Jump to content

మాదమాల

అక్షాంశ రేఖాంశాలు: 13°48′34.092″N 79°36′28.044″E / 13.80947000°N 79.60779000°E / 13.80947000; 79.60779000
వికీపీడియా నుండి
మాదమాల
పటం
మాదమాల is located in ఆంధ్రప్రదేశ్
మాదమాల
మాదమాల
అక్షాంశ రేఖాంశాలు: 13°48′34.092″N 79°36′28.044″E / 13.80947000°N 79.60779000°E / 13.80947000; 79.60779000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంశ్రీకాళహస్తి
విస్తీర్ణం2.56 కి.మీ2 (0.99 చ. మై)
జనాభా
 (2011)[1]
472
 • జనసాంద్రత180/కి.మీ2 (480/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు220
 • స్త్రీలు252
 • లింగ నిష్పత్తి1,145
 • నివాసాలు127
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517536
2011 జనగణన కోడ్595834

మాదమల, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన శ్రీకాళహస్తి నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 127 ఇళ్లతో, 472 జనాభాతో 256 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 220, ఆడవారి సంఖ్య 252. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 201 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595834[2].

ఇది వేలవేడు పంచాయతీ క్రిందకి వస్తుంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం. బస్సులలో సుమారు 45 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు.ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ, గొర్రెల పెంపకం . అంగన్ వాడీ నుంచి ఐదవ తరగతి వరకూ విద్యా సౌకర్యం ఉంది. రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మొదలైన పండుగలే కాక పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, ఎల్లమ్మ సంతర్పణ ఘనంగా నిర్వహిస్తారు.గ్రామానికి ప్రధాన గ్రామదేవత ఎల్లమ్మ. ప్రతి యేటా ఊరి మొదలు ప్రతిష్ఠించబడిన ఈ దేవతకు భక్తి శ్రద్ధలతో సంతర్పణ జరుపుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులు చిన్న-పెద్ద, పేద-ధనిక, కుల-మత భేదాలు లేకుండా పూజలు చేస్తారు. ఈ వేడుకలలో చిన్నా పెద్దా తేడాలేకుండా గ్రామస్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.

గ్రామ జనాభా

[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనాభా - మొత్తం 421 - పురుషుల 201 - స్త్రీల 220 - గృహాల సంఖ్య 108

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల శ్రీకాళహస్తి లోను, ప్రాథమికోన్నత పాఠశాల మాధ్యమిక పాఠశాల పాలెంలోనూ ఉన్నాయి.ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల కాపుగున్నేరి లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు తిరుపతి లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ట్రాక్టరు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామ నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మాదమాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 16 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 16 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 69 హెక్టార్లు
  • బంజరు భూమి: 39 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 114 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 39 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 114 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మాదమలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.గ్రామంలో సాగునీటికి ఎక్కువ మంది ఊరికి పడమటగా ఉన్న చెరువు మీదే ఎక్కువగా ఆధారపడతారు. కొద్ది మంది బావులు, గొట్టపు బావుల మీద ఆధారపడతారు.

  • బావులు/బోరు బావులు: 46 హెక్టార్లు
  • చెరువులు: 67 హెక్టార్ల

ఉత్పత్తి

[మార్చు]

మదమలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, వేరుశనగ

వృత్తి

[మార్చు]

ఎక్కువ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. రైతులు వరి, వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఆవులు, బర్రెల పెంపకం ద్వారా పాలు అమ్మి గ్రామస్థులు చెప్పుకోదగిన ఆదాయాన్ని గడిస్తుంటారు. ఈ పాలు కొనుక్కోవడానికి శ్రీకాళహస్తి పాల సరఫరా సహకార సంఘం వారు, కొన్ని ప్రైవేటు డైరీలు, ప్రైవేటు వ్యక్తులు వస్తుంటారు. ప్రాచీన గ్రామీణ వ్యవస్థ లాగే ఇక్కడ రజకులు, మంగలి వారు, కుమ్మరులు, వడ్రంగులు మొదలైన అన్ని రకాల వృత్తుల వారు నివసిస్తుంటారు. ఇంకా కొన్ని కుటుంబాలు గొర్రెల/ మేకల పెంపకం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారు.

కృషి

[మార్చు]

గ్రామంలో ఒక బియ్యం మర (రైస్ మిల్లు) ఉన్నాయి. చాలా మంది గ్రామస్థులు బియ్యం ఇక్కడే మరాడించుకుని వెళుతుంటారు. కొద్ది మంది తమ పంటను ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు. వ్యవసాయానికి ఎక్కువగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాడతారు. దాదాపు ప్రతీ ఇంటిలోనూ పాడి సంపద ఉండటం వల వాటి వ్యర్థాలను తమ పంట పొలాలను ఎరువుగా వాడుకుంటారు.

దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో రెండు దేవాలయాలు ఉన్నాయి.

  • శ్రీ పాండురంగ స్వామి దేవాలయం
  • శ్రీ ఎల్లమ్మ్మ ఆలయయం

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి యేటా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాండురంగ స్వామి భక్తబృందం దీని నిర్వహణా బాధ్యతలు చేపడుతుంది. ఈ భక్త బృందం లోని సభ్యులందరూ తప్పనిసరిగా ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ పండరి భజనలో పాల్గొంటారు. కొన్ని గ్రామాల్లో కోలాటం కూడా ప్రదర్శిస్తారు.

  • ధ్వజారోహణం: కాషాయపు జెండాని ప్రతిష్ఠించడం.
  • కంకణ ధారణ: గుండ ప్రవేశం ముందురోజు రాత్రి దీనిలో పాల్గొనే వారంతా కంకణాలు (పసుపు కొమ్ము) కట్టుకోవలసి ఉంటుంది. ఇలా కంకణం కట్టుకున్న వారు గుండ ప్రవేశం చేసేంత వరకు కొన్ని నియమాలు పాటించాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. భోజనానికి సాధారణంగా వాడే కంచాల్ని వాడకుండా విస్తరాకులు, లేదా అరటి ఆకులు మాత్రమే వాడాలి. మంచాల్ని తాకరాదు. కటిక నేల మీద, కుర్చీ మీద లేదా చాప మీద మాత్రమే కూర్చోవాలి లేదా పడుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు వేసుకోకూడదు. పసుపు బట్టలు ధరించాలి.
  • గుండ ప్రవేశం: ఈ రోజంతా గుండ ప్రవేశం చేయబోయే భక్తులు పైన చెప్పిన నియమాల్ని పాటిస్తూ. నిర్ణీత కాలవ్యవధిలో గ్రామం చేలల్లో గల వివిధ వ్యవసాయ బావుల్లో స్నానం చేసి వస్తుండాలి. ఇలా ఎన్ని సార్లు చేయలనేది. గుండం ఎన్ని మూరలు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గుండం 13 మూరలదైతే ఆ రోజు మొత్తం 13 సార్లు స్నానం ఆచరించాల్సి ఉంటుంది. గుండ ప్రవేశం ముందు ఆఖరి స్నానం ఉంటుంది. ఈ ఆఖరి స్నానం మంగళ వాయిద్యాలతో, బాణ సంచా కాల్పులతో అట్టహాసంగా జరుగుతుంది. గుండ ప్రవేశం చేసేటప్పుడు పురుషులు చొక్కా, కానీ బనియన్ కానీ వేసుకోకూడదు. సాధారణంగా ఈ ఉత్సవమంతా ఒక భజన గురువు సారథ్యంలో జరుగుతుంది. ముందుగా భజన గురువు ఒక పూల చెండును నిప్పులపై దొర్లిస్తూ ఆయన నడచిపోతే, మిగతా భక్తులంతా ఆయనను అనుసరిస్తారు. గుండ ప్రవేశం పూర్తయిన తర్వాత కొద్ది సేపు భక్తులందరూ పరవశంతో ఆనందతాండవం చేస్తారు. తరువాత స్వామికి జోలపాడి, భక్తులందరూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతారు.
  • వసంతోత్సవం: గుండ ప్రవేశం అయిన మరుసటి రోజు వసంతోత్సవం. ఇందులో భాగంగా రుక్మిణీ సమేత పాండురంగ స్వామిని పురవీధుల్లో ఊరేగిస్తారు. భజన బృందం పాటలు పాడుతుండగా, ఉత్సాహవంతులైన యువకులు వసంతం ( పసుపు, కుంకుమ మొదలైనవి కలిపిన నీళ్ళు) పోసుకుంటుండగా ఇది ఆద్యంతం ఉల్లాసంగా సాగిపోతుంది.
  • గుండశాంతి: గుండాన్ని పూడ్చి వేస్తారు.
  • పారువేట: ఈ భాగంగా మొదట్లో ఒక కుందేలును తెచ్చి. దానిని విడిచిపెట్టి, గ్రామస్తులంతా దానిని పట్టుకోవడానికి పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పుడు కుందేళ్ళు అంత సులభంగా అందుబాటులో లేక పోవడంతో ఒక కొబ్బరి కాయను అలా విసిరేసి దాన్ని దొరకబుచ్చుకుని సరిపెట్టేస్తుంటారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=మాదమాల&oldid=4261171" నుండి వెలికితీశారు