జోనాథన్ ట్రాట్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇయాన్ జోనాథన్ లియొనార్డ్ ట్రాట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కేప్ టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | 1981 ఏప్రిల్ 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ట్రాటర్స్, బూగర్, లియోన్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Kenny Jackson (half-brother) Tom Dollery (grandfather-in-law) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 645) | 2009 ఆగస్టు 20 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 మే 1 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 211) | 2009 ఆగస్టు 27 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2013 సెప్టెంబరు 14 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 4 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 29) | 2007 జూన్ 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 ఫిబ్రవరి 20 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01 | బోలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001/02 | వెస్టర్న్ ప్రావిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003–2018 | వార్విక్‌షైర్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2018 సెప్టెంబరు 29 |
ఇయాన్ జోనాథన్ లియోనార్డ్ ట్రాట్ (జననం 1981 ఏప్రిల్ 22) దక్షిణాఫ్రికాలో జన్మించిన మాజీ ఇంగ్లాండ్ ప్రొఫెషనల్ క్రికెటరు. అతను ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. దేశీయంగా వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో ఆడాడు. 2011లో అతను, ICC, ECB క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [2]
ట్రాట్, కుడిచేతి వాటం ఎగువ వరుస బ్యాటరు, అప్పుడప్పుడు మీడియం-పేస్ బౌలరు. 2007లో అతను, ఇంగ్లండ్ తరపున రెండు ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2008, 2009లో కౌంటీల్లో చేసిన ప్రదర్శనలు, 2008-09లో ఇంగ్లండ్ లయన్స్‌తో పర్యటనలో సాధించిన విజయాలూ అతనికి ఐదవ యాషెస్ టెస్టు కోసం 2009 ఆగస్టులో సీనియర్ ఇంగ్లండ్ టెస్టు స్క్వాడ్‌లో స్థానం కల్పించాయి. అతను ఆ టెస్టులో సెంచరీ సాధించాడు. తొలి టెస్టు లోనే శతకం సాధించిన 18వ ఇంగ్లండ్ ఆటగాడతను. 18 నెలల తర్వాత, అతను MCG లో మరో సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్ గెలిచి ఇంగ్లండ్, యాషెస్‌ను నిలబెట్టుకుంది.టెస్టు మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 226, 2010 మే 28న లార్డ్స్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వచ్చింది. అందులోనే తన మొదటి టెస్టు వికెట్ కూడా తీసుకున్నాడు. అతను స్లిప్ లలో ఫీల్డింగ్ చేస్తాడు.
ఒత్తిడి, ఆందోళనల కారణంగా, ట్రాట్ అన్ని రకాల క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో 2013 నవంబరులో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ యాషెస్ పర్యటన నుండి నిష్క్రమించాడు. 2014 ఏప్రిల్లో పునరాగమన ప్రయత్నం చేసాడు గానీ మళ్ళీ పరిస్థితి తిరగబెట్టడంతో దాన్ని విరమించుకున్నాడు. ట్రాట్ 2015 వెస్టిండీస్ టెస్టు సిరీస్లో [3] ఇంగ్లాండ్ జట్టుకు తిరిగి వచ్చాడు.[4] కానీ సిరీస్‌లో కష్టపడ్డాడు. దాంతో అతను 2015 మే 4న అన్ని అంతర్జాతీయ క్రికెట్ పోటీల నుండి రిటైరయ్యాడు. 2018 మేలో, ఇంగ్లీషు దేశవాళీ క్రికెట్ సీజన్ ముగిసే సమయానికి ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ట్రాట్ ప్రకటించాడు. [5] 2022 జూలైలో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా ట్రాట్ ఎంపికయ్యాడు. [6]
జీవిత విశేషాలు
[మార్చు]ట్రాట్ కేప్ టౌన్‌లో ఇంగ్లీష్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా కుటుంబంలో జన్మించాడు. "అతని తాత లండన్‌లో జన్మించాడు. తన కాక్నీ యాసను అతను కోల్పోలేదు. 1995లో మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా నేతృత్వంలో అప్పుడప్పుడే ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జరుగుతున్న దక్షిణాఫ్రికాలో జరిగిన రగ్బీ ప్రపంచ కప్‌లో, ట్రాట్‌లు ఇంగ్లండ్‌కు మద్దతు ఇచ్చారు" అని క్రికెట్ మంత్లీ రాసింది. అతని తాత బ్రిటిష్ పౌరసత్వం కారణంగా ట్రాట్, పుట్టుక తోటే బ్రిటిష్ పాస్‌పోర్టుకు అర్హత పొందాడు. [7] స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయంలోని రోండెబోష్ బాలుర ఉన్నత పాఠశాలలో అతను చదువుకున్నాడు. స్టెల్లెన్‌బోష్‌లోని హెల్‌షూగ్టే మాన్‌స్కోషుయిస్‌లో నివసిస్తున్న అతను దక్షిణాఫ్రికా తరపున అండర్-15, అండర్-19 స్థాయిలో ఆడాడు. [8]
2009 ఏప్రిల్లో అతను, మాజీ వార్విక్‌షైర్ కెప్టెన్ టామ్ డోలెరీ మనవరాలు, వార్విక్‌షైర్ ప్రెస్ ఆఫీసరూ అయిన అబి డోలెరీని పెళ్ళి చేసుకున్నాడు. వారి కుమార్తె లిల్లీ 2010 అక్టోబరులో జన్మించింది.
అతని సవతి సోదరుడు, కెన్నీ జాక్సన్, నెదర్లాండ్స్, వెస్ట్రన్ ప్రావిన్స్‌కు క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. [8]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]తొలి ఎదుగుదల
[మార్చు]అతను U19 స్థాయిలో దక్షిణాఫ్రికా తరపున ఆడినప్పటికీ, అతని తాతలు ఆంగ్లేయులు కావడంతో ట్రాట్ ఇంగ్లాండ్ తరపున ఆడేందుకు అర్హత పొందాడు. 2007లో మంచి సీజన్ తర్వాత అతను 2007 జూన్లో వెస్టిండీస్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ జట్టు మార్క్సిస్టు సిద్ధాంతకర్త లియోన్ ట్రాట్స్కీ పేరు మీదట అతనికి లియోన్ అనే మారుపేరు వచ్చింది. ట్రాట్ చేతికి గాయం అయినప్పటికీ, వెస్టిండీస్‌తో జరిగిన రెండు ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. కానీ రెండంకెల స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. ఆ సిరీస్ 1-1తో ముగిసింది. [9]
2009 ఆగస్టు 4న, వార్విక్‌షైర్‌కు బలమైన కౌంటీ సీజన్‌లో అతను 97 కంటే ఎక్కువ సగటుతో ఉన్నాడు, హెడింగ్లీలో ఆస్ట్రేలియాతో నాల్గవ టెస్ట్‌లో 2009 యాషెస్ ఆడేందుకు ట్రాట్, 14 మంది యాషెస్ జట్టులో చేర్చబడ్డాడని ప్రకటించబడింది. ట్రాట్ ఆ మ్యాచ్‌లో ఆడలేదు గానీ ఓవల్‌లో జరిగే నిర్ణయాత్మక యాషెస్ టెస్టు కోసం జట్టులో రంగప్రవేశం చేశాడు. [10] [11] మొదటి ఇన్నింగ్స్‌లో ట్రాట్ పటిష్టంగా బ్యాటింగ్ చేసి, 41 పరుగుల తరువాత సైమన్ కాటిచ్ చేతిలో రనౌట్ అయ్యాడు. [12] రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేశాడు. రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన 18వ ఇంగ్లండ్ ఆటగాడతడు. 1993లో గ్రాహం థోర్ప్ తర్వాత ఆస్ట్రేలియాపై అలా చేసిన మొదటి ఆటగాడు. టెస్టు రంగప్రవేశంలో అత్యధిక స్కోరు చేసిన వార్విక్‌షైర్ బ్యాట్స్‌మన్. [13] ఇంగ్లండ్ ఆ టెస్టును, యాషెస్ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. [14] ఆ టెస్టు సిరీస్ తర్వాత, అతను ఎప్పుడూ సపోర్ట్ చేసే ఫుట్‌బాల్ టీం టోటెన్‌హామ్ హాట్‌స్‌పుర్, అతనికి అభినందనలు తెలుపుతూ హ్యారీ రెడ్‌నాప్ సంతకం చేసిన చొక్కాను అతనికి బహూకరించింది. [15]
ట్రాట్ వర్షంతో ప్రభావితమైన రెండు మ్యాచ్‌ల ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడాడు. వాతావరణం బాగోలేని కారణంగా నాలుగే బంతులు ఆడాడు.[16] అతన్ని వన్‌డే సిరీస్‌కు తీసుకోలేదు. వార్విక్‌షైర్‌కు తిరిగి వచ్చి, వోర్సెస్టర్‌షైర్‌పై 93 పరుగులు చేసాడు.[17] అయితే సెప్టెంబరు 11 న అతనికి ఇంగ్లాండ్‌తో "ఇన్క్రిమెంటల్ కాంట్రాక్టు" లభించింది. [18]
ట్రాట్ 2009/10 శీతాకాలపు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు.[19] అయితే, ఆ తరువాతి కాలంలో మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన జీవిత చరిత్రలో - మునుపటి సంవత్సరం ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో కలిసి ట్రాట్ సంబరాలు చేసుకోవడం చూసి నిరాశ చెందాను అని రాసాడు. [20] ట్రాట్ ఆ వాదనలను ఖండించాడు. కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అతనికి మద్దతు ఇచ్చాడు. వాన్ వ్యాఖ్యలతో ఇద్దరూ నిరాశ చెందారు. [21]
సెంచూరియన్ పార్క్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్‌లో, స్ట్రాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా పదోన్నతి పొందాడు. అతను 87 పరుగులు చేసాడు. పాల్ కాలింగ్‌వుడ్‌తో అతను గణనీయమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఇంగ్లండ్ ఆ గేమ్ గెలిచింది.
విజయాలు
[మార్చు]- యాషెస్ విజేత : 2009, 2010/11, 2013
- టెస్టు రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన 18వ ఇంగ్లీష్ క్రికెట్ ప్లేయర్ ( 5వ యాషెస్ టెస్ట్, 2009 ) [22]
- 332 టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు 8వ వికెట్ భాగస్వామ్యం ( 2010 లార్డ్స్‌లో స్టూవర్ట్ బ్రాడ్ v పాకిస్తాన్‌తో) [23]
- వివ్ రిచర్డ్స్, కెవిన్ పీటర్సన్‌లతో పాటు అత్యంత వేగంగా 1000 వన్డే ఇంటర్నేషనల్ పరుగులు (21 మ్యాచ్‌లు) సాధించిన ఆటగాళ్లలో ఉమ్మడిగా 1వ స్థానం
- విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2011
- శ్రీలంకపై 203 (మే 29, 2011) ఇంగ్లాండ్ బ్యాటర్లలో అత్యధిక స్కోరు
- 2011 సంవత్సరానికి గానూ ఇంగ్లండ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు
- 2011 సంవత్సరానికి ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
- ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా చేసిన అత్యధిక టెస్టు పరుగులు (2013 మార్చి 23)
మూలాలు
[మార్చు]- ↑ England's latest Ashes బ్యాటరు, Channel4, Retrieved on 19 August 2009
- ↑ "Trott named ECB's cricketer of the year". Cricinfo. 1 June 2011. Retrieved 29 July 2011.
- ↑ "Jonathan Trott: England batsman retires from international cricket". BBC Sport. 4 May 2015. Retrieved 4 May 2015.
- ↑ "Jonathan Trott: England recall Warwickshire batsman". BBC Sport (British Broadcasting Corporation). 18 March 2015. Retrieved 18 March 2015.
- ↑ "Jonathan Trott announces retirement plans". International Cricket Council. Retrieved 3 May 2018.
- ↑ "Jonathan Trott named Afghanistan's new head coach". ESPN Cricinfo. Retrieved 22 July 2022.
- ↑ "'You can't fully run away from where you come'". Cricinfo.
- ↑ 8.0 8.1 Luke, Will (August 2009). "Player Profile: Jonathan Trott". CricInfo. Retrieved 23 August 2009.
- ↑ "Trott fitness boost for England". BBC News. BBC. 27 June 2007. Retrieved 20 August 2009.
- ↑ Miller, Andrew (19 August 2009). "Ponting piles pressure onto Trott". CricInfo. Retrieved 20 August 2009.
- ↑ "England v Australia at the Oval, 5th Test, 2009". Archived from the original on 26 August 2009. Retrieved 4 January 2020.
- ↑ English, Peter (20 August 2009). "Trott stays calm during pressure debut". CricInfo. Retrieved 20 August 2009.
- ↑ Miller, Andrew (23 August 2009). "Trott buries Australia with debut ton". CricInfo. Retrieved 22 August 2009.
- ↑ "Victorious England regain Ashes". BBC News. BBC. 23 August 2009. Retrieved 23 August 2009.
- ↑ "Ashes hero Trott is also a diehard Hotspur fan!". 26 August 2009. Retrieved 4 January 2020.
- ↑ "Australia in England T20I Series – 1st T20I England v Australia". CricInfo. 30 August 2009. Retrieved 11 September 2009.
- ↑ Dobell, George (3 September 2009). "Trott produces a masterclass". CricInfo. Retrieved 11 September 2009.
- ↑ Brown, Alex (11 September 2009). "Harmison and Panesar lose contracts". CricInfo. Retrieved 11 September 2009.
- ↑ "Harmison and Bopara miss out". CricInfo. 8 October 2009. Retrieved 1 November 2009.
- ↑ "Jonathan Trott denies Vaughan 'party' claims". CricInfo. 31 October 2009. Retrieved 1 November 2009.
- ↑ "Andrew Strauss sure of Jonathan Trott's commitment". CricInfo. 31 October 2009. Retrieved 1 November 2009.
- ↑ "Records / Test matches / Batting records / Hundred on debut". Publisher. Retrieved 29 December 2010.
- ↑ "Records / Test matches / Partnership records / Highest partnership for the eighth wicket". Cricinfo. Retrieved 29 December 2010.