బసవ రామ తారకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో బసవ రామ తారకం విగ్రహం.

బసవ రామ తారకం తెలుగు సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మొదటి భార్య[1]. బసవతారకానికి ఎన్.టి.రామారావుతో తో 1942 మే నెలలో వివాహం జరిగింది. బసవతారకం ఎన్టీఆర్ కి మేనమావ కూతురు. ఈమె 1985లో కాన్సర్ వ్యాధితో మరణించింది. ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణించడం వలన ఎన్టీఆర్ కలత చెంది ఆమె జ్ఞాపకార్థం హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిట‌ల్‌ అండ్ రీసెర్చ్ సెంటర్ ను స్థాపించాడు.[2] [3].[4]

కుటుంబం

[మార్చు]

తారక రామారావు, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం. పన్నెండు మందిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కుమార్తెలు. రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

మూలాలు

[మార్చు]
  1. Aug 3, TNN /; 2001; Ist, 01:02. "Radiation caused NTR's wife's cancer: Doctor | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "అమ్మ మృతితో నాన్న‌లో పుట్టిన‌ ఆలోచ‌న‌". www.eenadu.net. Retrieved 2021-05-07.
  3. "Know about Basavatarakam Indo American Cancer Hospital & Research Institute Hyderabad – India Healthcare Tourism Portal". www.indiahealthcaretourism.com. Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.
  4. telugu, 10tv (2020-12-05). "6వ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్‌గా బసవతారకం | Basavatarakam Cancer Hospital". 10TV (in telugu). Retrieved 2021-05-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)