కొమ్మినేని శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 46: పంక్తి 46:
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం: గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం: గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

03:30, 4 డిసెంబరు 2013 నాటి కూర్పు

కొమ్మినేని శేషగిరిరావు
జననంకొమ్మినేని శేషగిరిరావు
మరణం2008, డిసెంబర్ 5
నివాస ప్రాంతంతెనాలి సమీపంలోని పొన్నెకల్లు
ప్రసిద్ధిలుగు సినిమా దర్శకుడు, నటుడు.

కొమ్మినేని శేషగిరిరావు (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు.

ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా స్వగ్రామం తెనాలి సమీపంలోని పొన్నెకల్లు. ఈయన అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా నటించినా, గొప్పవారి గోత్రాలు (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం, తాతామనవడు, సంసారం సాగరం వంటి యాభైకి పైగా సినిమాలలో నటించాడు.

దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం గిరిబాబు హీరోగా నటించిన దేవతలారా దీవించండి. ఆ చిత్ర విజయం తరువాత సింహగర్జన సినిమాకు, ఆ తరువాత తాయారమ్మ బంగారయ్య సినిమాకు దర్శకత్వం వహించారు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో శివాజీ గణేశన్‌తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. వీరు కన్నడంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.

కొమ్మినేని 2008, డిసెంబర్ 5న చెన్నైలో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.