ముహూర్త బలం
ముహూర్త బలం (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
తారాగణం | కృష్ణ, జమున |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | ఎం.వి.ఆర్. పిక్చర్స్ |
భాష | తెలుగు |
ముహూర్త బలం 1969, జూన్ 13వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో ఘట్టమనేని కృష్ణ, జమున, హరనాథ్, చిత్తూరు నాగయ్య నటించారు ఈ సినిమాకు సంగీతo కె. వి. మహదేవన్ అందించారు.
నటీనటులు
[మార్చు]- కృష్ణ -వేణు
- జమున - రాధ
- హరనాథ్ - కమలకు కాబోయే భర్త
- చిత్తూరు నాగయ్య - రాధ తండ్రి
- నాగభూషణం - భుజంగరావు
- రాజబాబు - పర్వతాలు
- అల్లు రామలింగయ్య - పానకాలు
- రావి కొండలరావు - కమలకు కాబోయే మామ
- విజయనిర్మల - కమల
- సూర్యకాంతం - కమలకు కాబోయే అత్త
- జ్యోతిలక్ష్మి
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- రాజేశ్వరి
- ఉదయలక్ష్మి
- బొడ్డపాటి
- ఎ.వి.సుబ్బారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: తురైయార్ మూర్తి
- సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
- పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, దాశరథి
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- సంగీతం: కె.వి.మహదేవన్
- నృత్యాలు: చిన్ని-సంపత్, తంగప్ప, గోపాలకృష్ణ
- కళ: బి.చలం
- పోరాటాలు: రాఘవులు అండ్ పార్టీ
- కూర్పు: మార్తాండ్
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
- నిర్మాతలు: వై.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద్, ఎం.వి.రామారావు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని గీతాలకు కె.వి.మహదేవన్ బాణీ కట్టాడు.[1]
క్ర.సం | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | "డోయ్ డోయ్ డోయ్ డోయ్ వస్తున్నాడోయ్ దిగి వస్తున్నాడోయ్" | సినారె | పి.సుశీల |
2 | "కాయ్ కాయ్ కావలికాయ్ కళ్ళుమూయ్ కాయలుకోయ్" | దాశరథి | పి.సుశీల |
3 | "బుగ్గ గిల్లగానే సరిపోయిందా గిల్లి గిల్లి గిల్లి నవ్వగానే సరిపోయిందా" | సినారె | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
4 | "అమ్మలగన్న అమ్మల్లారా అక్షింతలను వేయండి వేయండి" | ఆరుద్ర | పి.సుశీల బృందం |
5 | "నీకు ఎంత మనసుందో నాకు తెలుసునోయ్" | ఆరుద్ర | పి.సుశీల |
6 | "చిరుచేదు పానీయము చింతలను మరిపించులే" | దాశరథి | పి.సుశీల |
కథ
[మార్చు]వేణు చిన్ననాడే ఏదో తప్పు చేసినందుకు తాత చేతిలో తన్నులు తిని ఆవేశం, ఉద్రేకం పట్టలేక ఇంటి నుండి పారిపోతాడు. దేశాలు తిరిగి, డబ్బు సంపాదించి పద్నాలుగేళ్ళ తర్వాత స్వంత వూరికి వస్తాడు. ఈలోగా అతని తాత మరణిస్తాడు. చెల్లెలు కమల పెళ్ళీడుకొస్తుంది. చిన్ననాటి స్నేహితురాలు రాధ కూడా పెళ్ళీడుకు వచ్చి వేణు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. రాధపై కన్నుపడిన జమీందారు భుజంగరావు ఆ ఊళ్లో మకాం చేస్తాడు. ఎలాగైనా రాధను వశపరచుకోవాలని సెక్రెటరీ పర్వతాలు, వైద్యుడు పానకాలుతో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. దేశద్రిమ్మరియైన వేణుకు రాధను ససేమిరా ఇవ్వనని రాధ తండ్రి భీష్మించుకు కూర్చుని రాధకు వేరే సంబంధం తెస్తాడు. కానీ జమీందారు భుజంగరావు పానకాలు సహాయంతో రాధపై పెళ్ళివారికి లేనిపోనివి కల్పించి చెప్పించి ఆ సంబంధాన్ని వేణు చెల్లెలు కమలకు ఖాయం చేస్తారు. పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ జరుగుతుండగా తాము మొదట మాట ఇచ్చిన ప్రకారం రాధనే పెళ్ళి చేసుకుంటామని, కమల తమకు నచ్చలేదని పెళ్ళికొడుకు తన తండ్రి చేత వేణుకు ఉత్తరం వ్రాయిస్తాడు. ఈ సంగతి తెలిసిన రాధ తండ్రి ఎవరితో చెప్పకుండా ఆ వూరికి వెళ్ళి కమలనే పెళ్ళి చేసుకునేటట్టు పెళ్ళికొడుకునీ అతని తండ్రినీ ఒప్పిస్తాడు. రాధ తండ్రి ఊరిలో లేని సమయం చూసి భుజంగరావు రాధను ఎత్తుకుపోయి బలవంతంగా తాళి కట్టాలని ప్రయత్నిస్తాడు. ఇది తెలిసి వేణు పదిమందిని వెంటపెట్టుకు వెళ్ళి భుజంగరావును, అతని సలహాదారు పానకాలునూ చితకబాది రాధను రక్షిస్తాడు. ఇంతలో తిరిగివచ్చిన రాధ తండ్రి తన కూతురును వేణుకే ఇస్తానని, కమలకు అనుకున్న సంబంధాన్నే ఖాయం చేసి వచ్చానని శుభవార్త చెప్పడంతో కథ సుఖాంతమౌతుంది[2].
మూలాలు
[మార్చు]- ↑ ఈశ్వర్. ముహూర్తబలం సినిమా పాటల పుస్తకం. p. 8. Retrieved 18 August 2020.
- ↑ సంపాదకుడు (15 June 1969). "చిత్రసమీక్ష - ముహూర్తబలం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 18 August 2020.