చదలవాడ కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదలవాడ కృష్ణమూర్తి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
27 ఏప్రిల్ 2015 - 26 ఏప్రిల్ 2017

వ్యక్తిగత వివరాలు

జననం 1 మే 1948
చెన్నూర్, దగదర్తి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకట సుబ్బన్న, రమణమ్మ
జీవిత భాగస్వామి చదలవాడ సుచరిత

చదలవాడ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

చదలవాడ కృష్ణమూర్తి 1973లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసి 1981లో నాయుడుపేట సర్పంచ్‌గా గెలిచాడు. ఆయన1994లో తిరుపతి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించాడు, కానీ పలు కారణాల వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. చదలవాడ కృష్ణమూర్తి 1999లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తిరుపతి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

చదలవాడ కృష్ణమూర్తి అనంతరం కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉండి 2014లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కిన చివరి నిమిషంలో అది చేజారింది. ఆయనకు 2014లో పార్టీ అధికారంలోకి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2] చదలవాడ కృష్ణమూర్తి 18 అక్టోబర్ 2018లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  2. Sakshi (2 May 2015). "టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ ప్రమాణం". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  3. The Hindu (22 October 2018). "Chadalawada defends joining JSP". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.