పైగా ప్యాలెస్
పైగా ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
చిరునామా | బేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రస్తుత వినియోగదారులు | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ |
పూర్తి చేయబడినది | 1900 |
పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.[1] ఇక్కడ స్పానిష్ మసీదు కూడా ఉంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
[మార్చు]మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన నవాబ్ వికారుల్ ఉమ్రా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.[2]
నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత 2008 అక్టోబరు 24 నుండి హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయించారు. 2023లో ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో కొత్తగా యూఎస్ కాన్సులేట్ భవనం నిర్మాణం చేసి, కార్యాలయం అక్కడికి మార్చబడింది. దాంతో ఇది శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది. 2023లో ఈ భవనాన్ని హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ తిరిగి స్వాధీనం చేసుకొని, దాని నిర్వహణను పర్యవేక్షిస్తున్నది.
నిర్మాణం
[మార్చు]దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.[3]
తెలంగాణ మ్యూజియంగా
[మార్చు]5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం కోర్ సిటీలో ఎంతో విశాలంగా ఉన్న ఈ పైగా ప్యాలెస్‌ను అత్యంత కీలకమైన సేవలను అందించేందుకు వినియోగించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, దీనిని తెలంగాణ మ్యూజియంగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, జందగీ వార్తలు (24 May 2018). "పైగా ప్యాలెస్". Archived from the original on 1 మే 2019. Retrieved 1 May 2019.
- ↑ Telangana Today, SundayScape-Telangana Diaries (12 November 2017). "A palace straight out of a storybook". Kota Saumya. Archived from the original on 1 May 2019. Retrieved 1 May 2019.
- ↑ పైగా ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 74
- ↑ telugu, NT News (2023-08-07). "Paigah palace | తెలంగాణ మ్యూజియంగా.. పైగా ప్యాలెస్". www.ntnews.com. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-12.