Jump to content

పెళ్ళి చూపులు (2016 సినిమా)

వికీపీడియా నుండి
పెళ్ళి చూపులు
దర్శకత్వంతరుణ్ భాస్కర్ దాస్యం
స్క్రీన్ ప్లేతరుణ్ భాస్కర్ దాస్యం
కథతరుణ్ భాస్కర్ దాస్యం
నిర్మాత
  • రాజ్ కందుకూరి
  • యశ్ రంగినేని[1]
తారాగణం
ఛాయాగ్రహణంనగేష్ బనేల్
కూర్పురవితేజ గిరిజాల
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థ
బిగ్ బెన్ సినిమాస్ (లండన్) & ధర్మపథ్ క్రియేషన్స్
పంపిణీదార్లు
విడుదల తేదీ
29 జూలై 2016 (2016-07-29)
సినిమా నిడివి
124 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్75 lakh (equivalent to 92 lakh or US$1,10,000 in 2020)
బాక్సాఫీసుఅంచనా 50 crore (equivalent to 61 crore or US$7.6 million in 2020)

పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండరీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు.

ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.[2][3]

ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటిగా రెండు నంది పురస్కారాలు సాధించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా దక్షిణాది ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. హిందీ, తమిళం, మలయాళం భాషల్లోకి పునర్నిర్మాణమైంది.

కథాంశం

[మార్చు]

ప్రధాన పాత్రలైన ప్రశాంత్ (విజయ్ దేవరకొండ), చిత్ర (రీతు వర్మ) పెళ్ళిచూపుల్లో కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రశాంత్ ఇంజనీరింగ్ చదువుకున్నా బద్ధకంతోనూ, జీవితంలో ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతోనూ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటాడు. షెఫ్ (chef)గా కెరీర్ ప్రారంభించి ఓ రెస్టారెంట్ ప్రారంభించాలన్నది అతని కల. చిత్ర చాలా స్పష్టత ఉన్న అమ్మాయి, జీవితంలో ఏం సాధించాలన్న దానిపై సుస్పష్టమైన దృష్టితో తన కలలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఐతే ఆమె ఓ అబ్బాయితో ప్రేమలో పడి, అతనితో కలిసి రెస్టారెంట్ ఆన్ వీల్స్ (ఫుడ్ ట్రక్) ప్రారంభించి తన కల నెరవేర్చుకుందామని ఆశిస్తుంది. కానీ అతను ఆమెను విడిచిపెట్టేసి, వేరే సంబంధానికి ఒప్పుకోవడంతో చిత్ర తండ్రి ఆమెను సీరియస్ గా తీసుకోవడం మానేస్తాడు. పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఆమెకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి తగ్గ డబ్బు తానే సంపాదించుకోవాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్, చిత్ర పెళ్ళి చేసుకున్నారా? వారి ఆశలు, కలలు ఏమయ్యాయి అన్నది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

విడుదల

[మార్చు]

29 జూలై 2016న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

[మార్చు]

చిత్రంలో ఆరుపాటలూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ స్వరపరచగా, రాహుల్ రామకృష్ణ, శ్రేష్ట, శ్రీ పాటలు రాశారు. మధురా ఆడియో ద్వారా సంగీతం విడుదలైంది.

  • ఈ బాబు గారికి , రచన: రాహుల్ రామకృష్ణన్, గానం. సూరజ్ సంతోష్
  • చినుకు తాకే , రచన: శ్రేష్ఠ, గానం. అమృత వర్షిణి
  • రాలు పూల రాగ మాల , రచన: రాహూల్ రామకృష్ణన్,శ్రీ , గానం. విల్సన్ హెరాల్డ్
  • మెరిసే మెరిసే, రచన: శ్రేష్ఠ, గానం. హరిచరన్ , ప్రణవి, ఆచార్య
  • ఆనందం
  • స్పిట్ ఫైర్ ఫ్రెండ్స్ రచన: నిఖిల్ భరద్వాజ్, గానం. నిఖిల్ భరద్వాజ్

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2016 సైమా అవార్డులు

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ హాస్యనటుడు (ప్రియదర్శి)

మూలాలు

[మార్చు]
  1. "D.Suresh babu presents "Pelli Choopulu" Releasing on July 29th". Idlebrain.com. 17 July 2016. Retrieved 25 October 2016.
  2. ""'Marriage Gaze' review: A Refreshing and realistic love story"". Archived from the original on 2016-10-01. Retrieved 2016-08-29.
  3. "Pelli Choopulu: A gem of a film"