జావేద్ మియాందాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జావేద్ మియాందాద్
పాకిస్థాన్‌-నెదర్లాండ్స్ క్రికెట్ మ్యాచ్; పాకిస్తాన్ క్రీడాకారుడు జావేద్ మియాందాద్ బ్యాటింగ్ చేస్తూంటే, అతని వెనుక డచ్ వికెట్ కీపర్ రెనీ షూన్‌హెమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ జావేద్ మియాందాద్
పుట్టిన తేదీ (1957-06-12) 1957 జూన్ 12 (వయసు 67)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
ఎత్తు5 అ. 8 అం. (1.73 మీ.)
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్ (లెగ్ బ్రేక్)
పాత్రబ్యాట్స్‌మాన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 71)1976 9 అక్టోబర్ - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1993 16 డిసెంబర్ - జింబాబ్వే తో
తొలి వన్‌డే (క్యాప్ 15)1975 జూన్ 11 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1996 9 మార్చ్ - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975–1991హబీబ్ బ్యాంక్ లిమిటెడ్
1976–1979సస్సెక్స్
1980–1985గ్లామర్‌గాన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఒ.డి.ఐ.లు ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 124 233 402 439
చేసిన పరుగులు 8,832 7,381 28,663 13,973
బ్యాటింగు సగటు 52.57 41.70 53.37 42.60
100లు/50లు 23/43 8/50 80/139 13/101
అత్యుత్తమ స్కోరు 280* 135 311 152*
వేసిన బంతులు 1,470 297 12,690 830
వికెట్లు 17 7 191 18
బౌలింగు సగటు 40.11 42.42 34.06 34.05
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 6 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/74 2/22 7/39 3/20
క్యాచ్‌లు/స్టంపింగులు 93/1 71/2 341/3 142/2
మూలం: ESPNక్రిక్ ఇన్ఫో, 2009 మార్చి 10

మొహమ్మద్ జావేద్ మియాందాద్ (జననం: 1957 జూన్ 12) ఒక పాకిస్తానీ క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్.[1]ఇతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో 1975 నుండి 1996 వరకు టెస్టు మ్యాచులు, వన్డే మ్యాచులు ఆడాడు.[2] మియాందాద్ తన సమకాలీనులైన క్రికెటర్ల నుండి, విమర్శకుల నుండి, క్రికెట్ చరిత్రకారులనుండి ప్రశంసలు పొందాడు. ఇతడు ESPN లెజెండ్స్ ఆఫ్ క్రికెట్‌లో ఉత్తమ క్రికెటర్‌గా 44వ ర్యాంకును సంపాదించాడు.[3]ఇతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.1986లో భారతజట్టుతో ఆడిన ఆటలో చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్ కొట్టి విజయం తెచ్చిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయం సాధించడం అదే మొదటిసారి.[4] క్రికటర్‌గా వైదొలగిన తర్వాత ఇతడు పాకిస్తాన్ క్రికెట్ టీముకు పలు సందర్భాలలో కోచ్‌గా వ్యవహరించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌లో పలు కీలక బాధ్యతలను చేపట్టాడు.[5]

2009లో మియాందాద్‌కు "ఐ.సి.సి.క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్"లో చోటు దక్కింది.[6]

ఆరంభ జీవితం

[మార్చు]
కరాచీలో ఒక కార్యక్రమంలో (ఆకుపచ్చ చొక్కాలో మియాందాద్)

జావేద్ మియాందాద్ 1957, జూన్ 12న కరాచీలో జన్మించాడు.[7] ఇతని తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రం పాలన్‌పూర్ నుండి కరాచీకి వలస వచ్చారు. ఇతని తండ్రి మియాందాద్ నూర్‌మొహమ్మద్ త్యాగి పాలన్‌పూర్‌, అహ్మదాబాద్, బరోడాలలో పోలీసు శాఖలో పనిచేసేవాడు.[8] ఇతని ముగ్గురు సోదరులు అన్వర్ మియాందాద్, సొహైల్ మియాందాద్, బషీర్ మియాందాద్ పాకిస్తాన్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.[9][10][11] టెస్ట్ ఆటగాడు ఫైజల్ ఇక్బాల్ ఇతని మేనల్లుడు.[12]

క్రీడాజీవితం

[మార్చు]

టెస్ట్ క్రికెట్

[మార్చు]

మియాందాద్ తన టెస్ట్ క్రికెట్ జీవితం 1976, అక్టోబరు 9న లాహోర్ గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో ఆడిన టెస్టు మ్యాచుతో ప్రారంభమయ్యింది.[1] ఆ మ్యాచులో ఇతడు 163, 25(నాట్ ఔట్) పరుగులు చేసి తొలి టెస్టులో సెంచురీ చేసిన అతి పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటికి అతని వయసు 19 సంవత్సరాల 119 రోజులు మాత్రమే. ఆ మ్యాచులో ఇతడు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ మ్యాచు పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.[13][14]ఆ సీరిస్‌లో మూడవ మ్యాచ్‌( కరాచీ నేషనల్ స్టేడియం)లో 206 పరుగులు చేసి డబుల్ సెంచురీ చేసిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 47 యేళ్ల జార్జ్ హేడ్లీ పేరు మీద ఈ రికార్డు ఉండేది.[15][16]ఆ సిరీస్‌లో మియాందాద్ 5 ఇన్నింగులలో 504 పరుగులు చేసి అత్యధిక పరుగులు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[17] ఇతని ఆట పాకిస్తాన్ 2-0 తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి తోడ్పడింది.[15]

అది మొదలు మియాందాద్ 1993 వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో మొత్తం 124 టెస్ట్ మ్యాచులలో 189 ఇన్నింగులలో బ్యాటింగ్ చేశాడు. ఇతడు 8,832 టెస్టు పరుగులు తీశాడు. 2015లో యూనిస్ ఖాన్ బద్దలు చేసే వరకు ఇదే పాకిస్తాన్ క్రికెటర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు. కానీ ఇతడు తన 17 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 10,000 పరుగుల లక్ష్యాన్ని అధిగమించలేక పోయాడు.[1][18] మియాందాద్ చేసిన 23 సెంచురీలు, 43 అర్థశతకాలు పాకిస్తాన్ జట్టు రికార్డులుగా ఉండేవి. ఇంజమాముల్ హక్ ఈ రికార్డులను బద్దలు చేశాడు. ఇతడు 6 డబుల్ సెంచురీలు చేశాడు. మొదటి టెస్టు, వందవ టెస్టులలో సెంచురీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.[19] ఇతడు తన అత్యధిక స్కోరు 280 పరుగులు (నాట్ ఔట్) భారత్‌ జట్టుపై తీశాడు. ఆ మ్యాచులో పాకిస్తాన్ భారత్‌పై ఇన్నింగ్స్, 119 పరుగుల తేడాతో గెలుపొందింది.[20]


అంతర్జాతీయ క్రికెట్‌లో జావేద్ మియాందాద్ ఫలితాలు[21]
  మ్యాచులు గెలుపు ఓటమి డ్రా టై ఫలితాలు తేలనివి
టెస్ట్[22] 124 39 23 62 0
వన్డే[23] 233 119 105 - 2 7

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్

[మార్చు]

మియాందాద్ తొలి వన్డే మ్యాచ్ 1975 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుతో బర్మింగ్‌హామ్‌లో ఆడాడు. ఇతని చివరి వన్డే మ్యాచ్ కూడా ప్రపంచకప్ మ్యాచ్ కావడం గమనార్హం.[24][25]వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 119 పరుగులు(నాట్ ఔట్). 1982లో గడాఫీ స్టేడియంలో భారత్‌పై జరిగిన వన్డే మ్యాచులో 77 బంతులలో ఈ పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్ పాకిస్తాన్ ఓడిపోయింది.[5][26]

1986లో షార్జాలో జరిగిన ఆస్ట్రెలేషియా కప్పును దక్కించుకోవడం ద్వారా పాకిస్తాన్ మొదటి ముఖ్యమైన టోర్నమెంటును గెలుపొందింది. ఫైనల్ మ్యాచిలో ఇండియాపై మియాందాద్ 116 పరుగులు తీసి అజేయంగా నిలిచాడు.[27][28] ఇది వన్డే క్రికెట్ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచింది. దీనితో మియాందాద్ హీరోగా వీక్షకుల మదిలో నిలిచిపోయాడు.[5][29][30]

ఇతడు ఆరు ప్రపంచకప్ టోర్నమెంటులలో పాల్గొన్న ఇద్దరిలో ఇతడు మొట్టమొదటి వాడు. సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును నెలకొల్పిన రెండవ క్రికెటర్.

కెప్టెన్‌గా

[మార్చు]

1979-80 భారత్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ ఉద్వాసన తర్వాత 22యేళ్ల జావేద్ మియాందాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[31] పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీనియర్ ఆటగాళ్లైన జహీర్ అబ్బాస్, సర్ఫరాజ్ నవాజ్, మాజిద్ ఖాన్ వంటి వారిని పక్కనపెట్టి ఇతనికి నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. మొదట్లో ఇతడు కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా కెప్టెన్‌గా 1981/82లలో మొదటి రెండు సిరీస్‌లలో ఆస్ట్రేలియాతో గెలుపు, వెస్ట్ ఇండీస్‌తో 0-1 ఓటమితో గట్టెక్కాడు.[32][33] ఇతని వ్యతిరేకులు బలం పుంజుకోవడంతో ఇతని మొదటి దఫా కెప్టెన్సీ శ్రీలంక జట్టుతో జరిగిన హోమ్‌ సిరీస్‌తో ముగిసింది.[34][35]

కోచ్, వ్యాఖ్యాతగా

[మార్చు]

మియాందాద్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 1998 - 2004 మధ్యకాలంలో మూడు సార్లు కోచ్‌గా వ్యవహారించాడు. తరువాత భారతదేశంలో అతనికి కోచ్‌గా, టీ.వీ.వ్యాఖ్యాతగా అవకాశాలు వచ్చాయి. [36] 2012లో ఇతడు 20-20 వరల్డ్ కప్‌ టోర్నమెంటులో శ్రీలంక జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంటుగా ఎంపికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతడు తహీరా సైగల్‌ను 1981లో వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఇతనికి కుమారుడు జునాయిద్ మియాందాద్ అంతర్జాతీయ నేరస్థుడు దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రూఖ్ ఇబ్రహీంను వివాహం చేసుకున్నాడు[37]

రికార్డులు, ఘనతలు

[మార్చు]
  • లార్డ్స్‌లో ఉన్న హాల్ ఆఫ్ ఫేమ్‌లో పేరు ఎక్కిన ముగ్గురు పాకిస్తానీ క్రికెట్ క్రీడాకారుల్లో మియాందాద్ ఒకడు.[38][39][40]
  • 1986లో ఇతనికి పాకిస్తాన్ రాష్ట్రపతి నుండి ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డు లభించింది[41]
  • ఆరు ప్రపంచకప్‌ పోటీలలో పాల్గొన్న పాల్గొన్న ఇద్దరు క్రికెటర్లలో మియాందాద్ ఒకడు. (రెండవ వాడు సచిన్ టెండుల్కర్).[42]
  • 1982లో విజ్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[7]
  • ఇతడు 6 ప్రపంచకప్ టోర్నమెంట్లలో 33 మ్యాచులు ఆడి 1083 పరుగులు చేశాడు.[42]
  • ఇతడిని ESPN లెజెండ్స్ ఆఫ్ క్రికెట్‌లో 44వ ఆల్‌టైమ్‌ ఉత్తమ క్రికెటర్‌గా ప్రకటించారు.
  • ఇతడు ద్విశతకం చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్. ఈ రికార్డును 48 సంవత్సరాలు, 1 రోజుగా ఎవరూ అధిగమించలేదు.[43]
  • ఇతడు 9 వరుస అర్థశతకాలతో వన్డే క్రికెట్‌లో వరుసగా ఎక్కువ అర్ధశతకాలను చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును కలిగిఉన్నాడు.[44]
  • పాకిస్తాన్ ప్రభుత్వ‌ మూడవ అత్యున్నత పురస్కారం సితార - ఐ - ఇంతియాజ్ 1992లో ఇతడిని వరించింది.[45]

ప్రదర్శన

[మార్చు]

టెస్ట్ ప్రదర్శన

[మార్చు]
టెస్ట్ మ్యాచుల్లో జావేద్ మియాందాద్ ప్రదర్శన[1][46]
ప్రత్యర్థి మ్యాచులు ఇన్నింగులు నాట్ ఔట్ పరుగులు అత్యధిక పరుగులు సగటు 100 50 కాట్ స్టంప్డ్
 ఆస్ట్రేలియా 25 40 2 1797 211 47.28 6 7 1 1
 ఇంగ్లాండు 22 32 6 1329 260 51.11 2 9 20
 భారతదేశం 28 39 6 2228 280* 67.51 5 14 18
 న్యూజీలాండ్ 18 29 5 1919 271 79.95 7 6 20
 శ్రీలంక 12 16 2 882 203* 41.57 1 2 11
 వెస్ట్ ఇండీస్ 16 28 0 834 114 29.78 2 2 11
 జింబాబ్వే 3 5 0 143 70 28.60 0 1 0
మొత్తం 124 189 21 9132 280* 45.68 23 41 81 1

వన్డే ప్రదర్శన

[మార్చు]
వన్డే మ్యాచుల్లో జావేద్ మియాందాద్ ప్రదర్శన[1][47]
ప్రత్యర్థి మ్యాచులు ఇన్నింగులు నాట్ ఔట్ పరుగులు అత్యధిక స్కోరు సగటు 100 50 కాట్ స్టంప్డ్
 ఆస్ట్రేలియా 35 33 3 1019 74* 33.96 0 7 10 1
 బంగ్లాదేశ్ 1 0 15 15 15.00 0 0 0
 కెనడా 1 1 0 0
 ఇంగ్లాండు 27 27 6 991 113 47.19 1 10 12
 భారతదేశం 35 34 11 1175 119* 51.08 3 6 13
 నెదర్లాండ్స్ 1 0 0
 న్యూజీలాండ్ 24 20 3 702 90* 41.29 0 4 6
 దక్షిణాఫ్రికా 3 3 0 145 107 48.33 1 0 12
 శ్రీలంక 35 31 10 1141 115* 54.33 2 8 12
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 0 0
 వెస్ట్ ఇండీస్ 64 64 7 1930 100* 33.85 1 12 14 1
 జింబాబ్వే 6 5 1 263 89 65.75 0 3 2
మొత్తం 233 218 42 7381 119* 41.70 8 50 71 2

ప్రదర్శన గ్రాఫ్

[మార్చు]
జావేద్ మియాందాద్ కెరీర్ ప్రదర్శనను సూచించే రేఖాచిత్రం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Javed Miandad". ESPNcricinfo. Archived from the original on జూలై 15 2012. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  2. Gower, David. David Gower's 50 Greatest Cricketers of All Time. Icon Books Ltd. p. 33.
  3. "ESPN's Legends of Cricket". Archived from the original on 2019-10-22. Retrieved 2020-06-12.
  4. Abbasi, Kamran (ఏప్రిల్ 26 2000). "Miandad seals it with a six". ESPNcricinfo. Archived from the original on సెప్టెంబరు 16 2012. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  5. 5.0 5.1 5.2 Rabbani, Khawer (మార్చి 29 2003). "The man they called 'Mum & Dad'". ESPNcricinfo. Archived from the original on మే 21 2013. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  6. Cricinfo (జనవరి 2 2009). "ICC and FICA launch Cricket Hall of Fame". ESPNcricinfo. Archived from the original on జూలై 19 2019. Retrieved జూలై 19 2019. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  7. 7.0 7.1 "1982: Wisden Cricketer of the Year". ESPNcricinfo. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= (help)[permanent dead link]
  8. Osman Samiuddin (జూన్ 12 2017), "Javed Miandad and Pakistan's quest for izzat" Archived 2019-04-21 at the Wayback Machine, CricInfo. Retrieved ఆగస్టు 12 2018.
  9. "Profile:Anwar Miandad". Archived from the original on నవంబరు 5 2012. Retrieved ఆగస్టు 15 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  10. "Profile:Sohail Miandad". Archived from the original on జనవరి 4 2012. Retrieved ఆగస్టు 15 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  11. "Profile:Bashir Miandad". Archived from the original on నవంబరు 9 2012. Retrieved ఆగస్టు 15 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  12. "Faisal Iqbal". Archived from the original on జూన్ 26 2012. Retrieved ఆగస్టు 15 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  13. "న్యూజీలాండ్ tour of Pakistan, 1976/77: Test series – 1st Test". ESPNcricinfo. Archived from the original on నవంబరు 13 2013. Retrieved అక్టోబరు 3 2013. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  14. "Youngest players to score a hundred". ESPNcricinfo. Archived from the original on ఆగస్టు 21 2015. Retrieved అక్టోబరు 3 2013. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  15. 15.0 15.1 "న్యూజీలాండ్ tour of Pakistan, 1976/77: Test series – 3rd Test". ESPNcricinfo. Archived from the original on అక్టోబరు 2 2013. Retrieved అక్టోబరు 3 2013. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  16. "Youngest players to score a double hundred". ESPNcricinfo. Archived from the original on అక్టోబరు 8 2013. Retrieved అక్టోబరు 3 2013. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  17. "Records / New Zealand in Pakistan Test Series, 1976/77 / Most runs". ESPNcricinfo. Retrieved అక్టోబరు 3 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  18. "Most runs in a Test career". ESPNcricinfo. Archived from the original on అక్టోబరు 9 2018. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  19. "Most double hundreds in a Test career". ESPNcricinfo. Archived from the original on ఫిబ్రవరి 18 2017. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  20. "ఇండియా in Pakistan Test Series – 4th Test". ESPNcricinfo. Archived from the original on నవంబరు 28 2012. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  21. "Statistics / Statsguru / KC Sangakkara/One-Day Internationals". Cricinfo. Archived from the original on సెప్టెంబరు 19 2015. Retrieved ఏప్రిల్ 25 2015. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  22. "List of Test victories". Cricinfo. Archived from the original on 19 జనవరి 2014. Retrieved 12 జూన్ 2020.
  23. "List of ODI victories". Cricinfo. Archived from the original on 31 అక్టోబరు 2013. Retrieved 12 జూన్ 2020.
  24. "Prudential World Cup – 8th match, Group B". ESPNcricinfo. Archived from the original on జూన్ 27 2012. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  25. "ICC World Cup – 2nd Quarter Final, India vs Paakistan". ESPNcricinfo. Archived from the original on జూన్ 20 2017. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  26. "ఇండియా in Pakistan ODI Series – 3rd ODI". ESPNcricinfo. Archived from the original on జనవరి 2 2012. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  27. "Austral-Asia Cup – Final". ESPNcricinfo. Archived from the original on జనవరి 29 2013. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  28. Wisden CricInfo staff (ఏప్రిల్ 18 2003). "1986 – There it is ..." ESPNcricinfo. Archived from the original on ఏప్రిల్ 4 2015. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  29. Abbasi, Kamran (ఏప్రిల్ 2 2004). "ఇండియా v Pakistan – The power of a six". ESPNcricinfo. Archived from the original on జనవరి 27 2011. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  30. Abbasi, Kamran (ఏప్రిల్ 2 2004). "AustralAsia Cup final, Sharjah, 1986 – Six and done – Javed saves the best for last". ESPNcricinfo. Archived from the original on ఏప్రిల్ 22 2013. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  31. "పాకిస్తాన్ in India Test Series, 1979/80 – Results". ESPNcricinfo. Archived from the original on డిసెంబరు 29 2011. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  32. "Wisden – AUSTRALIA v PAKISTAN". ESPNcricinfo. Archived from the original on అక్టోబరు 23 2012. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  33. "వెస్టిండీస్ in Pakistan Test Series, 1980/81 – Results". ESPNcricinfo. Archived from the original on జూలై 9 2012. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  34. "Wisden – The Pakistanis in Australia, 1981–82". ESPNcricinfo. Archived from the original on నవంబరు 30 2012. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  35. Ravindran, Siddarth (అక్టోబరు 11 2007). "Young turks at the top". ESPNcricinfo. Archived from the original on ఏప్రిల్ 22 2012. Retrieved ఆగస్టు 14 2012. {{cite web}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (help)
  36. "పాకిస్తాన్ Times – News coverage". పాకిస్తాన్ Times. Archived from the original on జూన్ 14 2011. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  37. ""Dawood 4th 'most wanted' criminal on Forbes list"". Archived from the original on 2019-12-29. Retrieved 2020-06-12.
  38. "ICC Cricket Hall of Fame". ESPNcricinfo. Archived from the original on జూన్ 28 2012. Retrieved ఆగస్టు 10 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  39. "Hanif betters Bradman – Magazine". ESPNcricinfo. Archived from the original on డిసెంబరు 29 2011. Retrieved ఆగస్టు 10 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  40. "Hanif and Javed inducted into ICC Cricket Hall of Fame". The Dawn. జనవరి 10 2009. Retrieved ఆగస్టు 10 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (help)
  41. Javed Miandad gets Pride of Performance award
  42. 42.0 42.1 "World cup Records – Most Runs". ESPNcricinfo. Archived from the original on డిసెంబరు 17 2015. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help).
  43. "Records – Test matches – Batting records – Youngest player to score a double hundred". ESPNcricinfo. Archived from the original on మార్చి 22 2018. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  44. "Records – One-Day Internationals – Batting records – Fifties in consecutive innings". ESPNcricinfo. Archived from the original on జూలై 3 2012. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  45. "Awards – Cricket". పాకిస్తాన్ Sports Board. Archived from the original on జూన్ 25 2012. Retrieved ఆగస్టు 13 2013. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  46. "Test Batting and Fielding Against Each Opponent by Javed Miandad". CricketArchive. Archived from the original on అక్టోబరు 20 2013. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)
  47. "ODI Batting and Fielding Against Each Opponent by Javed Miandad". CricketArchive. Archived from the original on అక్టోబరు 20 2013. Retrieved ఆగస్టు 12 2012. {{cite web}}: Check date values in: |accessdate= and |archive-date= (help)

బయటి లింకులు

[మార్చు]
అంతకు ముందువారు
ఆసిఫ్ ఇక్బాల్
పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్
1980–1981
తరువాత వారు
జహీర్ అబ్బాస్
అంతకు ముందువారు
ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్
1992
తరువాత వారు
సలీమ్‌ మాలిక్