సింహబలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాటల జాబితా చేర్చాను
చి వర్గం:కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 46: పంక్తి 46:


[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు]]

17:17, 21 మే 2019 నాటి కూర్పు

సింహబలుడు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ తిరుపతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు.[1] ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు.[2]

కథ

రాజుగా పిలువబడే రాజేంద్రుడు(ఎన్టీయార్) రాజుల దురాగతాలను, అన్యాయాలను సహించడు. రఘునాథరాయలు (కైకాల సత్యనారాయణ) వంశపారంపర్యంగా మహారాజు గారి దగ్గర పనిచేస్తుంటాడు. పదవీవిరమణ సమయంలో అతని మంచితనాన్ని గుర్తించి అతనిని ముఖ్య న్యాయాధిపతిగా నియమిస్తారు. అతని స్థానంలో గజపతివర్మ (మోహన్ బాబు)ను సేనాపతిగా నియమిస్తాడు. గజపతివర్మ రాజును మోసంచేస్తూ దురాగతాలు చేస్తుంటాడు. యువరాణి వాణి (వాణిశ్రీ) మారువేషముతో కోటనుండి బయటకు వస్తుంది. గాజును అతను చేసే మంచిపనులను గుర్తించి ప్రేమిస్తుంది. రాజుగారు నిర్ణయించిన పోటీలలో రాజు, గజపతివర్మను ఓడించి, సింహబలుడుగా బిరుదు పొందుతాడు. ఆ సమయంలో రఘునాథరాయలు చిన్నప్పుడు ఇంటినుండి వెళ్ళిపోయిన రాజేంద్రే, రాజు అని గుర్తిస్తాడు. గజపతి, రాజుమీద కోపంతో అతనితో కలిసి ఉంటున్న చెల్లిని, తాతను చంపి ఇంటికి నిప్పుపెడతాడు. ఆ సమయంలోనే వాణియే యువరాణి అని తెలుసుకుంటాడు. రాజును బంధించి బానిసగా నిర్భందిస్తారు. యువరాణి సహాయంతో తప్పించుకుని, మిగతా బానిసలను కూడా తప్పిస్తాడు. వారందితో కలిసి గజపతిని మట్టుపెట్టి, రాజు కళ్లు తెరిపించి యువరాణిని వివాహమాడతాడు.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

పాటలు

  • ఏందమ్మో చురుక్కుమంది (4.21 ని.)
  • చూపులతో ఉరకలేసి సోకులతో తడిపేసి (4.13 ని.)
  • సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (4.23 ని)
  • ఓ చెలి చలి చలి (5.18 ని.)
  • ఈ గంట ఘనఘన మోగాలి (5.37 ని.)

మూలాలు

  1. ఇట్స్ ఓకే. "యన్.టి.ఆర్ 'సింహబలుడు"తో చెతుర్లు కాదు". www.itzok.in. Retrieved 26 July 2017.
  2. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18". telugu.greatandhra.com. Retrieved 10 August 2017.