తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: en:T. Lakshmi Kantamma
పంక్తి 17: పంక్తి 17:
[[వర్గం:4వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:4వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:5వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:5వ లోకసభ సభ్యులు]]

[[en:T. Lakshmi Kantamma]]

09:02, 28 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత ఆమె మనవరాలే.[1] లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జన్మించింది. ఈమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిక శాస్త్రములో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.

లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందింది.[2]

పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా[3] ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి,[4] పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నది.[5] ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.

లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితురాలు.[1] నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ది ఇన్‌సైడర్‌లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.[6]

లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో విజయవాడలోని తన కూతురు ఇంట్లో డిసెంబర్ 13, 2007న మరణించింది.[7]

మూలాలు

  1. 1.0 1.1 http://thatstelugu.oneindia.mobi/news/2007/12/13/1660.html
  2. తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286
  3. Report By India Parliament. Lok Sabha. Committee on Petitions, India, [1]
  4. Encyclopaedia of Political Parties By Ralhan, O. P.[2]
  5. మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ కన్నుమూత - యాహూ తెలుగు వార్త
  6. http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980420/11050834.html
  7. హిందూ పత్రికలో లక్ష్మీకాంతమ్మ మరణవార్త