పెదపాలెం (పొన్నూరు మండలం)
పెదపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′56″N 80°28′14″E / 16.048865°N 80.470498°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పొన్నూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి వల్లభాపురపు శివపార్వతి |
పిన్ కోడ్ | 522112 |
ఎస్.టి.డి కోడ్ | 08643 |
పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు.
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ.
గ్రామ విశేషాలు
[మార్చు]గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియోజకవర్గాలలో ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
- పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
- ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,500. ఓటర్లు=1,850.