వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: arc:ܟܘܪܗܢܐ
చి యంత్రము కలుపుతున్నది: be:Хвароба
పంక్తి 28: పంక్తి 28:
[[az:Xəstəlik]]
[[az:Xəstəlik]]
[[bat-smg:Lėga]]
[[bat-smg:Lėga]]
[[be:Хвароба]]
[[bg:Болест]]
[[bg:Болест]]
[[bm:Banaw]]
[[bm:Banaw]]

15:29, 17 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగము (Disease) అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది.

వ్యాధి కారణాలు

చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైనవి అంతర్గత కారణాలు. పోషకాహార లోపాలు, వాతావరణంలోని కారకాలు మరియు వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.

వ్యాధి కారకాలను సంఘ, మానసిక, రసాయన మరియు జీవ కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.

వ్యాధుల వ్యాప్తి

ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా,ఫంగస్ మరియు ఇతర పరాన్న జీవుల (parasites) వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర,మరియు పొట్టపురుగులు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ(touch) వలన, సెక్స్ ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.

వ్యాధుల నివారణ

కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటి నుండి మనల్ని రక్షించుకోవచ్చును. దీనినే వ్యాధి నివారణ (Disease Prevention) అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం (Treatment) చేసుకోవడం కన్నా ఇది చాలా విధాలుగా ఉత్తమమైన పద్ధతి.

"https://te.wikipedia.org/w/index.php?title=వ్యాధి&oldid=490872" నుండి వెలికితీశారు