Jump to content

కె.ఇ.ప్రభాకర్

వికీపీడియా నుండి
కంబాలపాడు ఈడిగె ప్రభాకర్

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
2018 జనవరి 19 – 2023 మే 1
నియోజకవర్గం కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా

శాసనసభ్యుడు
పదవీ కాలం
1996 – 2004
ముందు కోట్ల విజయభాస్కరరెడ్డి
తరువాత కోట్ల సుజాత
నియోజకవర్గం డోన్ నియోజకవర్గం

శాసనసభ్యుడు
నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం
పదవీ కాలం
2009 – 2014

వ్యక్తిగత వివరాలు

జననం 1955 నవంబర్ 23
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మాదన్న
జీవిత భాగస్వామి ఇందిరా

కంబాలపాడు ఈడిగె ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కేఈ ప్రభాకర్‌ 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1994 శాసన సభ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి గెలిచిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1996 లోక్‌సభకు పోటీ చేసి గెలవడంతో డోన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచాడు. ఆయన 1999 ఎన్నికల్లో కూడా వరుసగా రెండోసారి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయాడు.[2]

కేఈ ప్రభాకర్‌ 2009లో పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2017 జూన్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితుడై,[3] 2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[4] కేఈ ప్రభాకర్‌ తెలుగుదేశం పార్టీకి 2020 మార్చి 13న రాజీనామా చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (29 December 2017). "ఎంఎల్‌సిగా ప్రభాకర్ ఏకగ్రీవం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  2. Andhra Jyothy (13 March 2019). "కేఈ కోట". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  3. The Times of India (2017). "Former MLA KE Prabhakar is IDC Chairman" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  4. The New Indian Express (24 March 2022). "KE Prabhakar elected unopposed as Kurnool MLC". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  5. HMTV (13 March 2020). "టీడీపీకి మరో షాక్.. కేఈ ప్రభాకర్‌ రాజీనామా". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.