చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం:తెలుగు సినిమా పాటలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
[[వర్గం:తెలుగు పాటలు]] |
[[వర్గం:తెలుగు పాటలు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా పాటలు]] |
16:50, 29 నవంబరు 2013 నాటి కూర్పు
చిలకా ఏతోడు లేక అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఎస్. వి. కృష్ణారెడ్డి
పాట నేపథ్యం
పాటలోని సాహిత్యం
పల్లవి:
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//
చరణం 1:
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//
చరణం 2:
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో
తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//
పురస్కారాలు
- సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
- కళాసాగర్ అవార్డు -1994
- మనస్విని అవార్డు -1994
'వీడియో లింకులు
.