలన ఈ కర్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
కంచె కర్ర
[మార్చు]పంట రక్షణ కొరకు, హద్దులు గుర్తు పట్టటం కోసం పొలం చుట్టూ నాటిన చెట్లను కర్ర అంటారు. ఉదాహరణకు పొలం చుట్టూ నాటిన తాటి చెట్లను తాటికర్ర అంటారు.
కర్ర సాము
[మార్చు]ప్రధాన వ్యాసం కొరకు చూడండి కర్ర సాము
కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి అప్పట్లో కర్రసాముని వినియోగించేవారు. ఇలా రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది.