కేశినేని శ్రీనివాస్ (నాని)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేశినేని శ్రీనివాస్ (నాని)
కేశినేని శ్రీనివాస్ (నాని)


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 మే 16 - 2024 జనవరి 10
ముందు లగడపాటి రాజగోపాల్
నియోజకవర్గం విజయవాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-22) 1966 జనవరి 22 (వయసు 58)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి పావని కేశినేని
సంతానం 2
నివాసం విజయవాడ
వెబ్‌సైటు https://mpvijayawada.com

కేశినేని శ్రీనివాస్, ఇతనిని నాని అని కూడా పిలుస్తారు. నాని ఒక భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త.[1] అతను ప్రస్తుత లోక్‌సభలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.[1]

ప్రారంభ, వ్యక్తిగత జీవితం[మార్చు]

కేశినేని నాని 1966 జనవరి 22 న విజయవాడలో కేశినేని రామస్వామి ప్రసూనాంబ దంపతులకు జన్మించాడు. అతని బాల్యమంతా తన తోబుట్టువులతో కలిసి విజయవాడ నగరంలోనే గడిపాడు.అతను 1992 ఏప్రిల్ 16న పావనిను (ఎంఎల్ఎ) వివాహం చేసుకున్నాడు. నాని, కేశినేని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జీవిత గమనం[మార్చు]

రాజకీయ జీవితం[మార్చు]

నాని మొదటగా 2008 అక్టోబరు 26న ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అతను ప్రజా రాజ్యం పార్టీకి 3 నెలలు మాత్రమే తన సేవలను కొనసాగించాడు.2009 జనవరిలో దానిని విడిచిపెట్టాడు.ఆ తర్వాత అతను 2009లో తెలుగుదేశం పార్టీలో 2009 చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంటు సభ్యునిగా పోటీచేసి గెలుపొందాడు. 2019 సాధారణ ఎన్నికలలో తిరిగి అదే నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత (2019) లోక్‌సభ సభ్యుడిగా ఉన్న నాని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో కూడా సభ్యుడు .[2] అంతకు ముందు ప్రివిలేజెస్ కమిటీ, అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాడు.

కేశినేని నాని టీడీపీలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన 2024 జనవరి 10న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు.[3]

రాజకీయేతర జీవితం[మార్చు]

కేశినేని ట్రావెల్స్ ను కేశినేని నాని తాత కేశినేని వెంకయ్య 1928 లో ప్రారంభించాడు. అది 90 సంవత్సరాల నుండి వారసత్వంగా నడుపుచున్న కేశినేని ట్రావెల్స్ ను 2018 మార్చి 31న మూసివేశారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Lok Sabha Profile of Kesineni Srinivas (Nani)".
  2. Bandari, Pavan Kumar (2019-12-10). "Centre appoints TDP MP Kesineni Nani as member of ICMR committee". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-22.
  3. Andhrajyothy (10 January 2024). "టీడీపీకి, లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని రాజీనామా". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.

వెలుపలి లంకెలు[మార్చు]