బిజన్ కుమార్ ముఖర్జియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిజన్ కుమార్ ముఖర్జియా
4వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1954 డిసెంబరు 22 – 1956 జనవరి 31
Nominated byబాబూ రాజేంద్ర ప్రసాద్
అంతకు ముందు వారుమెహర్ చంద్ మహాజన్
తరువాత వారుసుధీ రంజన్ దాస్
వ్యక్తిగత వివరాలు
జననం(1891-08-15)1891 ఆగస్టు 15
పశ్చిమ బెంగాల్
మరణం1956 ఫిబ్రవరి 22(1956-02-22) (వయసు 64)

బిజన్ కుమార్ ముఖర్జియా (1891, ఆగస్టు 151956 ఫిబ్రవరి 22[1]) భారతదేశ సుప్రీంకోర్టు నాలుగవ ప్రధాన న్యాయమూర్తి. 1954 డిసెంబరు 22 నుండి 1956 జనవరి 31 వరకు పనిచేశాడు.

జననం, విద్య[మార్చు]

బిజన్ కుమార్ ముఖర్జియా 1891, ఆగస్టు 15న రాఖల్ దాస్ ముఖర్జీ - శరత్ కుమారి దేవి దంపతులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించాడు.[2] పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ బ్రాంచ్ గవర్నమెంట్ స్కూల్, హుగ్లీ మొహసిన్ కళాశాలలో తన విద్యను పూర్తిచేసి కలకత్తా విశ్వవిద్యాలయంలోని సురేంద్రనాథ్ లా కాలేజీలో చేరాడు.[3] ఎంఏ (చరిత్ర), బి.ఎల్. (గోల్డ్ మెడలిస్ట్), ఎంఎల్ (గోల్డ్ మెడలిస్ట్), డాక్టర్ ఆఫ్ లా లలో పట్టా సాధించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

లబన్యాలతా దేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు అమియా కుమార్ ముఖర్జీ (కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి), మనవరాలు మీరా గంగూలీ ఒక ముని మనవడు అంజన్ గంగూలీ ఉన్నారు.

న్యాయవృత్తి[మార్చు]

1914లో జూనియర్ గవర్నమెంట్‌లో కలకత్తా బార్‌లో చేరారు. 1934లో కలకత్తా హైకోర్టు ప్లీడర్ గా, 1936లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, 1936 నవంబరు నుండి 1948 వరకు బెంగాల్ సరిహద్దు కమిషన్ సభ్యుడిగా, 1948 అక్టోబరు 14 నుండి 1954 డిసెంబరు 22 వరకు ఫెడరల్ కోర్ట్/సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా,1954 డిసెంబరు 22 నుండి 1956 జనవరి 31 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.

1954 జనవరిలో ఎం. పతంజలి శాస్త్రి పదవీ విరమణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా నెహ్రూ కోరగా, తనకంటే మెహర్ చంద్ మహాజన్ సీనియర్ అని పేర్కొంటూ ముఖర్జీ తిరస్కరించాడు. మహాజన్ పదవీ విరమణ చేసిన తర్వాత మాత్రమే ముఖర్జీ పదవిని చేపట్టాడు.[4]

సభ్యత్వాలు, సంఘాలు[మార్చు]

  • కలకత్తా యూనివర్సిటీ ఫెలో
  • బెంగాల్ సంస్కృత సంఘం అధ్యక్షుడు
  • బెంగాల్‌లోని స్కౌట్స్ ఉద్యమంతో అనుబంధం
  • దక్షిణ కలకత్తా బాలుర ఎస్సీ సంఘం జిల్లా కమీషనర్‌
  • లిటరరీ అండ్ కల్చరల్ సొసైటీ, బిబుధ జననీ సవా, నబద్వీప్, గీతా సావా, సెయింట్ సాహిత్య పరిషత్తులతో అనుబంధం

ప్రచురణలు[మార్చు]

  • సమస్యలు & చట్టం
  • హిందూ మతపరమైన, చారిటబుల్ ట్రస్ట్‌ల చట్టం

మరణం[మార్చు]

బిజన్ కుమార్ ముఖర్జియా 1956 ఫిబ్రవరి 22న మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. ""Bijan Kumar Mukherjea", Gynad.com". Archived from the original on 22 August 2017. Retrieved 2022-10-15.
  2. "Education First".
  3. Surendranath Law College. "Alumni". snlawcollege.ac.in. Retrieved 2022-10-15.
  4. "Two Lives". Archived from the original on 31 December 2014. Retrieved 2022-10-15.
  5. ""Bijan Kumar Mukherjea", Gynad.com". Archived from the original on 22 August 2017. Retrieved 2022-10-15.

బయటి లింకులు[మార్చు]