ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°24′36″N 78°27′36″E మార్చు
పటం

హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1967 బి.వి.గురుమూర్తి కాంగ్రెస్ పార్టీ ఎస్.శంకరయ్య ఇండిపెండెంట్
1972 ఎన్.కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఇ.వి.పద్మనాభన్
1978 పి.జనార్ధనరెడ్డి[1] కాంగ్రెస్ పార్టీ ఆలె నరేంద్ర జనతా పార్టీ
1983 మాధవరం రామచంద్ర రావు తెలుగుదేశం పి.జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 పి.జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.మోహన్ రెడ్డి తెలుగుదేశం
1989 పి.జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.నారాయణ స్వామి తెలుగుదేశం
1994 పి.జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.విజయ్ కుమార్ తెలుగుదేశం
1999 కె.విజయరామారావు తెలుగుదేశం పి.జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 పి.జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.విజయరామారావు తెలుగుదేశం
2008 పి.విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.శ్రీనివాస్ రావు లోక్‌సత్తా
2009 దానం నాగేందర్‌ కాంగ్రెస్ పార్టీ కె.విజయరామారావు తెలుగుదేశం
2014 చింతల రామచంద్రరెడ్డి బి.జె.పి దానం నాగేందర్‌ కాంగ్రెస్ పార్టీ
2018 దానం నాగేందర్‌ టిఆర్ఎస్[2] చింతల రామచంద్రరెడ్డి బి.జె.పి
2023[3] దానం నాగేందర్‌ బీఆర్ఎస్ పి. విజయా రెడ్డి కాంగ్రెస్

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.

2008 ఉప ఎన్నికలు

[మార్చు]

పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప లోక్‌సత్తా పార్టీకి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు.[4] విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందాడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
  • పి.జనార్థన్ రెడ్డి:ఖైరతాబాదు నియోజకవర్గంలో పి.జనార్థన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచాడు. మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీలో ప్రముఖ స్థానం పొందినాడు. 1978లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టగా, 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఓడిపోయాడు. ఆ తరువాత 1985, 1989, 1994లలో వరుసగా 3 సార్లు విజయం సాధించాడు. 1999లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయరామారావు చేతిలో ఒడిపోగా, 2004లో విజయరామారావును ఓడించి మళ్ళీ తన స్థానాన్ని చేజిక్కించుకొని మరణించే వరకు నియోజకవర్గానికి తన సేవలందించాడు. 2008లో ఉపఎన్నిక జరిగిన ఈ స్థానం నుంచి ఇతని కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి విజయం పొందినాడు.

శాసనసభ ఎన్నికల ఫలితాలు 2018

[మార్చు]
[5]
2018: ఖైరతాబాద్
Party Candidate Votes % ±%
తెలంగాణ రాష్ట్ర సమితి దానం నాగేందర్ 63,068 45.0%
భారతీయ జనతా పార్టీ చింతల రామచంద్రరెడ్డి 34,666 24.7%
భారత జాతీయ కాంగ్రెస్ దాసోజు శ్రవణ్ కుమార్ 33,549 23.9%
మెజారిటీ 28,402 20.3%
మొత్తం పోలైన ఓట్లు 1,40,150 53.3%
తెలంగాణ రాష్ట్ర సమితి gain from భారతీయ జనతా పార్టీ Swing

మూలాలు

[మార్చు]
  1. Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. ఈనాడు దినపత్రిక, తేది జూన్ 2, 2008
  5. Khairatabad Results 2018

వెలుపలి లంకెలు

[మార్చు]