రోలు, రోకలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోలు, రోకలి
రుబ్బురోలు, రోకలి[1]
ఇతర పేర్లురుబ్బురోలు,రోకలి
ఉపయోగాలుపప్పు రుబ్బుకొనుటకు,పిండి దంచుటకు
ఆవిష్కర్తఆదిమ మానవుడు
సంబంధిత అంశాలురోలు, రోకలి

యింటిలో చూర్ణాలను తయారుచేయుసాధనాలలో రోలు, రోకలి, రుబ్బు గుండు లేదా పొత్రం మొదలగునవి ముఖ్యమైనవి.

రోలు, రోకలి[మార్చు]

రోలు ఒక రాతితో చేయబడి ఉంటుంది. ఒక గట్టి రాయి ముక్కకు ఒక రంధ్రం చేయబడి ఉన్న సాధనం రోలు. రోకలి కర్రతో స్థూపాకారంగా చేయబడి దాని చివర లోహపు రింగు కలిగి ఉండే సాధనం. ఇది సుమారు 3 నుండి 4 అడుగుల పొడవు ఉంటుంది. రోటిలో మనం దంచవలసిన పదార్థాన్ని ఉంచి నిలువుగా అనగా రోలుకు 90 డిగ్రీల కోణంతో అనేకసార్లు దంచవలెను.
రోలు, రోకలి ప్రతి యింటిలోనూ ఉంటుంది. దీనితో మిరపకాయలు, పసుపుకొమ్ములు, నువ్వులు, ధాన్యాలు మొదలగు వాటిని దంచే సాధనం. రోకలితో మిరపకాయలు, పసుపు కొమ్ములు వంటి వాటిని దంచినపుడు చూర్ణంగా మారి కారంపొడి, పసుపు వంటివి తయారవుతాయి. ఈ చూర్ణములు మన వంటలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ధాన్యం దంచినపుడు దానిపై ఉన్న పొర వేరుచేయబడుతుంది. అపుదు దంపుడు బియ్యం తయారవుతాయి. ఈ బియ్యం మన శరీరానికి ఆరోగ్యకరం. అదే బియ్యమును యంత్రంద్వారా తయారుచేసినట్లయిన బియ్యం గింజపై గల పోషక పదార్థం కల పొర తొలగింపబదుతుంది. అందువలన రోకలితో దంచిన బియ్యం ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నుండి పొరను వేరు చేయాలన్నా రోలులో నువ్వులను వేసి రోకలితో దంచవలెను. అదే విధంగా మన బజారులో లభించే మినపగుళ్ళను కూడా ఈ పద్ధతిలో తయారుచెయవచ్చును. పప్పుల పైన గల పొరను తొలగించు విధానంలో రోలు, రోకలి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బియ్యం పిండిని తయారు చేసే విధానంలో రోటిలో బియ్యమును వేసి రోకలితో దంచవలెను. తర్వాత దానిని జల్లెడతో చూర్ణంను వేరుచేయవలెను. ఈ బియ్యం పిండిని అరిశెలు తయారీకి వాడతారు.

రోలు, పొత్రం[మార్చు]

రోలు, పొత్రం మన వంట గదిలో ముఖ్యమైన సాధనములు. పొడిగా గల చూర్ణములు రోలు, రోకలితో ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా రుబ్బురోలలో రుబ్బుగుండు (పొత్రము) ఉపయోగించి తడి చూర్ణం (రుబ్బు) లను తయారుచేస్తారు. పప్పులను రోటిలో వేసి రుబ్బు గుండును అందులో ఉంచి సవ్య లేదా అపసవ్య దిశలో అనేక సార్లు వృత్తాకారంగా త్రిప్పాలి. త్రిప్పినపుడు బయటకు వచ్చిన పప్పు దినుసులను మరల లోనికి పంపి నిరంతరం త్రిప్పినపుడు పప్పురుబ్బు తయారవుతుంది. ఈ రుబ్బుతో గారెలు, వడలు, అట్లు, ఇడ్లీలు మొదలగునవి తయారుచేస్తారు. ఈ కాలంలో పప్పును రుబ్బుటకు అనేక యంత్రములు వచ్చినప్పటికీ రుబ్బురోలలో రుబ్బిన రుబ్బుతో చెసిన వడలు రుచి కలిగి ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

కల్వము[మార్చు]

ఆయుర్వేద మందులు తయారుచేయువారు, రసాయన శాస్త్రంలో కొన్ని ప్రయోగారు చెయునపుడు కొన్ని పదార్థాలను చూర్ణం చేయవలసి ఉంటుంది. అలాంటపుదు కల్వం ఉపయోగిస్తారు. ఇది పింగాణీ లేదా రాతితో చేయబడి ఉండుంది. అందులో చూర్ణం చేయవలసిన పదార్థాలను ఉంచి దానిని పింగాణీ గుండు లేదా రాతి గుండుతో చూర్ణం చేయవచ్చు.

ఉపయోగాలు[మార్చు]

  • రోలు, రోకలితో మిరపకాయలు, పసుపుకొమ్ములు వంటివాటిని దంచి చూర్ణం చేయవచ్చు.
  • రోలు, రోకలితో వివిధ రకాల ధాన్యాల యొక్క పై పొరను తొలగించవచ్చు.
  • రోలు, రోకలితో అటుకులు తయారుచెయవచ్చు.
  • రోలు, పొత్రముతో వివిధ రకాల పప్పుల యొక్క రుబ్బులను తయారుచేయవచ్చు.
  • రోలు, పొత్రముతో మసాలా ముద్ధను తయారుచేయవచ్చును.
  • కల్వముతో వివిధ మిశ్రమాలను తయారుచేయవచ్చును.

ఆరోగ్యం[మార్చు]

నేటి సమాజం యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. పూర్వ కాలంలో యంత్రాలు లేని కాలంలో స్త్రీలకు యింటిలో చేసే అనేక పనులే వ్యాయామ సాధనాలు. పూర్వ కాలంలో పురుషులు వివిధ పనులకు పోయినపుడు వారు చేసే శ్రమ వల్ల వ్యాయామం జరిగి ఆరోగ్యంగా ఉండేవారు. యిండ్లలో గల స్త్రీల ఆరోగ్యం యింటిలో గల వివిధ పనులు చెయడం వల్ల వచ్చేది. మిరపకాయలను దంచడం, పసుపును తయారుచేయడం, వివిధ రకాల పిండిలను తయారుచేయడం, పప్పు రుబ్బడం, వివిధ ధాన్యాలపై గల పొట్టును తీసివేయడం, కవ్వంతో మజ్జిగను చిలకడం, పశు పోషణ వంటి అనేక కార్యములు చేయడం వలన నేటి స్త్రీల కంటే అనేక రెట్లు ఆరోగ్యంగా ఉండేవారు. వారు చేసిన వివిధ పదార్థాల వలన వారి సంతానం కూడా ఆరోగ్యంగా ఉండేది. నేటి సమాజంలో పై పనులన్నింటికి యంత్రాలను ఉపయోగించటం వలన అనేక శారీరక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చును. ఆ కాలంలో వారు తయారుచేసే పసుపును ఉపయోగించి చర్య సౌందర్యం పొందటమే కాక చర్మ వ్యాధులనుంది నివారన పొందేవారు. ఈ కాలంలో అనేక రకాల క్రీములు వాడినప్పటికీ చర్మ రోగాల పాలు అవుతున్నారు. పసుపులో చినాలరంగు (పొటాషియం పర్మాంగనేటు) ను కలిపి దంచి కుంకుమను తయారు చేసి వాడే వారు. ఈ కుంకుమను ఉపయోగించటం వలన మన శరీరంలో గల ఉష్ణం వలన పొటాషియం పర్మాంగనేట్ చర్య జరిగి ఆక్సిజన్ తయారయి కుండలినీ శక్తి పెరిగి ప్రశాంతతతో జీవించారు. ఈ కాలంలో కుంకుమ ఉపయోగించేవారు కనుమరుగవుతున్నారు. పసిపిల్లలకు పసుపు కొమ్ములను నూరి పసుపును తయారుచేసి శరీరానికి రాసి చర్మానికి రక్షన కల్పించేవారు. ఇంకా అనేక పనులు చెసి ఆరోగ్యాన్ని పెంపొందించు

సంబంధిత చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]