Jump to content

బాలిస్టిక్ క్షిపణి

వికీపీడియా నుండి
మినిట్‌మాన్-III MIRV ప్రయోగ క్రమం:1. క్షిపణి మొదటి దశ బూస్టరు మోటారును మండించడంతో సైలో నుండి బయటికి లేస్తుంది 2.60 సెకండ్ల తరువాత మొదటి దశ పడిపోయి, రెండవ దశ మోటారు (B) మండుతుంది. క్షిపణి ముసుగు (E) తొలగుతుంది. 3. 120 సెకండ్ల తరువాత, మోడవ దశ మోటారు (C) మండుతుంది. రెండొ దశ విడిపోతుంది. 4. 180 సెకండ్ల తరువాత, మోడవ దశ థ్రస్టరు ఆగిపోయి పోస్ట్ బూస్ట్ వాహనం (D) రాకెట్ నుండి విడిపోతుంది. 5. పోస్ట్ బూస్ట్ వాహనం తబ్నను తాను మలచుకుంటూ పునఃప్రవేశ వాహనాన్ని (RV) మోహరిస్తుంది. 6. RV, చాఫ్ మోహరించబడింది  7. RV (ఆయుధం సచేతనమైంది), చాఫ్ విపరీతమైన వేగంతో వాతావరణ ప్రవేశం చేస్తాయి. 8. అణ్వాయుధాలు పేలుతాయి.

బాలిస్టిక్ క్షిపణి అనేది బాలిస్టిక్ పథంలో ప్రయాణించి ముందుగా నిర్దేశించిన స్థలంలో ఒకటిగాని అంతకంటే ఎక్కువగానీ వార్‌హెడ్‌లను వెయ్యగల క్షిపణి. బాలిస్టిక్ క్షిపణికి దాని ప్రయాణంలో కొంత భాగం మాత్రమే దిశానిర్దేశం ఉంటుంది.  (అసలు దిశానిర్దేశం లేనే లేని బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటిని రాకెట్లు అనొచ్చు). క్షిపణి మార్గంలో చాలా భాగం చోదక శక్తి ఉండదు. ఆ సమయంలో గురుత్వాకర్షణ, గాలి నిరోధాల నియంత్రణలో ఇది ప్రయాణిస్తుంది. సుదూర ఖండాంతర  బాలిస్టిక్ క్షిపణి నిట్టనిలువుగా పైకి లేచి, సబ్-ఆర్బిటాల్ పథంలో ప్రయాణిస్తుంది. ప్రయాణంలో చాలా భాగం వాతావరణం బయటే జరుగుతుంది. తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణులు వాతావరణాన్ని వీడిపోవు.

చరిత్ర

[మార్చు]

చిరకాలంగా రాకెట్లను ఆయుధాలుగా వాడుతున్నారు. 1930, 40 ల్లో నాజీలు A-4,[1] అనే తొలి బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసారు. V-2 రాకెట్ అని పిలవబడిన ఈ క్షిపణిని వెర్నర్ వాన్ బ్రాన్ పర్యవేక్షణలో తయారు చేసారు.1942 అక్టోబరు 3 న V-2 మొదటి పరీక్ష జరిగింది. 1944 సెప్టెంబరు 6 న పారిస్‌పై తొలి దాడి చేసింది. రెందు రోజుల తరవాత లండన్ పై దాడి  చేసింది. 1945 మేలో రెండవ ప్రపంచ యుద్ధం  ముగిసే సరికి  3,000 పైచిలుకు V-2 లను ప్రయోగించారు. R-7 సెమ్యోర్కా మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.

30 కి పైగా దేశాలు బాలిస్టిక్ క్షిపణులను మోహరించాయి.అభివృద్ధి జరుగుతూనే ఉంది. 2007 లో దాదాపు 100 క్షిపణి పరీక్షలు (అమెరికా పరీక్షలు కలపకుండా) జరిగాయి. వీటిలో ఎక్కువగా చైనా, ఇరాన్, రష్యాలు చేసినవే. 2017 నాటికి తమ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను చెరి 1550 కి తగ్గించుకోవాలని రష్యా అమెరికాలు 2010 లో ఒప్పందానికి వచ్చాయి.[2]

Side view of Minuteman-III ICBM

ప్రయాణం

[మార్చు]

ఖండాంతర క్షిపణి పథం (ట్రాజెక్టరీ) మూడు భాగాలుగా ఉంటుంది: చోదిత ప్రయాణం; స్వేచ్ఛా ప్రయాణం (మొత్తం ప్రయాణ సమయంలో ఇదే అత్యధిక భాగం); పునఃప్రవేశం (క్షిపణి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం) తక్కువ దూర పరిధి కలిగిన క్షిపణులకు మొదటి రెండు దశలు మాత్రమే ఉంటాయి. అవి వాతావరణాన్ని వీడవు.

బాలిస్టిక్ క్షిపణులను స్థిర లాంచర్లు లేదా మొబైల్ లాంచర్ల నుండి ప్రయోగించవచ్చు. మొబైల్ లాంచర్లలో లాంచి వాహనాలు, విమానాలు, ఓడలు, జలాంతర్గాములూ ఉంటాయి. చోదిత ప్రయాణ దశ కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిముషాల దాకా ఉంటుంది. దానిలో ఒకటి కంటే ఎక్కువ దశలు ఉండవచ్చు.

క్షిపణి రకాలు

[మార్చు]
Trident II SLBM launched by ballistic missile submarine.

బాలిస్టిక్ క్షిపణులు తమ పరిధి, ఉపయోగాలపై ఆధారపడి అనేక రకాలుగా ఉంటాయి. సాధారణంగా వాటిని పరిధి ఆధారంగా వర్గీకరిస్తారు.  వివిధ దేశాలు వివిధ రకాలుగా పరిధిని నిర్వచిస్తాయి:

  • వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి: పరిధి 150 కిమీ నుండి 300 కిమీ
    • యుద్ధభూమి పరిధి బాలిస్టిక్ క్షిపణి (BRBM): పరిధి 100 కిమీ లోపు
  • థియేటర్ బాలిస్టిక్ క్షిపణి (TBM): పరిధి 300 కిమీ నుండి 3,500 కిమీ
    • తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM): పరిధి 300 కిమీ నుండి 1,000 కిమీ
    • మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM): పరిధి 1,000 కిమీ నుండి 3,500 కిమీ
  • మధ్యస్థ పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) లేదా దూర పరిధి బాలిస్టిక్ క్షిపణి (LRBM): పరిధి 3,500 కిమీ నుండి 5,500 కిమీ
  • ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM): పరిధి 5,500 కిమీ పైన
  • జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (SLBM): ఇవి ఎక్కువగా ఖండాంతర పరిధి కలిగి ఉంటాయి. వీటికి మినహాయింపులు భారత్ కు చెందిన సాగరిక, K-4,  ఉత్తర కొరియాకు చెందిన KN-11 (ఇది ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది).

తక్కువ పరిధి, మధ్య పరిధి క్షిపణులను కలిపి థియేటర్ లేదా వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులు (TBM) అని అంటారు. దూర, మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణులను సాధారణంగా అణ్వాయుధాలను ప్రక్షేపించడానికి వాడుతారు. అవి తీసుకెళ్ళగలిగే పేలోడు మరీ పరిమితంగా ఉంటుంది కాబట్టి, సంప్రదాయిక ఆయుధాల కోసం వీటిని ప్రయోగించడం మరీ ఖర్చుతో కూడుకున్నది. .

పాక్షిక బాలిస్టిక్ క్షిపణులు

[మార్చు]

పాక్షిక బాలిస్టిక్ క్షిపణి (సెమీ బాలిస్టిక్ క్షిపణి అని కూడా అంటారు) తక్కువ పథాన్ని కలిగి, ప్రయాణంలో ఉండగా దిశను, పరిధినీ మార్చుకునే శక్తి కలిగి ఉంటుంది.[citation needed]

బాలిస్టిక్ క్షిపణి కంటే తక్కువ ఎత్తు పథంలో ప్రయాణించే పాక్షిక బాలిస్టిక్ క్షిపణి, దాని కంటే అధిక వేగంతో ప్రయాణించగలదు. శత్రువు ప్రతిచర్య తీసుకునే సమయం తక్కువగా ఉంటుంది. రష్యన్ ఇస్కందర్ ఒక పాక్షిక బాలిస్టిక్ క్షిపణి.[3]  ఇస్కందర్-ఎమ్ 2,100–2,600 మీ/సె (Mach 6 - 7) వేగంతో 50 కిమీ ఎత్తున ప్రయాణిస్తుంది. అది 4,615 కిలోల బరువుంటుంది, 710 – 800 కిలోల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు, 480 కిమీ పరిధి కలిగి, 5-7 మీటర్ల వర్తుల దోష పరిధి కలిగి ఉంటుంది. ప్రయాణంలో ఉండగా వివిధ ఎత్తులు, పథాల్లో ఎగురుతూ యాంటీ-బాలిస్టిక్ క్షిపణులను ఏమారుస్తుంది.[4][5]

చైనా, భారత్, ఇరాన్‌లు ఇటీవల యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసాయి;

 Chinaచైనా
  • DF-26
  • DF-21D
 Indiaభారత్
  • ధనుష్
దస్త్రం:Dhanush-misisle.jpg
ధనుష్ క్షిపణి
 Iranఇరాన్
  • ఖలీజ్ ఫార్స్

పోలిక గల వ్యవస్థలు

  • హాడెస్
  • నస్ర్
  • లోరా
  • ఇస్కందర్
  • షహాబ్ 2
  • ఫతేహ్-110
  • శౌర్య
  • MGM-140B/E ATACMS
  • ఓకా
  • ప్రహార్
  • టోచ్‌కా
  • కియామ్ 1

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. Zaloga, Steven (2003). V-2 Ballistic Missile 1942–52. Reading: Osprey Publishing. p. 3. ISBN 978-1-84176-541-9.
  2. http://www.state.gov/documents/organization/140035.pdf
  3. Shaurya surfaces as India's underwater nuclear missile
  4. "SS-26 Iskander-M". Archived from the original on 2017-10-06. Retrieved 2016-07-21.
  5. SS-26 Stone Iskander 9M72 9P78EBallistic missile system Archived July 25, 2010, at the Wayback Machine.