మాల్వేసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మల్వేసి
Least Mallow, Malva parviflora
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
మాల్వేసి

Subfamilies

Bombacoideae
Brownlowioideae
Byttnerioideae
Dombeyoideae
Grewioideae
Helicteroideae
Malvoideae
Sterculioideae
Tilioideae

మాల్వేసి (Malvaceae) కుటుంబంలో సుమారు 82 ప్రజాతులు, 1500 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.

కుటుంబ లక్షణాలు

[మార్చు]
  • ఈ మొక్కలు అధికంగా గుల్మాలు లేదా పొదలు. కొన్ని వృక్షాలు. శాకీయ భాగాలమీద నక్షత్రాకారపు కేశాలుంటాయి. కణజాలాల్లో జిగురు కుహరాలు ఉంటాయి.
  • తల్లివేరు వ్యవస్థ.
  • కాండం సాధారణంగా నిటారుగా ఉండే వాయుగతం. కొన్ని ప్రజాతుల్లో కాండం ఉద్వక్రంగా సాగిలబడి మృదువుగా గాని, దృఢంగా గాని ఉంటుంది. శాఖాయుతం, వర్తులాకారం.
  • పత్రం ప్రకాండ సంబంధం, ఏకాంతర పత్రవిన్యాసం, పుచ్ఛసహితం, వృంతసహితం, పృష్ఠోదరం. సాధారణంగా సరళపత్రాలు (హైబిస్కస్) లేదా హస్తాకారంగా చీలి ఉంటాయి లేదా బహుదళ హస్తాకార సంయుక్త పత్రాలు. జాలాకార ఈనెల వ్యాపనం.
  • పుష్పవిన్యాసం: ఏకాంతపుష్పం, గ్రీవస్థం (హైబిస్కస్) లేదా శిఖరస్థం (గాసిపియమ్) అరుదుగా సామాన్య అనిశ్చితం.
  • పుష్పాలు: సాధారణంగా పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. వృంతసహితం, పుచ్ఛసహితం. లఘుపుచ్ఛాలు 3-10 వరకు ఉంది రక్షకపత్రవళి వెలుపల ఒక వలయంగా ఏర్పడతాయి. దీనిని పుటదళోపరిచక్రపుచ్ఛావళి (Epicalyx) అంటారు.
  • రక్షకపత్రవళి - 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన.
  • ఆకర్షణపత్రవళి - 5, అసంయుక్తం, మెలితిరిగిన పుష్పరచన. ఇవి కేసరదండాల కలయికవల్ల ఏర్పడ్డ నాళంతో పీఠభాగంలో సంయుక్తంగా ఉంటాయి.
  • కేసరావళి అసంఖ్యాకం, మకుటాదళోపరిస్థితం, అనిశ్చితం, ఏకబంధకం (హైబిస్కస్), కేసరదండాలు సంయుక్తమై కీలం చుట్టూ కేసరనాళం ఏర్పడుతుంది.

ఆర్థిక ప్రాముఖ్యత

[మార్చు]

ముఖ్యమైన మొక్కలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=మాల్వేసి&oldid=3173827" నుండి వెలికితీశారు