బి.ఆర్.చోప్రా
బి.ఆర్.చోప్రా | |
---|---|
జననం | బల్దేవ్ రాజ్ చోప్రా 1914 ఏప్రిల్ 22 |
మరణం | 2008 నవంబరు 5 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 94)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1944–2006 |
జీవిత భాగస్వామి | ప్రకాష్ చోప్రా |
పిల్లలు | 3, రవి చోప్రాతో సహా |
సన్మానాలు | దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (1998) పద్మభూషణ్ పురస్కారం (2001) |
బల్దేవ్ రాజ్ చోప్రా (1914 ఏప్రిల్ 22 - 2008 నవంబరు 5)[1] ప్రముఖ భారతీయ దర్శకుడు. బాలీవుడ్ పరిశ్రమ, టెలివిజన్ ధారావాహికల నిర్మాత. నయా దౌర్ (1957), సాధన (1958), కానూన్ (1961), గుమ్రా (1963), హుమ్రాజ్ (1967), ఇన్సాఫ్ కా తరాజు (1980), నికాహ్ (1982), అవమ్ (1987), వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. 1988లో టెలివిజన్ సిరీస్ మహాభారత్ నిర్మాత.[2] అతను 1998 సంవత్సరానికి సినీరంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నాడు.
అతని తమ్ముడు యష్ చోప్రా, కొడుకు రవి చోప్రా, మేనల్లుడు ఆదిత్య చోప్రా కూడా బాలీవుడ్ పరిశ్రమలో దర్శకులు. అతని మేనల్లుడు ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత కూడా.
జీవిత చరిత్ర
[మార్చు]బి.ఆర్.చోప్రా 1914 ఏప్రిల్ 22న షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా (గతంలో నవాన్‌షహర్ జిల్లా)లోని రహోన్‌లో జన్మించాడు. అతని తండ్రి విలయతి రాజ్ చోప్రా. ఆ తర్వాత వారు లాహోర్‌కు మారారు. అతని తమ్ముడు యష్ చోప్రా సినిమా నిర్మాత.[3]
ఆయన లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ పూర్తిచేసాడు. అతను లాహోర్ కేంద్రంగా ప్రచురితమైయ్యే సినీ మాసపత్రిక సినీ హెరాల్డ్‌తో 1944లో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత ఆ పత్రికను స్వాధీనం చేసుకుని 1947 వరకు కొనసాగించాడు.
అదే సంవత్సరం ఐ. ఎస్. జోహార్ కథ అయిన చాందినీ చౌక్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో నయీమ్ హష్మీ హీరోగా నటించగా, ఎరికా రుక్షి హీరోయిన్. అయితే సినిమా నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉండగానే, లాహోర్‌లో అల్లర్లు చెలరేగడంతో అతను, అతని కుటుంబం నగరం నుండి పారిపోవాల్సి వచ్చింది.
1947లో భారతదేశం, పాకిస్తాన్‌గా విభజించబడిన తరువాత వారు ఢిల్లీకి మకాం మార్చారు. 1948లో అతను ముంబై చేరుకుని తన మొదటి ప్రొడక్షన్ కర్వాత్ నిర్మించినప్పటికీ అది అపజయం పాలైంది. దర్శకుడిగా అతని మొదటి చిత్రం అఫ్సానా 1951లో విడుదలైంది. ఇందులో అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఈ చిత్రం విజయవంతమవడంతో బి.ఆర్.చోప్రా పేరు బాలీవుడ్‌లో స్థిరపడింది.
1954లో మీనా కుమారి ప్రధాన పాత్రతో గతంలో ఆగిపోయిన చాందినీ చౌక్ చిత్ర నిర్మాణం పూర్తిచేసాడు. 1955లో తన సొంత నిర్మాణ సంస్థ బి.ఆర్ ఫిల్మ్స్‌ని స్థాపించాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి మొదటి చిత్రం ఏక్ హి రాస్తా విడుదల అయి విజయవంతమైంది. 1957లో దిలీప్ కుమార్, వైజయంతిమాల జంటగా బి.ఆర్.చోప్రా నిర్మించిన చిత్రం నయా దౌర్ గోల్డెన్ జూబ్లీ హిట్ కొట్టింది. తరువాత విడుదలైన కానూన్, గుమ్రా, హుమ్రాజ్ అరవైలలో పెద్ద విజయాలు సాధించాయి. ఆయన 1963లో 13వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యుడు.[4] నటుడు దిలీప్ కుమార్‌తో అతని రెండవ చిత్రం 1972లో ఫ్లాప్ అయిన దస్తాన్.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా/టీవీ సీరీస్ | దర్శకత్వం | నిర్మాత | నోట్స్ |
1949 | కర్వాత్ | అవును | అవును | దర్శకత్వ రంగ ప్రవేశం |
1951 | అఫ్సానా | అవును | అవును | |
1953 | షోల్ | అవును | కాదు | |
1954 | చాందినీ చౌక్ | అవును | కాదు | |
1956 | ఏక్ హాయ్ రాస్తా | అవును | అవును | బి.ఆర్ దర్శకత్వంలో తొలి సినిమా. సినిమాలు |
1957 | నయా దౌర్ | అవును | అవును | |
1958 | సాధన | అవును | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1959 | ధూల్ కా ఫూల్ | కాదు | అవును | |
1960 | కానూన్ | అవును | అవును | హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం |
ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు | ||||
1961 | ధర్మపుత్ర | కాదు | అవును | హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం |
1963 | గుమ్రా | అవును | అవును | హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం |
1965 | వక్త్ | కాదు | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1967 | హమ్రాజ్ | అవును | అవును | |
1969 | ఇత్తెఫాక్ | కాదు | అవును | |
1970 | ఆద్మీ ఔర్ ఇన్సాన్ | కాదు | అవును | |
1972 | దస్తాన్ | అవును | అవును | |
1973 | ధుండ్ | అవును | అవును | |
1975 | జమీర్ | కాదు | అవును | రవి చోప్రా తొలి దర్శకత్వం |
1976 | ఛోటీ సి బాత్ | కాదు | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1977 | కర్మ | అవును | అవును | |
1978 | పతి పత్నీ ఔర్ వో | అవును | అవును | |
1980 | బర్నింగ్ రైలు | కాదు | అవును | |
1980 | ఇన్సాఫ్ కా తారాజు | అవును | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1981 | అగ్ని పరీక్ష | కాదు | అవును | |
1982 | బీటా | కాదు | అవును | |
1982 | నికాహ్ | అవును | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
ఎంపికైంది – ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు | ||||
1982 | తేరీ మేరీ కహానీ | కాదు | అవును | టెలిఫిల్మ్ |
1983 | మజ్దూర్ | కాదు | అవును | |
1983 | ధరి ఆకాష్ | కాదు | అవును | టెలిఫిల్మ్ |
1984 | ఆజ్ కీ ఆవాజ్ | కాదు | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1985 | గజల్ | కాదు | అవును | |
1985 | తవైఫ్ | అవును | కాదు | |
1986 | కిరాయదర్ | కాదు | అవును | |
1986 | దహ్లీజ్ | కాదు | అవును | |
1987 | అవామ్ | అవును | అవును | |
1988 | మహాభారతం | కాదు | అవును | TV సిరీస్ |
1991 | మహాభారత కథ | టీవీ సీరియల్ | ||
1991 | ప్రతిజ్ఞాబాద్ | కాదు | అవును | |
1992 | కల్ కీ అవాజ్ | అవును | అవును | |
1992 | సౌదా | అవును | అవును | TV సిరీస్ |
1993 | కానూన్ | అవును | కాదు | TV సిరీస్ |
2000 | విష్ణు పురాణం | కాదు | అవును | TV సిరీస్ |
2002–2004 | రామాయణం | కాదు | అవును | TV సిరీస్ |
2001–2004 | ఆప్ బీటీ | కాదు | అవును | TV సిరీస్ |
2002–2003 | మా శక్తి | అవును | అవును | TV సిరీస్ |
2003 | బాగ్బన్ | కాదు | అవును | ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2004 | కామినీ దామిని | కాదు | అవును | TV సిరీస్ |
2006–2007 | విరాసత్ | కాదు | అవును | TV సిరీస్ |
2006 | బాబుల్ | కాదు | అవును | |
2008 | భూతనాథ్ | కాదు | అవును |
అవార్డులు
[మార్చు]పౌర పురస్కారాలు
[మార్చు]- పద్మ భూషణ్: 2001[5]
- 1960: హిందీలో ఉత్తమ చలనచిత్రం కోసం మెరిట్ సర్టిఫికేట్ - కానూన్[6]
- 1961: హిందీలో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పతకం – ధర్మపుత్ర (నిర్మాత)[7]
- 1998: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు[8]
- 1962: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు: కానూన్
- 2003: ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ Filmmaker B R Chopra passes away. Press Trust of India via NDTV. 5 November 2008
- ↑ B.R.Chopra made socially relevant films The Hindu, 6 November 2008.
- ↑ Taliculam, Sharmila (4 April 1997). "And miles to go..." Rediff.com. Retrieved 29 October 2018.
- ↑ "Berlinale: Juries". berlinale.de. Archived from the original on 29 March 2010. Retrieved 13 February 2010.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ "8th National Film Awards". International Film Festival of India. Archived from the original on 23 November 2016. Retrieved 7 September 2011.
- ↑ "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 December 2016. Retrieved 30 July 2012.
- ↑ "Rediff On The NeT: B R Chopra chosen for Dadasaheb Phalke Award". Rediff.com. 21 October 1999. Retrieved 13 April 2022.