పెనం
Jump to navigation
Jump to search
పెనం (ఆంగ్లం frying pan, frypan, or skillet) ఒక విధమైన వంటపాత్ర. వీనిలో చపాతీ, రొట్టె, దోసెలు, ఆమ్లెట్లు, అట్లు వేసుకుంటారు. కొన్ని రకాల వేపుడు కూరలు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి మూత వుండదు.
సాంప్రదాయకంగా పెద్ద పెనాలు పోత ఇనుము (cast iron) తో తయారుచేస్తారు. అయితే మనం ఇంటిలో ఉపయోగించే పెనాలు అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీలుతో తయారుచేస్తారు. కొన్నింటికి లోపలి తలంలో టెఫ్లాన్ (Teflon) పూత వేస్తున్నారు. దీని మూలంగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరికొన్నింటికి అడుగు భాగంలో రాగి పూత వేస్తున్నారు. దీని మూలంగా పాత్ర తొందరగా వేడెక్కుతుంది.
- పెనం మీద నుండి పొయ్యి లోకి - సామెత.సామెతకు వివరణ: పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది. అనగా ఒకడు పెనంమీద పడ్డానని బాదపడుతుంటే..... అక్కడినుండి పొయ్యిలోకె పడ్డాడట. అనగా ఒక చిన్న కష్టంలో నుండి పెద్ద కష్టంలోకి వెళ్ళడమన్నమాట.