అక్షాంశ రేఖాంశాలు: 15°48′36.000″N 79°58′30.000″E / 15.81000000°N 79.97500000°E / 15.81000000; 79.97500000

చెరువుకొమ్మువారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెరువుకొమ్మువారి పాలెం
గ్రామం
పటం
చెరువుకొమ్మువారి పాలెం is located in ఆంధ్రప్రదేశ్
చెరువుకొమ్మువారి పాలెం
చెరువుకొమ్మువారి పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°48′36.000″N 79°58′30.000″E / 15.81000000°N 79.97500000°E / 15.81000000; 79.97500000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


చెరువుకొమ్మువారి పాలెం, బాపట్ల జిల్లా, అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం జర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

[మార్చు]

ప్రజలు, దాతలు భక్తుల విరాళాలతొ రు.50 లక్షల అంచనావ్యయంతో, ఈ ఆలయం, ఒక యెకరం స్థలంలో నిర్మించారు. మూలవిరాట్టులను ప్రత్యేకంగా తయారు చేయిఛినారు. గర్భగుడి, ముఖమంటపం, ఆంజనేయస్వామి గుడి, ప్రవేశమార్గంలో గాలిగోపురం గూడా నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2014, జూన్-12, బుధవారం నాడు ప్రారంభమైనవి. ఈ ఉత్సవాలలో భాగంగా, గురువారం నాడు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితులు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహం, అకల్మక హోమం, పంచగవ్యప్రాసన, వాస్తుపూజ, వాస్తుహోమం, అగ్ని మథనం, పర్యగ్నీకరణం, అగ్ని ప్రతిష్ఠాపన, నవగ్రహహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నాడు వేదపండితులు ప్రార్థన, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహం, క్షీరాధివాసం, ఉత్తహోమం నిర్వహించారు. తరువాత స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో పలువురు భక్తులు పాల్గొన్నారు. 2014, జూన్-15, ఆదివారం నాడు విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన పూజల నడుమ, ఘనంగా జరిగింది. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలోని గర్భగుడిలో, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి మూల విరాట్టును ప్రతిష్ఠించారు. అనంతరం విమాన శిఖర, జీవధ్వజ, నాగరాజ, గణేశ ప్రతిష్ఠలు కన్నులపండువగా సాగినవి. యాగశాలలో వేదపండితులు భగవత్ ప్రార్థన, విష్వక్సేనా ఆరాధన, పుణ్యావహం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థులు, పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి, పూజలు చేసారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసంతర్పణ నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ జరిపిన 41 రోజుల అనంతరం, 2014, జూలై-26, శుక్రవారం నాడు, మండల దీక్షను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గర్భగుడిలోని మూలవిరాట్టులను, సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామంలోని 25 మంది దంపతులు అభిషేకం, శాంతిహోమంతో పాటు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. మహిళలు, ధ్వజస్తంభానికి మరియూ గ్రామం నడిబొడ్డున ఉన్న నాభిశిల (బొడ్డురాయి) కు ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుచున్నారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

275 కుటుంబాలు ఉంటున్న ఈ గ్రామంలో దాదాపు అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించుచున్నారు. అయినప్పటికీ, చదువు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రస్తుతం గ్రామంలో 22 మంది యువకులు మంచి మంచి సంస్థలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు హైదరాబాదు, చెన్నై, ముంబాయి, బెంగళూరు, నగరాలతోపాటు ఇంగ్లండ్, అమెరికాలలో కొలువులు చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి చెరువుకొమ్ముపాలెం సాఫ్ట్ వేర్ నిపుణుల విభాగం (సి.ఎస్.ఎన్.వి) స్థాపించి గ్రామంలోని చదువుకున్నవారికి ఉద్యోగాన్వేషణలో తోడ్పడుచున్నారు. గ్రామంలో నిరుద్యోగ నిర్మూలనే వీరి ధ్యేయం అంటున్నారు. ఇలా వీరి ప్రోత్సాహంతో, గ్రామం నుండి 16 మంది యువకులకు ఉద్యోగాలు సంపాదించడం విశేషం.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]