నిసార్ (ఉపగ్రహం)
పేర్లు | నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ నిసార్ |
---|---|
మిషన్ రకం | రాడార్ ఇమేజింగ్ |
ఆపరేటర్ | నాసా / ఇస్రో |
వెబ్ సైట్ | |
మిషన్ వ్యవధి | 3 సంవత్సరాలు (ప్రణాళిక) [1][2] |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
అంతరిక్ష నౌక | నిసార్ |
బస్ | I-3K[3] |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 2,800 కి.గ్రా. (6,200 పౌ.) [4] |
శక్తి | 6,500 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 2024 (planned)[5][6] |
రాకెట్ | జిఎస్ఎల్వి ఎమ్‌కె2 (4 మీటర్ల ఫెయిరింగుతో) [3] |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | భూకేంద్రిత కక్ష్య[1] |
రెజిమ్ | సౌర సమన్వయ కక్ష్య[7] |
Perigee altitude | 747 కి.మీ. (464 మై.) |
Apogee altitude | 747 కి.మీ. (464 మై.) |
వాలు | 98.5° |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | S-band L-band |
Instruments | |
L-band (24-cm wavelength) Polarimetric Synthetic Aperture Radar S-band (12-cm wavelength) Polarimetric Synthetic Aperture Radar | |
నిసార్ లోగో |
నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చరు రాడార్ (NISAR) మిషన్ ద్వంద్వ-పౌనఃపున్యం కలిగిన సింథటిక్ ఎపర్చరు రాడార్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, దాన్ని భూ పరిశీలన ఉపగ్రహంపై ఉంచి అంతరిక్షం లోకి ప్రయోగించడానికీ నాసా ఇస్రోలు ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు. ద్వంద్వ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించే మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈ ఉపగ్రహం గుర్తింపు పొందుతుంది. ఇది రిమోట్ సెన్సింగ్ కోసం, భూమిపై సహజ ప్రక్రియలను గమనించడానికీ, అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, దాని ఎడమవైపు ఉండే సాధనాలు అంటార్కిటిక్ క్రయోస్పియర్‌ను అధ్యయనం చేస్తాయి. US$1.5 బిలియన్ల మొత్తం వ్యయమయ్యే నిసార్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూ పరిశీలక ఉపగ్రహం అవుతుంది. [8]
అవలోకనం
[మార్చు]నిసార్ ఉపగ్రహం, అధునాతనమైన రాడార్ ఇమేజింగ్‌ను ఉపయోగించి భూమి పైని నేల, మంచుల ఎత్తును 5 నుండి 10 మీటర్ల రిజల్యూషన్‌లో కొలుస్తుంది. నెలకు 4 నుండి 6 సార్లు ఇది కొలుస్తుంది. [9] పర్యావరణ వ్యవస్థ లోని అవాంతరాలు, మంచు పలకల పతనం, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం వంటి సహజ ప్రమాదాలతో సహా గ్రహపు అత్యంత సంక్లిష్టమైన సహజ ప్రక్రియలలో కొన్నింటిని పరిశీలించడానికి, కొలవడానికీ దీన్ని రూపొందించారు. [10] [11]
ఒప్పందం లోని నిబంధనల ప్రకారం, మిషన్ లోని L-బ్యాండ్ సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR), శాస్త్రీయ డేటా GPS రిసీవర్‌ల కోసం అధిక-రేటు టెలికమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్, సాలిడ్-స్టేట్ రికార్డర్, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్‌లను నాసా అందిస్తుంది. ఇస్రో, శాటిలైట్ బస్, ఎస్-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్, వాహక నౌక, అనుబంధ ప్రయోగ సేవలను అందిస్తుంది. [12]
నిసార్ నుండి డేటా అంతా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మామూలు రోజుల్లో 1 నుండి 2 రోజుల తర్వాత ఈ డేటా అందుబాటు లోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితుల్లో గంటల వ్యవధిలోనే అందిస్తారు. [13]
ఉపగ్రహం మూడు-అక్షాల స్థిరీకరణలో ఉంటుంది. ఇది 12 మీ. (39 అ.) మెష్ యాంటెన్నాను ఉపయోగిస్తుంది. L- S- మైక్రోవేవ్ బ్యాండ్‌లు రెండింటిలోనూ ఇది పనిచేస్తుంది. [14] ఎపర్చరు మెష్ రిఫ్లెక్టర్ (యాంటెన్నా)ని నార్త్‌రోప్ గ్రుమ్మాన్ కు చెందిన ఆస్ట్రో ఏరోస్పేస్ సంస్థ సరఫరా చేస్తుంది. [15]
ఈ ఉపగ్రహాన్ని 2024లో భారతదేశం నుండి GSLV Mk II ద్వారా ప్రయోగిస్తారు. ఇది సూర్య-సమవర్తన కక్ష్యలో పరిభ్రమిస్తుంది. మిషన్ జీవితకాల అంచనా మూడు సంవత్సరాలు. ప్రాజెక్ట్ డిజైన్ ధ్రువీకరణ దశలో మొదటి అంగను దాటింది. నాసా దీన్ని సమీక్షించి, ఆమోదించింది. [16]
ప్రాజెక్టు వ్యయంలో ఇస్రో వాటా సుమారు ₹788 crore (US$99 million) కాగా, నాసా వాటా సుమారు US$808 మిలియన్లు. [17] [18]
పేలోడ్
[మార్చు]- L-బ్యాండ్ (1.25 GHz ; 24 సెం.మీ తరంగదైర్ఘ్యం) పోలారిమెట్రిక్ SAR. నాసా తయారు చేస్తుంది.
- S-బ్యాండ్ (3.20 GHz; 9.3 సెం.మీ తరంగదైర్ఘ్యం) SAR, ఇస్రో తయారు చేస్తుంది. [19]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భూమి పరిశీలన ఉపగ్రహం
- భారతీయ రిమోట్ సెన్సింగ్
- భారతీయ ఉపగ్రహాల జాబితా
- సీసాట్
- షటిల్ రాడార్ టోపోగ్రఫీ మిషన్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Satellite: NISAR". World Meteorological Organization (WMO). 4 January 2020. Retrieved 16 March 2021.
- ↑ "Optimization of Debris Shields on the NISAR Mission's L-Band Radar Instrument" (PDF). conference.sdo.esoc.esa.int. ESA Space Debris Office. 18–21 April 2017. Retrieved 16 March 2021.
{{cite web}}
: CS1 maint: date format (link) - ↑ 3.0 3.1 "Overview of NISAR Mission and Airborne L- and S- SAR" (PDF). sac.gov.in. Space Applications Centre, ISRO. August 2018. Retrieved 16 March 2021.
- ↑ Neeck, Steven. "The NASA Earth Science Program and Small Satellites" (PDF). dlr.de. DLR. Archived from the original (PDF) on 23 నవంబరు 2018. Retrieved 23 November 2018.
- ↑ Desai, Nilesh. "Joint ISRO-IMD Report on updates and Future Plans". Retrieved 25 June 2022.
- ↑ "CEOS EO Handbook – Mission Summary - NISAR". ISRO. Retrieved 24 June 2022.
- ↑ "NISAR Mission". ISRO. 19–20 November 2015. Archived from the original on 4 ఆగస్టు 2020. Retrieved 16 March 2021.
{{cite web}}
: CS1 maint: date format (link) - ↑ "NASA, ISRO jointly working on project NISAR" (Press release). SAR Journal. 26 May 2017. Retrieved 16 March 2021.
- ↑ "Landslide Hazards to Infrastructure" (PDF). nisar.jpl.nasa.gov. NASA (JPL). 2017. Archived from the original (PDF) on 21 March 2019. Retrieved 16 March 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ "NASA-ISRO SAR Mission (NISAR)". Jet Propulsion Laboratory. Retrieved 16 March 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ "NASA-ISRO SAR (NISAR) Mission Science Users' Handbook" (PDF). NASA. Retrieved 27 May 2021.
- ↑ "U.S., India to Collaborate on Mars Exploration, Earth-Observing Mission". NASA. 30 September 2014. Retrieved 16 March 2021.
- ↑ "Landslide Hazards to Infrastructure" (PDF). nisar.jpl.nasa.gov. NASA (JPL). 2017. Archived from the original (PDF) on 21 March 2019. Retrieved 16 March 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ "NASA-ISRO SAR Mission (NISAR)". Jet Propulsion Laboratory. Retrieved 16 March 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ White, AnnaMaria (30 October 2015). "NASA Jet Propulsion Laboratory Selects Northrop Grumman's Astro Aerospace for NISAR Reflector" (Press release). Northrop Grumman Corporation. Retrieved 16 March 2021.
- ↑ "ISRO's instrument design passes Nasa review". The Times of India. 31 July 2014. Retrieved 16 March 2021.
- ↑ "Rajya Sabha Q. No.2223, Session:243 "JOINT PROJECT BETWEEN NASA AND ISRO"" (PDF). Department of Space. 3 August 2017. Archived from the original (PDF) on 3 August 2017. Retrieved 16 March 2021.
- ↑ "Joint Project between NASA and ISRO". Press Information Bureau, Government of India. 3 August 2017. Retrieved 16 March 2021.
- ↑ "ISRO's instrument design passes Nasa review". The Times of India. 31 July 2014. Retrieved 16 March 2021.