దర్జా
Jump to navigation
Jump to search
దర్జా | |
---|---|
దర్శకత్వం | సలీమ్ మాలిక్ |
స్క్రీన్ ప్లే | సలీమ్ మాలిక్ |
కథ | నజీర్ |
నిర్మాత | శివశంకర్ పైడిపాటి |
తారాగణం | సునీల్ అనసూయ ఆమని అక్సాఖాన్ |
ఛాయాగ్రహణం | దర్శన్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | రాప్ రాక్ షకీల్ |
నిర్మాణ సంస్థ | పీఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీs | 22 జూలై 2022(థియేటర్) 5 అక్టోబరు 2022 (ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దర్జా 2022లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా.[2] కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించాడు. సునీల్, అనసూయ, అక్సా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 22న విడుదలైంది.[3]
కథ
[మార్చు]కనకం (అనసూయ) బందరులో లేడి డాన్. ఆమె పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని చీప్ లిక్కర్ దందా సాగిస్తుంటుంది. బందరు పోర్టు కాంట్రాక్టు సొంతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఈ సమయంలో కనకానికి ఏసీపీ శివ శంకర్ పైడిపాటి (సునీల్) అడ్డు వస్తాడు. కనకం అరాచకాలను ఏసీపీ శివ శంకర్ అడ్డుకున్నాడా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- సునీల్[5]
- అనసూయ[6]
- ఆమని
- అక్సాఖాన్
- షఫీ
- ఛత్రపతి శేఖర్
- పృథ్వి
- షమ్ము
- అరుణ్ వర్మ (సత్తిపండు)
- శిరీష
- షకలక శంకర్
- మిర్చి హేమంత్
- ఛత్రపతి శేఖర్
- నాగ మహేష్
- షేకింగ్ శేషు
- జబర్దస్త్ నాగిరెడ్డి
- సమీర్
- రామ్ సర్కార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పీఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: శివశంకర్ పైడిపాటి
- కథ: నజీర్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్
- సంగీతం: రాప్ రాక్ షకీల్
- సినిమాటోగ్రఫీ: దర్శన్
- ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
- పాటలు: విష్ణు ఎర్రావుల, భాష్యశ్రీ
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (2 October 2022). "దసరా కానుకగా ఆ రెండు సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి". Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ Namasthe Telangana (7 February 2022). "యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దర్జా'". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Sakshi (18 July 2022). "ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే." Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ "సినిమా రివ్యూ: దర్జా" (in ఇంగ్లీష్). 22 July 2022. Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ Eenadu (22 October 2021). "కల్పిత కథతో 'దర్జా'". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Andhra Jyothy (6 February 2022). "అనసూయ 'దర్జా'" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.