Jump to content

జయశ్రీ గడ్కర్

వికీపీడియా నుండి
జయశ్రీ గడ్కర్
జననం(1942-02-21)1942 ఫిబ్రవరి 21
మరణం2008 ఆగస్టు 29(2008-08-29) (వయసు 66)
వృత్తినటి
జీవిత భాగస్వామిబాల ధురి

జయశ్రీ గడ్కర్ (1942, ఫిబ్రవరి 21 - 2008, ఆగస్టు 29 )[1] కర్ణాటకకు చెందిన సినిమా నటి. 1950-80 మధ్యకాలంలో మరాఠీ సినిమారంగంలో ప్రముఖ నటిగా వెలుగొందింది. నాలుగు దశాబ్దాల కాలంలో దాదాపు 250 సినిమాల్లో జయశ్రీ నటించింది.

జననం

[మార్చు]

జయశ్రీ 1942, ఫిబ్రవరి 21న కర్ణాటక రాష్ట్రం, ఉత్తర కన్నడ జిల్లా, కార్వార్ సమీపంలోని కనస్‌గిరి (సదాశివగడ్)లో కొంకణి మాట్లాడే కుటుంబంలో జన్మించింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రామానంద్ సాగర్ టివి సీరియల్ రామాయణంలో దశరథ పాత్ర పోషించిన నాటకరంగ నటుడు బాల ధురితో జయశ్రీ వివాహం జరిగింది.[3]

నటనారంగం

[మార్చు]

జయశ్రీ బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. సినిమారంగంలోకి తమాషా డాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చి, 1955లో వి. శాంతారామ్ ఝనక్ ఝనక్ పాయల్ బాజే సినిమాలో గ్రూప్ డ్యాన్సర్‌గా నటించింది. తరువాత, సుప్రసిద్ధ మరాఠీ చలనచిత్ర దర్శకుడు దినకర్ డి పాటిల్ తీసిన దిసత్ తసా నసత్‌ అనే మరాఠీ సినిమాలో రాజా గోసవి సరసన నృత్యంతో చిన్నపాత్రలో నటించింది.

దీని తర్వాత తమాషా నృత్యం ఆధారంగా వచ్చిన సంగ్త్యే ఐకా అనే సినిమాలో తొలిసారిగా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా జయశ్రీకి కీర్తిని, గుర్తింపును అందించింది. ఆ తరువాత జయశ్రీ హీరోయిన్ పాత్రలు చేస్తూ, మరాఠీ సినిమారంగ చరిత్రలో ప్రముఖ నటిగా నిలిచింది.

సినిమాలు

[మార్చు]
  1. సంగూ కాశీ మే
  2. ఛందోబా ఛందోబా భాగ్లాస్ కా
  3. ఘర్కుల్
  4. అవఘాచి సంసార్
  5. గత్ పడ్లీ థాక థాకా
  6. ఆలియా భోగాసి
  7. సూన్ లడకీ యా ఘర్చి
  8. జివాలా
  9. తాంబ్ లక్ష్మి కుంకు లావాటే
  10. 1954 సుబహ్ కా తారా
  11. 1955 సావిత్రి
  12. 1959 సంగ్తే ఐకా
  13. 1959 మదరి
  14. 1960 పోలీస్ డిటెక్టివ్
  15. 1960 పంచరతి
  16. 1960 బింద్య
  17. 1960 అవఘాచి సన్సార్
  18. 1961 ససురల్
  19. 1961 సారంగ
  20. 1961 మణిని
  21. 1962 బాప్ మఝా బ్రహ్మచారి
  22. 1962 సుఖ్ ఆలే మజ్యా దారి
  23. 1962 ప్రైవేట్ సెక్రటరీ
  24. 1963 సుభద్ర హరన్
  25. 1963 పడాడ
  26. 1963 మోహిత్యాంచి మంజుల
  27. 1963 మేరే అర్మాన్ మేరే సప్నే
  28. 1964 మహాసతి అనుసూయ
  29. 1964 సవాల్ మజా ఐకా
  30. 1965 మల్హరి మార్తాండ్
  31. 1965 ఆయి కునా మ్హను మీ
  32. 1965 సాధి మాన్సా (1965)
  33. 1965 గోపాల్ - కృష్ణ
  34. 1965 ఆయి కునా మ్హను మీ
  35. 1966 పట్లాచి సూన్
  36. 1967 సురంగ మ్హంత్యత్ మాల
  37. 1967 లవ్-కుష్
  38. 1967 బహరోన్ కే సప్నే
  39. 1968 ఏక్ గావ్ బారా భంగడి
  40. 1968 హర్ హర్ గంగే
  41. 1968 బలరామ్ శ్రీ కృష్ణ
  42. 1970 దగాబాజ్
  43. 1970 భగవాన్ పరశురామ్
  44. 1971 అషీచ్ ఒక రాత్రి హోతీ
  45. 1971 లఖత్ అషి దేఖానీ
  46. 1971 తులసీ వివాహ్
  47. 1971 శ్రీ కృష్ణ లీల
  48. 1971 శ్రీ కృష్ణార్జున్ యుద్ధం
  49. 1971 కసా కై పాటిల్ బరా హై కా
  50. 1972 నాగ పంచమి
  51. 1972 హరి దర్శన్
  52. 1973 మహాసతి సావిత్రి
  53. 1973 ఆయ్ ఉడే గా అంబాబాయి
  54. 1974 కిసాన్ ఔర్ భగవాన్
  55. 1974 హర్ హర్ మహాదేవ్
  56. 1974 దావత్
  57. 1974 భగత్ ధన్నా జట్
  58. 1974 బాలక్ ధ్రువ్
  59. 1975 ఏక్ గావ్ కీ కహానీ
  60. 1976 బజరంగబలి
  61. 1977 మహిమ శ్రీ రామ్ కీ
  62. 1977 గాయత్రీ మహిమ
  63. 1978 అడ్వెంచర్స్ ఆఫ్ అల్లాదీన్
  64. 1979 హర్ హర్ గంగే
  65. 1980 కడక్లక్ష్మి
  66. 1981 సంసాని: ది సెన్సేషన్
  67. 1981 సూన్ మజీ లక్ష్మి
  68. 1981 జియో తో ఐసే జియో
  69. 1982 ఆవాన్
  70. 1983 సతీ నాగ్ కన్య
  71. 1983 సంపూర్ణ మహాభారత్
  72. 1984 సులాగ్తే అర్మాన్
  73. 1984 సిందూర్ కా దాన్
  74. 1984 శ్రవణ్ కుమార్
  75. 1984/II మాయా బజార్
  76. 1984 నయా కదమ్
  77. 1985 మాస్టర్జీ
  78. 1986 వీర్ భీంసేన్
  79. 1986 పాటన్ కి బాజీ
  80. 1986 కృష్ణ-కృష్ణ
  81. 1986 బిజిలీ
  82. 1986 రామాయణ్ (టీవీ సిరీస్)
  83. 1987 షేర్ శివాజీ
  84. 1987 పూర్ణసత్య
  85. 1987 ఖూనీ దరిందా
  86. 1987 నజరానా
  87. 1987 భటక్ భవాని
  88. 1988 మార్ మిటెంగే
  89. 1989 ఈశ్వర్
  90. 1989 కానూన్ అప్నా అప్నా
  91. 1990 అమిరి గరీబీ
  92. 1991 బాంబే టూ మారిషస్
  93. 1992 మాల్మసాలా
  94. 1997 లవ్ కుష్
  95. 2000 సౌభాగ్యదన్

తర్వాత సంవత్సరాల్లో జయశ్రీ సినిమా దర్శకురాలిగా మారి సాసర్ మహర్, ఆషి అసవి సాసు అనే సినిమాలకు దర్శకత్వం వహించింది. రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ టివి సీరియల్ లో కౌసల్యగా, తన భర్త బాల్ ధురి దశరథుడుగా నటించారు. జయశ్రీ రాసిన ఆషి మీ జయశ్రీ అనే ఆత్మకథ 1986లో ప్రచురించబడింది.[4]

అవార్డులు

[మార్చు]

జయశ్రీ మణిని, వైజంత, సవాల్ మజా ఐకా, సాధి మాన్సా మొదలైన సినిమాలలోని తన పాత్రలకు అవార్డులు అందుకున్నది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Actress Jayshree Gadkar passes away". The Hindu. 29 August 2008. Archived from the original on 13 December 2009. Retrieved 2022-12-18.
  2. B. N. Sri Sathyan (1985). Karnataka State Gazetteer: Uttara Kannada. Director of Print., Stationery and Publications at the Government Press. Retrieved 2022-12-18.
  3. Indian Literature. Sähitya Akademi. 1987. Retrieved 2022-12-18.
  4. Gadkar Jayshree (1986). Ashi Me Jayshree. Rohan, Pune. Retrieved 2022-12-18.

బయటి లింకులు

[మార్చు]