వేదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
==కథ==
==కథ==
డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు అనుకునే వాడు ఒకడు......
డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు అనుకునే వాడు ఒకడు......

సమాజం కంటే సంగీతం, అంతకు మించి కెరీర్ ముఖ్యమనుకునే వాడు ఇంకొకడు.....
సమాజం కంటే సంగీతం, అంతకు మించి కెరీర్ ముఖ్యమనుకునే వాడు ఇంకొకడు.....

చేస్తున్నది తప్పని తెలియక సొంతంగా కంపెనీ పెట్టి వ్యభిచారం చేయాలనుకునే వేశ్య మరొకరు.....
చేస్తున్నది తప్పని తెలియక సొంతంగా కంపెనీ పెట్టి వ్యభిచారం చేయాలనుకునే వేశ్య మరొకరు.....

లౌకిక దేశంలో మతం మత్తుకి తట్టుకోలెక దేశమె వదికలేద్దామనుకునే ముస్లిం ఒకరు.......
లౌకిక దేశంలో మతం మత్తుకి తట్టుకోలెక దేశమె వదికలేద్దామనుకునే ముస్లిం ఒకరు.......

బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి ఇంకొకరు.......
బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి ఇంకొకరు.......

ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు మరొకదు......
ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు మరొకదు......

ఈ పాత్రల మానసిక సంఘర్షణల వెండితెర చిత్రణే..... వేదం.
ఈ పాత్రల మానసిక సంఘర్షణల వెండితెర చిత్రణే..... వేదం.

మార్పు సమయంలొ మనిషి ఎదుర్కొనే మానసిక సంఘర్షణల సమాహారమే..... వేదం.
మార్పు సమయంలొ మనిషి ఎదుర్కొనే మానసిక సంఘర్షణల సమాహారమే..... వేదం.

07:36, 9 నవంబరు 2010 నాటి కూర్పు

వేదం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం క్రిష్
నిర్మాణం దేవినేని ప్రసాద్,
యార్లగడ్డ శోభు
తారాగణం అల్లు అర్జున్,
మంచు మనోజ్ కుమార్,
అనుష్క,
సంగీతం కీరవాణి
నిర్మాణ సంస్థ ARCA
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు అనుకునే వాడు ఒకడు......

సమాజం కంటే సంగీతం, అంతకు మించి కెరీర్ ముఖ్యమనుకునే వాడు ఇంకొకడు.....

చేస్తున్నది తప్పని తెలియక సొంతంగా కంపెనీ పెట్టి వ్యభిచారం చేయాలనుకునే వేశ్య మరొకరు.....

లౌకిక దేశంలో మతం మత్తుకి తట్టుకోలెక దేశమె వదికలేద్దామనుకునే ముస్లిం ఒకరు.......

బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి ఇంకొకరు.......

ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు మరొకదు......

ఈ పాత్రల మానసిక సంఘర్షణల వెండితెర చిత్రణే..... వేదం.

మార్పు సమయంలొ మనిషి ఎదుర్కొనే మానసిక సంఘర్షణల సమాహారమే..... వేదం.

చక్రవర్తి (మంచు మనోజ్ కుమార్) బెంగళూరు ఒక ధనిక సైనిక కుటుంబానికి చెందిన యువకుడు. యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్న చక్రవర్తికి సైన్యంలో చేరటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కాని తన తల్లి సైన్యం లో చేరమని బలవంత పెడుతూ ఉంటుంది. చక్రవర్తికి రాక్ స్టార్ కావాలనే కోరిక ఉంటుంది. చాలా అభ్యాసం తర్వాత హైదరాబాదు లో ఒక ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరుకుతుంది. మరుసటి రోజు ప్రొద్దుటే తన సహ గాయకులతో విమానంలో హైదరాబాదు చేరాలి. "నీ గురించి అడిగిన వారికి ఏమని చెప్పను?" అన్న తన తల్లి ప్రశ్నకి "నా గురించి వారికి నువ్వు గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుంది అమ్మా!" అని సమాధానమిస్తాడు.

సిరిసిల్ల గ్రామంలో రాములు అనే వృద్ధుడు చేనేత కార్మికుడు. కొడుకు పోవటంతో కోడలు పద్మ తో సహా నేత పనిని చేస్తూ తెలివిగల, చదువంటే ఆసక్తి గల మనవడిని పాఠశాలలో చదివిస్తూ ఉంటాడు. పటేల్ వద్ద రూ.50,000/- అప్పు తీసుకొనటం మూలాన అప్పు తీర్చమని బాధిస్తూ ఉంటాడు పటేల్. అడిగిన సమయానికి అప్పు తీర్చలేదని, మనవడిని వెట్టి చాకిరీకి తీసుకెళతాడు పటేల్.

అమలాపురం లో సరోజ (అనుష్క) ఒక వేశ్య. తన యజమానురాలు సరిగా డబ్బు ఇవ్వటం లేదని భావించిన సరోజ హైదరాబాద్ వెళ్ళిపోయి సొంత వేశ్యా గృహం స్థాపించాలని కలలు కంటూ ఉంటుంది.

రహీముల్లా ఖురేషీ (మనోజ్ బాజ్ పాయి) పాత బస్తీలో వినాయక నిమజ్జనంలో జరిగిన అల్లర్ల వల్ల గర్భంలో తన భార్య మోస్తున్న కవల పిల్లలను పోగొట్టుకొంటాడు. పోలీసులు న్యాయం చేయక పోగా తనే ఒక తీవ్రవాది అనే ముద్ర వేసి నిత్యం అవమాన పరుస్తుంటారు. ప్రశాంతంగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో షార్జా వెళ్ళటానికి వీజా సంపాదిస్తాడు ఖురేషీ.

జుబిలీ హిల్స్ బస్తీలో కేబుల్ ఆపరేటర్ కేబుల్ రాజు (అల్లు అర్జున్). పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే చదువుకొన్న యువకుడు. డబ్బు సొంతమవాలనే అత్యాశతో ఓ గొప్పింటి అమ్మాయి (దీక్షా సేఠ్) ని ప్రేమలో పడేస్తాడు. ఒక హోటల్ లో జరిగే నూతన సంవత్సర వేడుకలో తన తల్లికి అతడిని పరిచయం చేస్తానని, వాటికి పాస్ లని తెప్పించమని రాజుని కోరుతుంది. వాటి ఖరీదు రూ. 40,000/- అవ్వటంతో ఆ డబ్బుని ఎలా సంపాదించాలో ఆలోచనలో పడతాడు.

చక్రవర్తి తన ప్రదర్శనని హైదరాబాదులో ఇచ్చాడా? రాములు రూ.50,000/- ని ఎలా పుట్టించాడు? హైదరాబాద్ వెళ్ళిన సరోజ ఎటువంటి పరిస్థితులని ఎదుర్కోవలసి వచ్చింది? రహీముల్లా ఖురేషీ షార్జా వెళ్ళాడా? కేబుల్ రాజు రూ. 40,000/- ఎక్కడి నుండి తెచ్చాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే సినిమాలోని మిగతా ఇతివృత్తం.

విశేషాలు

  • సైన్యం లో చేరకపోయినా రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని ఉన్న ఒక నిండు చూలాలిని రక్షించే ప్రయత్నంలో తనకి వచ్చిన అరుదైన అవకాశాన్ని ఒదులుకొని చుట్టూ ఉన్న జనాలని కాపాడి తన ప్రాణాలు కోల్పోయే చక్రవర్తి పాత్ర.
  • రాములు పాత్రకి ఎంచుకోబడ్డ నాగయ్య. నెరిసిన జుట్టు, మాసిన గడ్డం, ముతక లాల్చీ ధోవతులు. దైన్యాన్ని ప్రతిబింబించే స్వరం. అప్పుల బాధతో బ్రతుకు ఛిద్రమైన చేనేత కార్మికునికి నిలువెత్తు రూపం.
  • ఆసుపత్రి లో రాములు ని రాజు మోసం చేసి డబ్బులని బలవంతంగా లాక్కెళ్ళిపోయే దృశ్యం. ఒక వైపు ఎలాగైనా పాస్ లకు డబ్బు సంపాదించి ప్రేయసిని పొందాలనే పట్టుదల, మరొక వైపు రాములు చేసే అతి దయనీయమైన ఆర్తనాదాలకు జాలి కలిగి కరిగిపోయే పరిస్థితులు. ఆ పెనుగులాటలో రాజు వ్యక్త పరచే హావభావాలు.
  • జనాన్ని రక్షించే ప్రయత్నంలో చక్రవర్తితో బాటు చావు బ్రతుకుల్లో ఉన్న రాజు, "హోడెమ్మా జీవితం, బ్రదరూ నీ పేరేంటి?" అని అడగటం
  • తనని అనుమానించే పోలీసులనే ముస్లిం తీవ్రవాదుల నుండి ఖురాన్ ని అడ్డం పెట్టి రక్షించే ఖురేషీ పాత్ర.

సంభాషణలు

  • తనలో పాట హృదయాంతరాలలో నుండి కాకుండా పెదవుల పై నుండి మాత్రమే వస్తుంది అని చక్రవర్తికి తన ప్రేయసి చెప్పే సంభాషణ: A song is a lyric told musically (పాట అంటే సంగీత పరంగా చెప్పబడే గీతం).
  • లంచాలకి అలవాటు పడ్డ పోలీసు అధికారిని సరోజ ప్రశ్నించే సమయంలో చెప్పే సంభాషణ: "మేం బట్టలు విప్పి అమ్ముడు పోతాం, మీరు బట్టలు వేసుకొని అమ్ముడు పోతారు!"
  • దొంగ తనాలకి పాల్పడుతున్న రాజు కి భంగ్ కాలుస్తున్న ఒక స్వామీజీ (క్రిష్) "మనిషి దొంగ నోట్లను చేస్తే నోటు మనిషిని దొంగ చేస్తుంది. గొప్పదనం అన్నది డబ్బులో కాదు నాయనా, హృదయంలో ఉంటుంది" అని చెప్పటం, దానికి రాజు, "పెరుగువడలో పెరుగు ఉంటుంది, కానీ పులిహోరలో పులి ఉండదు. అది కాలిస్తే ఇటువంటివి నేను కూడా ఇంకో నాలుగు మాటలు చెప్తా!" అని బదులివ్వటం.

సమాచార మూలాలు

  • ఐడిల్ బ్రెయిన్ లో ఈ చిత్రం గురించి [1]