చంద్రశేఖర్ యేలేటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రశేఖర్ యేలేటి
చంద్రశేఖర్ యేలేటి
జననం (1973-03-04) 1973 మార్చి 4 (వయసు 51)
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003–present

చంద్రశేఖర్ యేలేటి (జననం మార్చి 4, 1973) తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. [1] ఆయన అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. [2] తన దశాబ్ద వృత్తి జీవితం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు నంది పురస్కారాలను పొందాడు. [3]

బాల్య జీవితం, కెరీర్

[మార్చు]

ఆయన 1973 మార్చి 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తుని లో జన్మించాడు. గుణ్ణం గంగరాజు ఆయన బంధువు. చంద్రశేఖర్ మే 19న వివాహం జరిగింది.[4][5] గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన తెలుగు చలన చిత్రం లిటిల్ సోల్జర్స్ లో సహాయ దర్శకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. బహుళ ప్రజాదరణ పొందిన హాస్య ధారావాహిక అయిన అమృతం (ధారావాహిక) మొదటి 10 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాడు.

మలుపు (2004–2009)

[మార్చు]

అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసిన తరువాత ఆయన ఐతే సినిమాతో దర్శకత్వ భాద్యతలు చేపట్టాడు. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్ల ఖర్చయింది. కానీ ఈ చిత్రం 6 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండు సంవత్సరాల తరువాత ఆయన అనుకోకుండా ఒక రోజు చిత్రాన్ని విదుదల చేసాడు. ఈ రెండు చిత్రాలకు గున్నం గంగరాజు నిర్మాణ భాద్యతలు చేపట్టాడు. కొంత కాలం వ్యవధి తరువాత ఆయన గోపీచంద్ కథా నాయకునిగా ఒక్కడున్నాడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2009లో ఆయన తన నాల్గవ చిత్రం మంచు మనోజ్ కథానాయకునిగా ప్రయాణం చిత్రానికి దర్శకత్వం వహించాడు.

చిత్రాలు

[మార్చు]
సంవత్సర చిత్రం పురస్కారాలు
2003 ఐతే National Film Award for Best Feature Film in Telugu
Nandi Award for Best Story Writer
Nandi Special Jury Award - Pavan Malhotra
Filmfare Best Villain Award (Telugu) - Pavan Malhotra
2005 అనుకోకుండా ఒక రోజు Nandi Award for Best Screenplay Writer
Nandi Award for Second Best Feature Film
Santosham Best Actress Award - Charmme Kaur
2007 ఒక్కడున్నాడు
2009 ప్రయాణం
2013 సాహసం
2016 మనమంతా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
2021 చెక్ [6]

టెలివిజన్

[మార్చు]

అవార్డులు

[మార్చు]
National Film Awards
Nandi Awards

మూలాలు

[మార్చు]
  1. 'Tastes are changing' - The Hindu
  2. "Akshay Kumar keen to remake NTR's Oosaravelli | Deccan Chronicle". Archived from the original on 2013-05-09. Retrieved 2014-03-03.
  3. Chandra Sekhar Yeleti - Telugu Cinema interview - Telugu film director
  4. "Chandrasekhar Yeleti Biography, Chandrasekhar Yeleti Profile - entertainment.oneindia.in". Archived from the original on 2013-10-05. Retrieved 2014-03-03.
  5. 2006.http://www.hindu.com/fr/2007/01/19/stories/2007011900390200.htm
  6. Boy, Zupp (2021-02-26). "Check movie Review: Nithiin Starrer is not up to the mark!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-27.

ఇతర లింకులు

[మార్చు]