రతన్ టాటా
రతన్ టాటా | |
---|---|
జననం | రతన్ నావల్ టాటా 1937 డిసెంబరు 28 |
మరణం | 2024 అక్టోబరు 9 | (వయసు 86)
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | కార్నెల్ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
బిరుదు | చైర్మన్ ఎమిరైటస్, టాటా సన్స్, టాటా గ్రూపు [2] |
పదవీ కాలం | (1991–2012) (2016–2017) |
అంతకు ముందు వారు | జె.ఆర్.డి.టాటా |
తరువాతివారు | సైరస్ మిస్ట్రీ (2012) నటరాజన్ చంద్రశేఖరన్ (2017-ప్రస్తుతం) |
తల్లిదండ్రులు | నవల్ టాటా |
బంధువులు | నోయల్ టాటా |
పురస్కారాలు | పద్మవిభూషణ (2008) పద్మభూషణ (2000) |
రతన్ నవల్ టాటా (ఆంగ్లం: Ratan Naval Tata; 1937 డిసెంబరు 28 - 2024 అక్టోబరు 9) భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూపునకు చైర్మన్ గా ఉన్నారు. తరువాత అక్టోబరు 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూఫునకు ఇంటెరిమ్ చైర్మన్ గా ఉన్నారు. టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా కొనసాగుతున్నారు. [3][4] అతను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు.[5] అతను వ్యాపారంలో విలువలు, దాతృత్వానికి గుర్తింపు పొందారు.[6][7]
ఆయన 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడుగా జన్మించాడు. అతను అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ల పూర్వ విద్యార్థి.[8] అతను 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేసేటప్పుడు తన కంపెనీలో చేరారు, 1991లో జె.ఆర్.డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత అతనికి వారసునిగా భాద్యతలు చేపట్టారు. అతను టాటాను ఎక్కువగా భారత-కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో అమెరికన్ టీ కంపెనీ టెట్లీని సంపాదించడానికి టాటా టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను సొంతం చేసుకోవడానికి టాటా మోటార్స్, టాటా స్టీల్ ఐరోపా (కోరస్)ను సంపాదించడానికి టాటా స్టీల్ ను పొందారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి 10వేలకోట్ల టర్నోవర్‌గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం, ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
మరణం
[మార్చు]ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా 2024 అక్టోబరు 9న 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.[9] రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో అక్టోబరు 7న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యులు చికిత్స అందించారు.[10]
మూలాలు
[మార్చు]- ↑ Kapor, Uday. "Oral History of Ratan Tata". YouTube. Computer History Museum [live interview 19 January 2017]. Retrieved 12 September 2018.
- ↑ Tata.com. "Tata Sons Board replaces Mr. Ratan Tata as Chairman, Selection Committee set up for new Chairman via @tatacompanies". Archived from the original on 24 October 2016. Retrieved 24 October 2016.
- ↑ "Ratan Tata is chairman emeritus of Tata Sons". The Times of India.
- ↑ Masani, Zareer (5 February 2015). "What makes the Tata empire tick?". The Independent (UK). Retrieved 30 April 2016.
- ↑ "List of Fellows — Royal Academy of Engineering". Raeng.org.uk. Archived from the original on 8 జూన్ 2016. Retrieved 2 December 2015.
- ↑ Babu, Santhosh (27 December 2012). "Why Ratan Tata is a role model for India Inc". Yahoo! Finance India.
- ↑ Tata, Ratan (17 March 2005). "We never compromised on ethics: Tata". Rediff.
- ↑ https://www.tata.com/management-team#//management-team/rnt
- ↑ "Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత | ratan-tata-passed-away". web.archive.org. 2024-10-09. Archived from the original on 2024-10-09. Retrieved 2024-10-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Ratan Tata no more; Business Titan dead at 86". Deccan Herald. 9 October 2024. Retrieved 9 October 2024.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- భారతీయ పారిశ్రామికవేత్తలు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- టాటా కుటుంబం
- 1937 జననాలు
- 2024 మరణాలు