రత్నగిరి కోట
రత్నగిరి కోట | |
---|---|
రత్నగిరి | |
రత్నగిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ in భారతదేశం | |
భౌగోళిక స్థితి | 13°48′55″N 77°07′35″E / 13.81539°N 77.12626°E |
రకము | కోట |
స్థల సమాచారం | |
హక్కుదారు | భారత ప్రభుత్వం |
రత్నగిరి కోట ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రోళ్ల సమీపంలో రత్నగిరి గ్రామంలో ఉన్న ఒక దుర్గం. రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న దీనిని సీమ గోల్కొండ అని కూడా అంటారు.[1] భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది.[2]
చరిత్ర
[మార్చు]ఈ కోటకు, ఈ గ్రామానికీ ఇక్కడి రత్నగిరి అనే కొండ పేరిట ఆ పేర్లు వచ్చాయి. ఈ ప్రాంతపు ప్రారంభ చరిత్ర గురించి పెద్దగా తెలియదు.[3] చరిత్రకారులు రత్నగిరిని చాళుక్య రాజు మొదటి విక్రమాదిత్యిని (సా.శ. 655-680) శాసనంలో అదే పేరుతో పేర్కొన్న గ్రామంగా గుర్తించారు. ఈ శాసనం ప్రకారం, గ్రామం నలవాడి విషయం (జిల్లా)లో ఉంది; ఈ జిల్లాకు నాలాల పేరు పెట్టబడి ఉండవచ్చు, అయితే ఇది ఖచ్చితంగా చెప్పలేము. పాండ్యుల, చోళుల పాలనలో ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది.[1] జానపద కథల ప్రకారం, విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత, కవి అల్లసాని పెద్దన 500 బ్రాహ్మణ కుటుంబాలతో రత్నగిరికి వలస వచ్చాడు.[4]
17 వ శతాబ్దంలో, బీజాపూర్ సుల్తానేట్ సమీపంలోని సీరా పట్టణంపై నియంత్రణ సాధించి, సీరా ప్రభువులను రత్నగిరికి తరలించారు. మాన్యుస్క్రిప్ట్‌లలో రత్నగిరికి చెందిన అనేక మంది స్థానిక ముఖ్యుల పేర్లు ఉన్నాయి గానీ వారి గురించి సమాచారం పెద్దగా లేదు. ఈ నాయకులలో రంగప్ప నాయుడు, రాయప్ప రాజు, పెద్ద రాయన్న రాజు (1657లో పాలించారు), లక్ష్మణ నాయుడు (1727లో పాలించారు) ఉన్నారు. లక్ష్మణనాయుడు మరాఠాలు విధించిన పన్ను - చౌత్ - వసూలుకు బాధ్యత వహించినట్లుగా తెలుస్తోంది. అతను మరాఠా సామంతుడని ఇది సూచిస్తుంది.[3]
1727 తర్వాత కొంతకాలానికి, మైసూర్ రాజ్యం, ఈ కోటపై నియంత్రణ సాధించింది. అయితే 1746 లో స్థానిక నాయకుల కుటుంబం మైసూరు దళాలను తొలగించింది. తరువాత, మైసూరు పాలకుడు హైదర్ అలీ మళ్ళీ ఈ కోటను స్వాధీనం చేసుకుని, స్థానిక నాయకుణ్ణే దానికి అధిపతిగా నియమించాడు. 1792 లో హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ సెరింగపట్నం ముట్టడి సమయంలో ఈస్టిండియా కంపెనీతో పోరాటాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, స్థానిక అధిపతి తిరుగుబాటు చేసి మైసూరు ఆధిపత్యాన్ని పడగొట్టాడు. బ్రిటిషు వారితో సెరింగపట్నం ఒప్పందంపై సంతకం చేసిన తరువాత టిప్పు సుల్తాన్, రత్నగిరి కోటను ముట్టడించి దానిని ధ్వంసం చేశాడు. అతను 6 నెలల సుదీర్ఘ ముట్టడి తర్వాత కోటను స్వాధీనం చేసుకున్నాడు. స్థానిక దండులోని అనేక మంది సైనికులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు.[3]
నిర్మాణాలు
[మార్చు]ఈ కోట రత్నగిరి, వెంకటగిరి అనే రెండు కొండలపై విస్తరించి ఉంది.[3] కోటలో శిధిలమైన పట్ట్రప్ప దేవాలయంతో సహా అనేక నిర్మాణాలున్నాయి.[5] వీటిలో పెద్ద మెట్ల బావి ఒకటి. దీనిని రాణి కోసం ఈత కొలనుగా నిర్మించారు. రాణి స్నాన ప్రదేశంలో కృష్ణుని మందిరం కూడా ఉంది. రాణి స్నానం చేసిన తర్వాత ఇక్కడ పూజ చేసేది. పాల బావి అనే మరో మెట్ల బావిని కొల్హాపురమ్మ దేవత ఆలయాన్ని సందర్శించే భక్తులు ఉపయోగిస్తారు.[1] సమీపంలో ఒక పురాతన జైన దేవాలయం ఉంది.[3]
- ↑ 1.0 1.1 1.2 Hoskote Nagabhshanam (2022-07-24). "High tourism potential Ratnagiri fort is in ruins". Deccan Chronicle. Retrieved 2022-08-19.
- ↑ "Revenue from monuments in Andhra Pradedsh" (PDF). Ministry of Tourism, Government of India. 2021-12-16. Retrieved 2022-08-19.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 Census of India, 1961: Anantapur district. Vol. 2. Registrar General of India. 1962. p. 160.
- ↑ Hoskote Nagabhshanam (2017-01-14). "Egyptian vultures at Ratnagiri Fort hill". Deccan Chronicle. Retrieved 2022-08-19.
- ↑ Rakesh Tewari, ed. (2016). "Indian Archaeology 2011-12 - A review" (PDF). Archaeological Survey of India. p. 187. Retrieved 2022-08-19.