Jump to content

ఖాజా అఫ్రిది

వికీపీడియా నుండి
ఖాజా అఫ్రిది
జననం1988 జూన్ 11
వల్లభురావుపల్లి , మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిజర్నలిస్ట్, కవి, సామజిక సేవకుడు
భార్య / భర్తఇష్రత్ బేగం
పిల్లలుఅధీర మెహవిష్, అషాజ్ ఉర్ రహమాన్
తండ్రిసర్దార్
తల్లిరహ్మత్ బేగం

ఖాజా అఫ్రిది(ఆంగ్లం:Khaja Afridi)(జననం 1988 జూన్ 11) తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గీత రచయిత,[1] జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త.[2]

తొలినాళ్లలో

[మార్చు]

ఖాజా అఫ్రిది 1988 జూన్ 11న సర్దార్, రహ్మత్ బేగం దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లి గ్రామంలో జన్మించాడు. జడ్చర్ల పట్టణంలోని శాతవాహన పాఠశాలలో చదువు పూర్తి చేసిన ఖాజా, మాస్టర్స్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ చదివి రోడా మిస్ట్రీ కళాశాల నుండి సమాజ సేవ అంశంలో డిగ్రీ, పీజీ పట్టాలు పొందాడు. ఖాజా రచన కళాశాల నుండి మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశాడు.[3]

కెరీర్

[మార్చు]

సామాజిక కార్యకర్తగా

[మార్చు]

ఖాజా సామాజిక సేవ అంశం చదువులో భాగంగా నేర్చుకోవడం తన వ్యక్తిత్వంపై మంచి ప్రభావం చూపిందని నమ్ముతాడు. సమాజంలో జరిగే అంశాలపై స్పందించే ధోరణి ఉన్న ఖాజా సామాజిక కార్యకర్తగా చాలా కార్యక్రమాలు నిర్వహించాడు.[ఆధారం చూపాలి]

షేక్ నఫీజ్ అనే అమ్మాయి కండరాల వ్యాధితో బాధపడుతూ ఉండేది, దాన్నుండి కోలుకొని చిత్రకారిణిగా తన సాధన మొదలు పెట్టి చక్కటి చిత్రాలు వేయటం నేర్చుకుంది. 2018లో ఈమెను కలవడానికి జర్నలిస్టుగా వెళ్లిన ఖాజా, ఆమె గీసిన చిత్రాలను చూసి ఆమె ప్రతిభను గుర్తించాడు. ఆ తరువాత కాలంలో ఆమె చిత్రాలకు వేదికలు కల్పించి ఆమె ప్రతిభను ప్రదర్శించటంలో సహాయం చేసాడు.[4]

గీత రచయితగా

[మార్చు]

ఖాజా అఫ్రిది సాధారణంగానే అక్షరంపై మమకారం ఉన్న వ్యక్తిగా జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తూనే గీత రచన చేస్తున్నాడు. ఇతను రాసిన సదువెందుకబ్బినాదే అమ్మ అనే పాటతో జనాదరణ పొందాడు.[5][6][7][8]

రచనలు

[మార్చు]

ఖాజా అఫ్రిది రచించిన కవిత్వ సంపుటి ‘మిరాబ్‌’ ను 2023 సెప్టెంబరు 15న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో కవి యాకూబ్‌, స్కైబాబ, వేణు ఊడుగుల, మెర్సీ మార్గరెట్, మామిడి హరికృష్ణ, అన్వర్‌, సుజాత దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.[9]

ఖాజా అఫ్రిది రచించిన కవిత్వ సంపుటి ‘మిరాబ్‌' ఆవిష్కరణ కార్యక్రమం

మూలాలు

[మార్చు]
  1. Hungama. "Khaja Afridi". Hungama.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-20. Retrieved 2021-09-19.
  2. Andhrajyothy (1 October 2024). "గొల్లత్తగుడికి గుర్తింపేది!". Retrieved 22 October 2024.
  3. "ntnews telugu". న్యూస్. Retrieved 2021-09-19.
  4. "ఆంధ్రప్రభ". న్యూస్. Retrieved 2021-09-19.
  5. Andhrajyothy (10 December 2020). "ఆలోచింపజేస్తోన్న 'సదువెందుకబ్బినాదే' సాంగ్‌". Archived from the original on 20 జనవరి 2021. Retrieved 27 December 2021.
  6. "Khaja Afridi - Top Songs - Listen on JioSaavn". JioSaavn (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
  7. "GMc television". youtube song.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Disha (15 September 2023). "మిరాబ్ పుస్తక ఆవిష్కరణ". Archived from the original on 16 September 2023. Retrieved 16 September 2023.
  9. "'మిరాబ్' కవిత్వం సున్నితం.. ఖాజా అఫ్రిది పుస్తకంపై ఎడిటర్ శ్రీనివాస్". 19 September 2023. Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]