ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6059178 (translate me)
పంక్తి 25: పంక్తి 25:
[[వర్గం:2002 మరణాలు]]
[[వర్గం:2002 మరణాలు]]
[[వర్గం:రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు]]

[[en:Inturi Venkateswara Rao]]

20:35, 9 మార్చి 2013 నాటి కూర్పు

ఇంటూరి వెంకటేశ్వరరావు (జ: 1 జూలై, 1909 - మ: 2002) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.

వీరు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి దగ్గరున్న చంద్రరాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.

వీరు సహాయ దర్శకునిగా సుమతి, మాయలోకం, పేద రైతు, లక్ష్మి, సక్కుబాయి, నాగపంచమి, లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన కుమ్మరి మొల్ల కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ మరియు సినిమాలుగా వెలుగుచూసింది.

వీరు చాలాకాలం నవజీవన్ సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు. వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక చిత్రకళ ను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.

స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్" గా అభివర్ణించింది.

రచనలు

  • ఆంధ్ర హాలీవుడ్
  • మ్యూజింగ్స్ ఆఫ్ ది సెక్స్
  • తెలుగు సినిమా విశ్వరూపం
  • లూమినరీస్ ఆఫ్ తెలుగు ఫిలిండమ్ (ఆంగ్లం)

అవార్డులు