కోనమనేని అమరేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతీయ మహిళా న్యాయమూర్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 12: పంక్తి 12:
[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:2009 మరణాలు]]
[[వర్గం:2009 మరణాలు]]
[[వర్గం:భారతీయ మహిళా న్యాయమూర్తులు]]

11:04, 27 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అమరేశ్వరి భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి. గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో 1928 జులై 10వ తేదీన జన్మించింది. 14వ ఏటనే పెండ్లి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న్యాయశాస్త్రములో కూడా పట్టా పొంది మద్రాసు ఉన్నత న్యాయస్థానములో న్యాయవాదిగా పనిచేశారు. 1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానములో ఏప్రిల్ 29, 1978లో న్యాయమూర్తిగా నియమింపబడి దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందింది. పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి 1990 సం లో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు[1].

భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా మరియు ఆంధ్ర ఉన్నత న్యాయస్థానము లోని న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా (1975-1976) పనిచేశారు.

అమరేశ్వరి జులై 25, 2009న కొత్త ఢిల్లీ లో మరణించింది[2].

మూలాలు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమలా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పుట. 19
  2. http://www.hindu.com/2009/07/26/stories/2009072653710400.htm